Home Poetry Dhasharathi sathakam – ధాశరథీ శతకం

Dhasharathi sathakam – ధాశరథీ శతకం

0
Dhasharathi sathakam – ధాశరథీ శతకం
Dhasharathi sathakam - ధాశరథీ శతకం

Dhasharathi sathakam – ధాశరథీ శతకం

హాలికునకున్ హలాగ్రమున నర్థము సేకురుభంగి దప్పిచే
నలమట జెందువానికి సురాపగలో జల మబ్బినట్లు దు
ర్మలినఁమనోవికారియగు మర్త్యుని నన్నొఁడగూర్చి నీపయిన్
దలఁవు ఘటింపఁజేసితిని దాశరథీ కరుణాపయోనిధీ!

తాత్పర్యం: రైతునకు నాగేటి చివర భాగమున హఠాత్తుగా ధనము లభించినట్లుగా, మరియు దప్పికతో బాధపడువారికి గంగానదీ జలమబ్బినట్లుగా, చెడు బుద్ధిగల నన్ను చక్కజేసి, నా బుద్దిని నీపై తలపు కలిగించునట్లు చేసినచో ధన్యుడనయ్యెదను దయాంతరంగుడవగు భద్రాద్రిరామా! నీకు నమస్కారము.

Dhasharathi sathakam - ధాశరథీ శతకం
Dhasharathi sathakam – ధాశరథీ శతకం

కొంజక తర్కవాదమను – గుద్దలిచేఁబరతత్వభూస్థలిన్
రంజిలఁద్రవ్వి కన్గొనని రామనిధానము నేఁడుభక్తిసి
ద్దాంజన మందు హస్తగత మయ్యె భళీ యనగా మదీయహృ
త్కంజమునన్ వసింపుమిక దాశరథీ కరుణాపయోనిధీ!

తాత్పర్యం: సంకోచింపక తర్కవాదములను చేయుచూ, భూమిని గుద్దలితో తవ్విననూ కన్పించని నిధి యనెడి రాముని, ఇప్పుడు భక్తియనెడి సిద్ధాంజనమగు కాటుకయందు నీ దర్శనము లభించిన్నట్లుగా, ఇకమీద భక్తిచే నా హృదయ కమలమునందు నివశింపుము కరుణా సముద్రుడవగు భద్రాద్రిరామా! నీకు నమస్కారము.

Leave a Reply

%d bloggers like this: