Kumara Shatakam – కుమార శతకం
పనులెన్ని కలిగియున్నను
దిన దినముల విద్యపెంపు ధీయుక్తుఁడవై
వినఁగోరుము సత్కథలను
కని విబుధులు సంతసించు గతినిఁ గుమారా!
తాత్పర్యం: ఓ కుమారా! నీకు ప్రతిదినము పనులెన్ని యుండినప్పటికీ విద్య యందలి గౌరవముతో,పెద్దలయందున్న మెచ్చుకొనునట్లుగా మంచి మంచి కథలను పరిశీలించి వినుచుండును.

తనయుడు చెడుగై యుండిన
జనకుని తప్పన్నమాట సత్యమెఱుఁగుఁ నా
వున నీ జననీ జనకుల
కు నపఖ్యాతి యగురీతి గొనకు కుమారా!
తాత్పర్యం: ఓ కుమారా! కుమారుడు దుర్మార్గుడైన తండ్రిదే తప్పు అని యందురు. కాబట్టి నీ తల్లిదండ్రులకు అపకీర్తి వచ్చునట్టి మార్గమును పూనవలదు.