
Daily Horoscope 19/06/2021 :
ఓం శ్రీ గురుభ్యోనమః
శుభమస్తు
19, జూన్ , 2021
స్వస్తి శ్రీ చాన్ద్రమాన ప్లవ నామ సంవత్సరమ్
జ్యేష్ఠమాసము
గ్రీష్మ ఋతువు
ఉత్తరాయణము స్థిర వాసరే
( శని వారం )
శ్రీ ప్లవ సంవత్సర దేవతా ధ్యానమ్
అగ్నిం నమామి సతతం జ్వాలామాలం తమోపహమ్ ౹
అజారూఢం చతుర్హస్తం ద్విశీర్షం ప్లవసంజ్ఞికమ్ ౹౹
రాశి ఫలాలు
మేషం
అనుకున్నది సాధించడానికి కాస్త ఎక్కువ శ్రమించాల్సి వస్తుంది. బంధుమిత్రుల వల్ల ధనవ్యయం జరుగుతుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. శ్రీ రామ నామస్మరణ ఉత్తమ ఫలితాన్నిస్తుంది.
వృషభం
ఉద్యోగంలో మిశ్రమ ఫలితాలున్నాయి. నిర్ణయాలు తీసుకోవడంలో ఇబ్బందిపడతారు. నిందారోపణలు చేసేవారున్నారు. కలహాలకు దూరంగా ఉండాలి. ప్రశాంతత కోసం Daily Horoscope 19/06/2021
సాయిబాబా సందర్శనం ఉత్తమం.
మిధునం
అభివృద్ధిని సాధిస్తారు. కీలక నిర్ణయాలు ఫలిస్తాయి. మీలోని పట్టుదల మిమ్మల్ని ఉన్నతుల్ని చేస్తుంది. ఆరోగ్యం అనుకూలంగా ఉంది.
దుర్గా దేవిని సందర్శిస్తే మంచి జరుగుతుంది.
కర్కాటకం
మీ రంగాల్లో అనుకూల వాతావరణం ఉంటుంది. ఒక ముఖ్యమైన పనిని ఎట్టకేలకు పూర్తిచేస్తారు. బాధ్యతలు పెరుగుతాయి. వ్యాపారంలో ఆర్థికంగా ఎదుగుతారు. ఈశ్వరుడిని ఆరాధిస్తే మంచిది.
సింహం
శుభకాలం. ముఖ్య పనుల్లో విజయం సాధిస్తారు. తోటివారి సలహాలు అనుకూలిస్తాయి. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. ఆదిత్య హృదయం చదవడం వల్ల ఆత్మశక్తి పెరుగుతుంది.
కన్య
ప్రణాళికలను అమలు చేసే దిశగా ముందుకు సాగండి. బలమైన ఆహారాన్ని తీసుకోవాలి. శత్రువుల జోలికి పోకూడదు. వృథా ప్రయాణాల వల్ల నిరుత్సాహం కలుగుతుంది. Daily Horoscope 19/06/2021
దుర్గారాధన వల్ల మేలు జరుగుతుంది.
తుల
మీ మీ రంగాల్లో అలసట చెందకుండా చూసుకోవాలి. ముందుచూపుతో వ్యవహరిస్తే మేలు జరుగుతుంది. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. సానుకూల పరిస్థితులు ఏర్పడతాయి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సందర్శనం శ్రేయోదాయకం.
వృశ్చికం
ప్రయత్నాలు ఫలిస్తాయి. మీకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తారు. ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమించేందుకు కృషి చేస్తారు. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం.
శని ధ్యానం శుభప్రదం.
ధనుస్సు
మొదలు పెట్టిన పనుల్లో ఆశించిన ఫలితాలను రాబట్టడానికి బాగా కష్టపడాల్సి వస్తుంది. భోజన నియమాలను పాటించడం ఉత్తమం. గిట్టనివారితో దూరంగా ఉండటం మేలు.
శ్రీవారి దర్శనం శుభాన్నిస్తుంది.
మకరం
ఆటంకాలను అధిగమిస్తారు. మీ ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. కుటుంబ సభ్యులతో ఒక శుభవార్తను పంచుకుంటారు. శుభ కార్యక్రమాల్లోమ పాల్గొంటారు. శ్రీవారి సందర్శనం శుభప్రదం.
కుంభం
వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో మీరు ఆశించే ఫలితాలు వస్తాయి. చేపట్టే పనుల్లో ఆటంకాలు ఎదురైనా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే మంచి ఫలితాలు సిద్ధిస్తాయి.
లక్ష్మీ అష్టోత్తర శతనామావళి పఠిస్తే మేలు.
మీనం
మొదలు పెట్టిన పని సులువుగా పూర్తవుతుంది. నలుగురిలో మంచి పేరు సంపాదిస్తారు. జన్మస్థానంలో చంద్ర బలం అనుకూలంగా ఉంది. కుటుంబ సౌఖ్యం కలదు. Daily Horoscope 19/06/2021
ఇష్టదైవాన్ని ప్రార్థిస్తే మంచిది.
Panchangam
శ్రీ గురుభ్యోనమః 🙏🏻
శనివారం, జూన్ 19, 2021
శ్రీ ప్లవ నామ సంవత్సరం
ఉత్తరాయణం – గ్రీష్మ ఋతువు
జ్యేష్ఠ మాసం – శుక్ల పక్షం
తిథి:నవమి మ2.35తదుపరి దశమి
వారం :శనివారం (స్థిరవాసరే)
నక్షత్రం:హస్సా5.06 తదుపరి చిత్ర
యోగం:వరీయాన్ రా9.25 తదుపరి పరిఘము
కరణం:కౌలువ మ2.35 తదుపరి తైతుల రా1.33 ఆ తదుపరి గరజి
వర్జ్యం :రా12.39 – 2.10
దుర్ముహూర్తం :ఉ5.30 – 7.14
అమృతకాలం:ఉ11.21 – 12.53
రాహుకాలం;ఉ9.00 – 10.30
యమగండం/కేతుకాలం:మ1.30 – 3.00
సూర్యరాశి:మిథునం
చంద్రరాశి: కన్య
సూర్యోదయం:5.30
సూర్యాస్తమయం:6.32 Daily Horoscope 19/06/2021