Home Bhakthi The Divine History of Sri Venkateswara :

The Divine History of Sri Venkateswara :

0
The Divine History of Sri Venkateswara :
The Divine History of Sri Venkateswara - 68

The Divine History of Sri Venkateswara :శ్రీ వేంకటేశ్వర దివ్య చరిత్ర-8 – శేషాద్రి యొక్క పుట్టు పూర్వోత్తరములు – వాయుదేవుడు ఏ వస్తువు నయిననూ అవలీలగా కదలించగల శక్తి సంపన్నుడు.

ఆదిశేషుని యొక్క శక్తికి అవధియే లేదు కదా! శక్తిసంపన్నులయిన వీరికి పూర్వము తగవు యేర్పడింది.

ఆ వాదన ఎటూ తెగకపోవడంతో స్వామివారే లేచి వచ్చి వారిద్దరిలో ఎవరు బలవంతులో తేల్చుకొనేందుకు ఓ మార్గం చెప్పారు

‘‘ఆనంద పర్వతమొక్కటి యున్నదని మీకు తెలిసియేయున్నది కదా!

ఆ యానందపర్వతము మేరు పర్వతము నుండి పుట్టినది. అది చాలా గొప్ప కొండ, దానిని కదలించుట మహాశక్తి సంపన్నులకు గానీ సాధ్యము కాదు. The Divine History of Sri Venkateswara

మీలో ఎవ్వరకు దానిని కదలింపగలరో, వారే అధికశక్తి కలవారనీ తెలియుటకు వీలుండును.

ఈపరీక్షకు మీరంగీకరింతురా?’’ అనెను వారు వెంటనే, ‘‘అంగీకరించినాము’’ అని బలదర్పములతో పలికి, ఆనందపర్వతము వద్దకు వెళ్ళారు.

ఆదిశేషుడు ఆనందపర్వతాన్ని గట్టిగా చుట్టాడు. పుంజుకున్న బలముతో దానిని కదుప జూచినాడు.

ఎంత ప్రయత్నించిననూ ఫలితము శూన్యమైనది. ఆశ్చర్యము? సమస్త భారమును వహింపగల ఆదిశేషుడు ఆనంద పర్వతమును ఇసుమంతయినా కదపలేక పోయాడు,

మరియొక ఆశ్చర్యము! సుడిగాలిగాను తుఫానుగాను వచ్చి, ఎంతటి బలవత్తరమయిన వస్తువునైనను చలింపజేయగల వాయుదేవుని ప్రయత్నములు కూడా వమ్మయిపోయినవి.

ఆదిశేషుడు, వాయుదేవుడు ఇద్దరునూ వారి వారి బలములను జూపి ఆనంద పర్వతమును కదలించవలెనని చివరివరకూ చాలా ప్రయత్నించారు కాని, యే మాత్రమూ లాభము లేకపోయినది.

వారిద్దరి పట్టుదలల వలన ఆనంద పర్వతము మీద నివసించు వాయుదేవుని మహోన్నత విజ్ఞంభణ శక్తికి లోకములోనే అలజడి ప్రారంభమయి హెచ్చసాగినది.

సర్వప్రాణులకు వాయువు ముఖ్యము కదా! ఇంద్రుడు ఆదిగా గల దేవతలు దీనికి ఒక పరిష్కార మత్యంతావశ్యకమని అనుకున్నారు. వారు ఆదిశేషుని వద్దకు బయలుదేరి వెళ్ళారు.

The Divine History of Sri Venkateswara
The Divine History of Sri Venkateswara

వినయముగా ఆదిశేషునకు నమస్కరించి యీ విధముగా అన్నారు.

‘‘స్వామీ ఇవి ఏమి మీ పట్టుదలలు? యుక్తాయుక్త విచక్షణలు తెలిసిన మీరే యీ విధముగా ఇతర ప్రాణులకు భీతిగొలుపు విధముగా వ్యవహరించుట ధర్మమా? The Divine History of Sri Venkateswara

మీ నుండి గదా ధర్మాధర్మములు మేము నేర్చుకొనవలసియున్నది!

ఆ వాయుదేవుని భయంకర విజ్జృంభణమునకు లోకములు అల్లాడిపోవుచున్నవి.

మీరు భూతహితైక దృష్టిని పూర్తిగా యోచించి, యీ ఆనంద పర్వత చలన ఘనకార్య జనితోపద్రవమును తప్పించవలసియున్నది.

ఇందులకు మీరే సహస్ర విధముల నర్హులు, మా యెడల కరుణాదృష్టి గలిగి మీరైన పట్టు సడలించగోరుచున్నాము.’’

ఆదిశేషుని యొక్క హృదయము ప్రాణికోటి యెడల చల్లబడినది. వారల మొరవిని, యాతడు తన పట్టుదలను కొంచెము సడలించెను. పట్టును ఎప్పుడయితే ఆదిశేషుడు సడలించాడో, వాయుదేవునికి పని సులువయ్యెను.

వెనువెంటనే వాయుదేవుడు ఆనంద పర్వతమును ఆకాశమార్గమునకు ఎగర గొట్టినాడు.

ఎగరగొట్టబడిన ఆ పర్వతము వెళ్ళి భూలోకము నుండి వరాహక్షేత్రములో స్వర్ణముఖీ నదీ తీరానబడినది.

శేషుని కారణముగానే భూలోకమునకు ఆ పర్వతము వచ్చినది. ఆ కారణముగానే ఆ పర్వతానికి శేషాద్రియను పేరు వచ్చినది.

శేషాద్రిని దర్శించిన మాత్రముననే సర్వపాపములూ పటాపంచలగుననుట సందేహము లేని విషయము.

ఓం నమో వెంకటేశాయ!!

శ్రీ వేంకటేశ్వర దివ్య చరిత్ర-9

లక్ష్మీదేవికై నారాయణుని అన్వేషణ

మతి స్తిమితము లేనివానివలె శ్రీమన్నారాయణుడు తన ప్రియసతి లక్ష్మీదేవిని వెదకుచూ ఎక్కడనూ గానక బాధపడుచుండెను.

రెండు కన్నులను వేయి కన్నులుగా భావించుకొని చూడ ప్రదేశము లేకుండగ చూచుచుండెను. తిరుగనిచోటు లేకుండగ తిరుగుచుండెను. ఎన్నియో కొండలకు ఆయన పాదస్పర్శ లభించినది.

ఎన్నియోప్రదేశములు ఆయన ఆగమనముతో పవిత్రములయినవి. తలక్రిందుల జపము చేసినను స్వర్గమునకేగి నారాయణుని దర్శించుట కష్టమే, అట్టిది ఎందరికో ఆటవికులకు నారాయణుని అమోఘ దర్శన మగుచుండెను,

కాని ఆయన నారాయణునిగ వారికి తెలియ స్థితిలో లేకుండెను. లక్ష్మిని గూర్చి నారాయణుడు గూడ బాధపడవలసి వచ్చెను గదా.

నడచి నడచి ఆయాసమును పొందుటయే శరీరము తూలిపోవుచుండగా నారాయణుడు శేషాద్రి దగ్గరకు వచ్చి కొండొక కొండ పై ఒక చింతచెట్టును చేరినాడు.

లక్ష్మిని గూర్చిన చింత తప్ప మరొక్క చింత అతనికి లేకుండెను. చింతచెట్టు చెంత జేరిన నారాయణుడు ఆ చెట్టు నీడలో గల ఒక పుట్టను చూచినాడు. యెటులైనను యెవ్వరికినీ కనిపించకుండా కొన్నినాళ్ళుండవలెనని యోచించిన వాడయి శ్రీమన్నారాయణుడు ఆ పుట్టలో ప్రవేశించి అక్కడ నుండ జొచ్చెను. The Divine History of Sri Venkateswara

బ్రహ్మ, శివుడు గోవత్స రూపములు ధరించుట:

నారదుడు హుటాహుటీగా సత్యలోకమునకు వెడలినాడు. తండ్రి అయిన బ్రహ్మదేవునకూ, తనకూ చదువులకూ తల్లి అయిన సరస్వతీదేవికీ ప్రణామాలు చేసినాడు. ‘ఏమిటి విశేషాలు!’ అన్నాడు బ్రహ్మ.

‘తండ్రీ! లోగడ మీరు లోకోపయుక్తమయిన ఒక ఆలోచన నాకు చెప్పియున్నారు. ఆ ఆలోచన శ్రీమహావిష్ణువును భూలోకమునకు రప్పించుటను గూర్చి, అందుకై నేను చేసిన ప్రధమ ప్రయత్నము యొక్క ఫలితమును మీకు చెప్పుటకై వచ్చియున్నాను.

నా ప్రయత్నము వలన శ్రీ మహావిష్ణువునకూ, లక్ష్మీదేవికి ఎడబాటు కలిగినది. రమాదేవి కొల్లాపురములో తపస్సు చేస్తూయున్నది.

శ్రీ మహావిష్ణువు శేషాద్రిపై ఒక పుట్టలో నివసిస్తూ పాపము తిండీ తిప్పలు లేక, నిద్రలేక ఆరోజుకారోజు మిక్కిలి శుష్కించి పోవుచున్నాడు.

తండ్రీ! మీరేదియో ఒక విధముగ శ్రీమహావిష్ణువునకు ఆహారము లభించునట్లు చూడవలసినదని నారాయణుని యెడల గల తన సహజాభిమానముతో అభ్యర్థించాడు.

నారదుడు ఆ విధముగా అభ్యర్థించగా బ్రహ్మదేవుడు తన జనకుడయిన శ్రీమహావిష్ణువును గూర్చి యాలోచించసాగినాడు.

తండ్రి కష్టదశలోనున్నప్పుడు తనయుడతని కుపకరించి తీరవలెను గదా!

‘సరియే ఆ సంగతి నేను ఆలోచించి కార్యమున పెట్టెదను’ అనెను బ్రహ్మదేవుడు.

అది నారదునకు కొంత సంతోషమునకు కారణమయినది. శలవుగైకొని నారదమహాముని తన దారిన వెడలినాడు.

ఓం నమో వెంకటేశాయ నమః

Leave a Reply

%d bloggers like this: