Home PANCHANGAM Daily Horoscope 16/06/2021

Daily Horoscope 16/06/2021

0
Daily Horoscope 16/06/2021
Daily Horoscope 15/08/2022 

Daily Horoscope 16/06/2021

ఓం శ్రీ గురుభ్యోనమః
శుభమస్తు

16, జూన్ , 2021
స్వస్తి శ్రీ చాన్ద్రమాన ప్లవ నామ సంవత్సరమ్
జ్యేష్ఠమాసము
గ్రీష్మ ఋతువు
ఉత్తరాయణము సౌమ్య వాసరే
( బుధ వారం )

శ్రీ ప్లవ సంవత్సర దేవతా ధ్యానమ్
అగ్నిం నమామి సతతం జ్వాలామాలం తమోపహమ్ ౹
అజారూఢం చతుర్హస్తం ద్విశీర్షం ప్లవసంజ్ఞికమ్ ౹౹

రాశి ఫలాలు

మేషం

భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని నిర్ణయాలు తీసుకుంటే మేలు జరుగుతుంది. ప్రయత్నకార్యసిద్ధి ఉంది. అవసరానికి తగినట్టు ముందుకు సాగడం మేలు. శివారాధన శుభాన్నిఇస్తుంది. Daily Horoscope 16/06/2021

వృషభం

పనులకు ఆటంకం కలుగకుండా చూసుకోవాలి. కుటుంబ సభ్యులతో ఆచితూచి వ్యవహరించాలి. మనోవిచారం కలుగకుండా చూసుకోవాలి. కోపాన్ని దరిచేరనీయకండి. ప్రయాణంలో ఆటంకాలు కలుగుతాయి.
శివారాధన శుభప్రదం.

మిధునం

శుభ సమయం. గొప్ప భవిష్యత్తు కోసం మంచి ఆలోచనలు చేస్తారు. కుటుంబ సభ్యులకు శుభకాలం. కీలక సమయాల్లో ధైర్యంగా వ్యవహరిస్తారు. అనవసర విషయాల పట్ల ఎక్కువ సమయాన్ని వెచ్చించకండి. శివారాధన శుభప్రదం

కర్కాటకం

మీకు అప్పగించిన బాధ్యతలను సమర్థంగా పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యుల సలహాలతో విజయాలు సాధిస్తారు. శారీరక శ్రమ పెరుగుతుంది. వివాదాలకు దూరంగా ఉండాలి. సాయిబాబా వారి సచ్ఛరిత్ర పారాయణ శుభాన్ని కలిగిస్తుంది.

 సింహం

గ్రహబలం బాగుంది. మీ మీ రంగాల్లో సంతృప్తికరమైన ఫలితాలను అందుకుంటారు. ఉద్యోగంలో అనుకూలత ఉంది. ఇష్టులతో కాలక్షేపం చేస్తారు. ముఖ్యమైన సందర్భాల్లో మొహమాటాన్ని దరిచేరనీయకండి. మహాలక్ష్మి సందర్శనం శుభప్రదం.

కన్య

అవసరానికి తగిన సహాయం అందుతుంది. విందు,వినోదాల్లో పాల్గొంటారు. సంపూర్ణ అవగాహన వచ్చిన తరువాతే పనులను ప్రారంభిస్తే మంచిది.
ఇష్టదైవారాధన శుభప్రదం.

తుల

మీ మీ రంగాల్లో సందర్భానుసారంగా ముందుకు సాగితే శుభఫలితాలు అందుకుంటారు. మీ పట్టుదలే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. అనవసర విషయాల్లో తలదూర్చకండి. లక్ష్మీధ్యానం మంచినిస్తుంది.

వృశ్చికం

ఉన్నతమైన ఆలోచనా విధానంతో అనుకున్నది సాధిస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది. Daily Horoscope 16/06/2021
సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం పఠించడం మంచిది.

