Home PANCHANGAM Daily Horoscope 17/06/2021

Daily Horoscope 17/06/2021

0
Daily Horoscope 17/06/2021
Daily Horoscope 23/09/2022 

Daily Horoscope 17/06/2021

ఓం శ్రీ గురుభ్యోనమః
శుభమస్తు

17, జూన్ , 2021
స్వస్తి శ్రీ చాన్ద్రమాన ప్లవ నామ సంవత్సరమ్
జ్యేష్ఠమాసము
గ్రీష్మ ఋతువు
ఉత్తరాయణము బృహస్పతి వాసరే
( గురు వారం )

శ్రీ ప్లవ సంవత్సర దేవతా ధ్యానమ్
అగ్నిం నమామి సతతం జ్వాలామాలం తమోపహమ్ ౹
అజారూఢం చతుర్హస్తం ద్విశీర్షం ప్లవసంజ్ఞికమ్ ౹౹

 

రాశి ఫలాలు

మేషం

శుభకాలం. చిత్తశుద్ధితో విజయం సాధిస్తారు. స్వధర్మం మిమ్మల్ని కాపాడుతుంది. మనఃశ్శాంతి కలదు. శివారాధన వల్ల మంచి జరుగుతుంది Daily Horoscope 17/06/2021

వృషభం

ప్రారంభించిన పనులలో ఆటంకాలు ఎదురైనా అధిగమించే ప్రయత్నం చేస్తారు. భవిష్యత్తు ప్రణాళికలు వేస్తారు. కొన్ని సమయాల్లో అస్థిరబుద్దితో వ్యవహరిస్తారు. నవగ్రహ శ్లోకాన్ని పఠించాలి.

మిధునం

ప్రయత్నకార్యసిద్ధి ఉంది. మీదైన రంగంలో ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది. ధర్మసిద్ధి ఉంది. స్వస్థాన ప్రాప్తి సూచనలు ఉన్నాయి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన శుభప్రదం.

 కర్కాటకం

వృత్తి, ఉద్యోగాల్లో అనుకూలత కలదు. మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. కీలక వ్యవహారాల్లో వెనకడుగు వేయకండి. ప్రణాళికలకు అనుగుణంగా ముందుకు సాగండి. స్థిర నిర్ణయాలు విజయాన్ని ఇస్తాయి. గోవింద నామాలు చదవడం మంచిది.

సింహం

పూర్తి అవగాహనతో చేసే పనులు మంచి ఫలితాన్నిఇస్తాయి. తోటివారి సూచనలు ఉపకరిస్తాయి. వివాదాలకు దూరంగా ఉండాలి. ప్రశాంతంగా వ్యవహరిస్తే అన్నీ సర్దుకుంటాయి. దుర్గారాధన మంచి ఫలితాలను ఇస్తుంది

కన్య

ప్రారంభించిన కార్యక్రమాల్లో విఘ్నాలు ఎదురవుతాయి. మనోధైర్యంతో చేసే పనులు సిద్ధిస్తాయి. అనవసర ఖర్చులు పెరిగే సూచనలు ఉన్నాయి. లక్ష్మీఆరాధన, కనకధారాస్తవం పఠించాలి.

తుల

ముఖ్య విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలి. కొన్ని వ్యవహారాలలో ధైర్యంగా వ్యవహరించి అందరి ప్రశంసలు అందుకుంటారు. శివారాధన మంచిది. Daily Horoscope 17/06/2021

వృశ్చికం

ఈరోజు
మీ మీ రంగాల్లో శారీరక శ్రమ పెరుగుతుంది. గిట్టని వారితో మితభాషణం అవసరం. స్థాన చలనం సూచితం. అప్పుల వల్ల ఒత్తిడి పెరగకుండా చూసుకోవాలి. ఆంజనేయస్వామి ఆరాధన శుభదాయకం.

ధనుస్సు

ప్రారంభించిన పనులను సులభంగా పూర్తి చేస్తారు. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. ఒక వార్త ఉత్సాహాన్ని ఇస్తుంది. ప్రయాణాలు ఫలిస్తాయి. లక్ష్మీదేవి దర్శనం ఉత్తమం.

మకరం

పట్టుదల చాలా అవసరం. ఒత్తిడిని తగ్గించుకోవాలి. బంధుమిత్రులను కలుపుకొనిపోతారు. కొన్ని సంఘటనలు ఉత్సాహాన్నిఇస్తాయి. పెద్దల ఆశీర్వచనాలు ఉన్నాయి. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ఈశ్వరారాధన శుభప్రదం.🏺 కుంభం
అనుకున్నది సాధిస్తారు. మీ మీ రంగాల్లో పనులలో ఊహించిన ఫలితాలు వెలువడతాయి. కలహాలకు దూరంగా ఉండాలి. ఒక వ్యవహారంలో మీ ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. ఆదిత్య హృదయం పారాయణ చేస్తే బాగుంటుంది

మీనం

శ్రమ ఫలిస్తుంది. ప్రారంభించిన పనులను ప్రణాళికాబద్ధంగా పూర్తి చేయగలుగుతారు. ఒక శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. ఇష్టదైవారాధన మంచిది.

 

Panchangam

శ్రీ గురుభ్యోనమః
గురువారం, జూన్ 17, 2021
శ్రీ ప్లవ నామ సంవత్సరం
ఉత్తరాయణం – గ్రీష్మ ఋతువు
జ్యేష్ఠ మాసం – శుక్ల పక్షం
తిధి: సప్తమి సా5.49 తదుపరి అష్టమి
వారం:గురువారం(బృహస్పతివాసరే)
నక్షత్రం:పుబ్బ సా6.50 తదుపరి ఉత్తర
యోగం:సిద్ధి రా2.16 తదుపరి వ్యతీపాతం
కరణం:గరజి ఉ6.21తదుపరి వణిజ సా5.49 ఆ తదుపరి విష్ఠి తె5.06
వర్జ్యం:రా1.48 – 3.22
దుర్ముహూర్తం:ఉ9.50 – 10.42 & మ3.03 – 3.65
అమృతకాలం:మ12.30 – 2.05
రాహుకాలం: మ1.30 – 3.00
యమగండం/కేతుకాలం:ఉ6.00 – 7.30
సూర్యరాశి:మిథునం
చంద్రరాశి: సింహం
సూర్యోదయం: 5.29
సూర్యాస్తమయం: 6.32 Daily Horoscope 17/06/2021

Leave a Reply

%d bloggers like this: