
The Divine History of Sri Venkateswara : శ్రీ వేంకటేశ్వర దివ్య చరిత్ర-10 బాగుగా ఆలోచించి, బ్రహ్మ, శివుడు ఉండు వెండికొండకు వెడలినాడు. బ్రహ్మరాకకు శంకరుడానందమును వ్యక్తమొనర్చుచు, ఆయనకు సకల మర్యాదలు చేసి, గౌరవించి, ఉచితాసన మలంకరింపజేసి
‘విధాతా! విశేషములేమైన నున్నచో నెఱిగించెదవా! అనెను.
అనగానే ‘‘శంకరా! భక్తవశంకరా! లక్ష్మీదేవి ఎడబాటు వలన శ్రీమహావిష్ణువు భూలోకమున శేషాచలమును చేరి ఒక పుట్టలో నివసించడము ప్రారంభించాడు. The Divine History of Sri Venkateswara
నిద్రాహారములు లేక శుష్కించి, శ్రీమన్నారాయణుడు ఆ పుట్టలో నున్నాడు.
ఉపవాసములతో ఆయన దినదినమునూ కృశించుచున్నట్లు నారదుని వలన తెలిసినది. కనుక మనమీ దశలో నారాయణునకు ఉపకారము చేయవలసియున్నది.
మన మిరువురమూ ఆవు యొక్క దూడయొక్క రూపములు ధరించి నారాయణుడున్నటు
వంటి పుట్టను చేరి ఆయనకు ఆహారముగా పాలనిచ్చిన, కొంతలో కొంత ఆయన కుపకారము చేసినవారమగుదుము’’ అనినాడు బ్రహ్మదేవుడు.
అది విని శంకరుడు ‘‘విధాతా! అంతకన్న మనకు కావలసినదేమున్నది? ఆపదయందున్నవారి నాదుకొనుటకన్న గొప్ప యగునదేమున్నది?
అదియును గాక నారాయణుని పట్ల ఆ మాత్రము వ్యవహరించుట మనకు విధిగా నెంచుట తగును. నీ వనినట్లే చేయుదుము’’ అన్నాడు.
మన కార్యములు సాధించుటకు సంధానము చేయు వారలు ఎప్పుడూ కావలసియే వుండును గదా! అందువల్లనే బ్రహ్మ, శివుడూ యిద్దరూ సరాసరి భూమండలానికి వెళ్ళి కొల్లాపురము చేరినారు.
అచ్చట తపస్సు చేసుకొనుచున్న రమాదేవిని దర్శించి ‘‘అమ్మా కోపము చాలా చెడు వస్తువు సుమా!
చూడు నీవు విష్ణువు పై కోపగించి భూతలానికి వచ్చేసిన కారణముగా పండంటి మీ సంసారములో కలతల అగ్ని కణాలు రేగాయి,
అవి మీ సంతోషాన్ని దహించివేశాయి. విష్ణువు విషయము నీకు తెలిసిందా అమ్మా

ఆయన యిప్పుడు మునుపటివలె కళాకాంతులతో చిరునవ్వులు చిందించే విష్ణువు కాదు. దైన్యదశలోనున్నాడు.
నీకై క్షణమొక యుగముగా భూతలమునకు వచ్చి వెదకుచూ వెదకి వెదకి వేసారి శేషాద్రిచేరి, అక్కడున్న ఒక పుట్టలో తలదాచుకొని నిద్రాహారములు లేక దిగాలు పడి శుష్కించి శుష్కించి వున్నాడు. The Divine History of Sri Venkateswara
ఆయన కెట్లయిననూ ఆహారము నందించవలెననీ మా కోరిక, ఇందుకై నీవు చేయవలసిన ఉపకారము ఒకటి లేకపోలేదు. మేము ముగ్గురము ఆనందించవలెననీ మా కోరిక.
మేము యావుదూడల రూపములు ధరించెదము నీవు గొల్లభామ వేషం ధరించి ఆవు దూడలమయిన మమ్ము తోలుకొని చోళరాజునకు అమ్మవలెను.
ప్రతిదినమూ ఆ చోళరాజు యొక్క మందతో కలసివెళ్ళి మేము పుట్టలో నున్న శ్రీమహా విష్ణువునకు క్షీరాహారము నిచ్చుట ప్రారంభించెదము,
కనుక మా కోరిక మన్నించవలెనని అన్నారు. విధాత, శంకరుల మాటలకు లక్ష్మీదేవి వెనువంటెనే సమ్మతించినది.
శ్రీ వేంకటేశ్వర దివ్య చరిత్ర-11
ఆదుకున్న ఆవుదూడలు
అందము చిందే ఆవు రూపము ధరించాడు బ్రహ్మదేవుడు. సొగసులు మెరిపించే దూడ రూపము ధరించాడు శంకరుడు.
లక్ష్మీదేవి సరేసరి! అచ్చు గొల్లభామగా మారిపోయినది.
చంద్రగిరిని చోళరాజు పాలిస్తుండేవాడు. ఆ చోళరాజు చెంతకు ఆ ఆవునూ, దూడనూ తోలుకొని గొల్లభామ రూపము ధరించిన లక్ష్మీదేవి వెడలినది.
చోళరాజునకూ, ఆయన భార్యకూ వానిని చూపించినది. సర్వశుభ లక్షణాలతో విలసిల్లి పుష్టిగా ఉత్సహంగానున్న యావుదూడలను చూచి చూడడముతోనే వారికి అవి నచ్చినవి. గొల్లభామ వద్ద వాటిని కొన్నారు.
భలే ‘మంచి బేరము’ అనుట తోడనే గొల్లభామ మెల్లమెల్లగా తన దారిన తాను వెడలిపోయినది.
చోళరాజు భార్యకు ఒక క్రొత్త కోరిక చిగురించింది. భర్తతో అన్నది గదా! ‘‘నాథా మన ఆవులమందలో ననేకము లయిన ఆవులున్నవి. కాని ఈ ఆవుపాలే ప్రతిదినము పోయబడునట్లుగా మీరు చూడవలెను.”
భర్త దాని కిష్టపడి పశువుల కాపరిని పిలచి ‘‘ఓయీ! నీవు ఈ గోవును కన్నులందు బెట్టుకొని కాపాడుచూ దీని పోషణ, రక్షణ మున్నగునవి చూచుచుండవలెను.
జాగ్రత్తగా దీనిని పెంచడమే కాదు. ప్రతిదినము దీని పాలను జాగ్రత్తగా పితుకుతూ మాకిచ్చుచుండవలెను’’యనెను.
సరేయని బుర్రనూపెను గోపాలుడు.
తన మందకు నాటి నుండి దానిని జోడించి మేతకు తోలుకొనిపోవుట, తీసుకొని వచ్చుట చేయుచుండెను. అతడు ప్రతిదినము మందను శేషాచలమునకే తోలుకువెళ్ళుచుండెడివాడు. The Divine History of Sri Venkateswara
మిగిలిన పశువులు మేతను మేయుచుండగా, క్రొత్తగా వచ్చిన ఆవు మేత మేయుచుండెడిది కాదు. నిజమునకది పశువు కాదు కదా! మందతో పాటు వెళ్ళినప్పటికిన్నీ,
రహస్యముగా ఆ యావుపోయి శ్రీమహావిష్ణువు తలదాచుకొనిన పుట్టను చేరుచుండెడిది. చేరి ఆ పుట్టలో క్షీరధారలను కురిపించి, అప్పుడు మాత్రము తిరిగివచ్చి మందలో కలిసిపోయేది.
దూడ దానికెంతో సంతోషించెడిది. దినదినమూ ఆ యావుదూడలు కలసి వెడలెడివి. పుట్టలో పోయబడిన పాలను ఆవురావుమంటూ యాకలితోనున్న శ్రీమహావిష్ణువు త్రాగుచుండెను,
ఈ విధముగా రోజూ జరుగుచుండెను.
ఆ యావు పుట్టలో క్షీరధారలు తన పొదుగు నుండి అదుపులేకుండగా పోయుచునేయుండెను. కాని అందువలన చోళరాజుగారి బిడ్డకు పాలు కఱువగుచుండెను.
ఇంటిలో పాలిచ్చిన గదా బిడ్డపోషణ. పాలు లభించని సంగతిని గ్రహించి చోళరాజు భార్య కోపాలు పెంచుకొని గోపాలుని పిలిపించింది.