ధనుస్సు

స్థిరమైన బుద్ధితో వ్యవహరిస్తే ఉద్యోగంలో ఉన్నతస్థితి ఏర్పడుతుంది. వ్యాపారంలో అనుభవజ్ఞుల సలహాలు అవసరం అవుతాయి. సకాలంలో ఆదుకునేవారు ఉన్నారు.
శివారాధన చేయడం మంచిది.

మకరం

చేపట్టే పనుల్లో అలసట పెరగకుండా చూసుకోవాలి. ముఖ్యమైన విషయాల్లో అలోచించి నిర్ణయాలు తీసుకోండి. కొందరి ప్రవర్తన కారణంగా ఆటంకాలు ఎదురవుతాయి. కీలక విషయాల్లో నిపుణులను సంప్రదించడం మంచిది. ప్రశాంతంగా ఆలోచించడం మంచిది.
విష్ణు సందర్శనం శుభప్రదం.

కుంభం

అనుకూల కాలం. మీ మనోధైర్యం మిమ్మల్ని గెలిపిస్తుంది. కొన్ని పరిస్థితులు మిమ్మల్ని నిరుత్సాహపరుస్తాయి. కొన్ని వ్యవహారాలలో బుద్ధిచాంచల్యంతో వ్యవహరిస్తారు.
విష్ణు నామస్మరణ ఉత్తమం. Daily Horoscope 16/06/2021

మీనం

శుభఫలితాలు ఉంటాయి. శ్రమకు తగిన ఫలితాలు ఉంటాయి. మనస్సౌఖ్యం ఉంది. బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు. ఆదిత్యహృదయం పఠించడం మంచిది.

 

Panchangam

ఓం శ్రీగురుభ్యోనమః
శుభమస్తుశ్రీ ప్లవ సంవత్సర దేవతా ధ్యానమ్
అగ్నిం నమామి సతతం జ్వాలామాలం తమోపహమ్ ౹
అజారూఢం చతుర్హస్తం ద్విశీర్షం ప్లవసంజ్ఞికమ్ ౹౹

తేది : 16, జూన్ 2021
సంవత్సరం : స్వస్తి శ్రీ చాంద్రమాన ప్లవ నామ సంవత్సరం
ఆయనము : ఉత్తరాయణము
ఋతువు : గ్రీష్మ ఋతువు
కాలము : వేసవి కాలం
మాసం : జ్యేష్ఠ మాసము
పక్షం : శుక్ల పక్షం
వారము : సౌమ్య వాసరే (బుధ వారము )
తిథి : షష్ఠి
( ఈరోజు రాత్రి 10 గం ౹౹ 41 ని ౹౹ వరకు )
నక్షత్రం : మఘ
( ఈరోజు రాత్రి 10 గం ౹౹ 10 ని ౹౹ వరకు )
యోగము : హర్షణ
( ఈరోజు పగలు 08 గం ౹౹ 05 గం ౹౹ వరకు )
కరణం : కౌలవ
( ఈరోజు పగలు 10 గం ౹౹ 47 గం ౹౹ వరకు )
అనంతరం
తైతుల
( ఈరోజు రాత్రి 10 గం ౹౹ 41 ని ౹౹ వరకు )
వర్జ్యం
(ఈరోజు పగలు 09 గం ౹౹ 54 ని ౹౹ లగాయతు 11 గం ౹౹ 32 ని ౹౹ వరకు )
అమృత ఘడియలు :
(ఈరోజు రాత్రి 07 గం ౹౹ 43 ని ౹౹ లగాయతు 09 గం ౹౹ 21 ని ౹౹ వరకు )
దుర్ముహూర్తం :
(ఈరోజు పగలు 11 గం ౹౹ 50 ని ౹౹ లగాయతు 12 గం ౹౹ 43 ని ౹౹ వరకు )
సూర్యోదయం : ఉదయం 05 గం॥ 45 ని॥ లకు
సూర్యాస్తమయం : సాయంత్రం 06 గం॥ 48 ని॥ లకు
సూర్యరాశి : మిథునం
చంద్రరాశి : కర్కాటకం
కార్తె : మృగశిర
శార్దతిధి: షష్ఠి Daily Horoscope 16/06/2021

Leave a Reply

%d bloggers like this: