Home Bhakthi Vaalmiki Ramayanam – 50

Vaalmiki Ramayanam – 50

0
Vaalmiki Ramayanam – 50
Vaalmiki Ramayanam -76
Vaalmiki Ramayanam – 50 సుగ్రీవుడు ” రామా ! నేను ఇలా అంటున్నానని ఏమి అనుకోవద్దు. మా వాలి పౌరుష పరాక్రమాలు అంటే ఏమిటో విన్నావు కదా! ఇది విన్న తరువాత కూడా నువ్వు వాలిని చంపగలనని అనుకుంటున్నావా? చంపగలిగే ధైర్యం ఉన్నదా? వాలి ఎన్నడూ ఎవరి చేత ఓడింపబడినవాడు కాదు.
జీవితంలో ఓటమి అన్నది వాలికి తెలియదు. వాలి పేరు చెబితేనే పారిపోతారు. పదిహేను సంవత్సరాలు రాత్రి – పగలు గోలభుడు అనే గంధర్వుడితో యుద్ధం చేసి ఆయనకి సంహరించాడు.
నీను ఇంకొక విషయము చూపిస్తాను. ఇక్కడ ఏడు సాలవృక్షములు వరుసగా ఉన్నాయి కదా! మా వాలి రోజూ సంధ్యావందనం అయ్యాక ఇక్కడికి వచ్చి ఈ పెద్ద సాలవృక్షాన్ని చేతులతో కదుపుతాడు.
ఆ కుదుపుకి లేత చిగురుటాకులు కూడా రాలిపోయి ఆ చెట్టు మోడుగా నిలబడుతుంది. వాలి బలం గురించి విన్నాక కూడా నీకు వాలిని చంపగలను అన్న ధైర్యం ఉన్నదా? ” అన్నాడు.
సుగ్రీవుడు చెప్పిన మాటలు విన్న లక్ష్మణుడు ఒక చిన్న నవ్వు నవ్వి ” మీ వాలి చాలా గొప్పవాడని చెబుతున్నావు కదా! వాలిని మా అన్నయ్య చంపగలడని ఏమి చేస్తే నువ్వు నమ్ముతావు? ” అని అడిగాడు. Vaalmiki Ramayanam – 50
సుగ్రీవుడు ” మా వాలి ఈ ఏడు చెట్లని కుదిపెయ్యగలడు. రాముడు పోని అంత చెయ్యక్కరలేదు. బాణం పెట్టి ఒక సాలవృక్షాన్ని కొడితే నేను నమ్ముతాను. ఆనాడు దుందుభి యొక్క శరీరాన్ని మా అన్నయ్య విసిరేస్తే అది యోజనం దూరం వెళ్ళి పడింది.
రాముడిని ఈ అస్థిపంజరాన్ని రెండు వందల ధనుస్సుల దూరం తన కాలితో తంతే నేను నమ్ముతాను ” అని లక్ష్మణుడితో అన్నాడు.
రాముడు ” సరే! అలాగే చేస్తాను. నీకు నమ్మకము కలిగించడము కోసం నువ్వు చెప్పిన పని తప్పకుండా చేస్తాను ” అన్నాడు.
రాఘవో దుందుభేః కాయం పాదాంగుష్ఠేన లీలయా |
తోలయిత్వా మహాబాహుః చిక్షేప దశయోజనమ్ ||
సుగ్రీవుడు చెప్పినట్టుగా రాముడు ఆ దుందుభి కళేబరాన్ని తన బొటను వేలితో తంతే అది పది యోజనముల దూరం వెళ్ళి పడింది. రాముడు సుగ్రీవుడి వంక నమ్మకము కుదిరిందా అన్నట్టు చూశాడు.
సుగ్రీవుడు ” ఆనాడు వాలి ఈ కళేబరాన్ని విసిరినప్పుడు ఇది రక్తమాంసాలతో పచ్చిగా చాలా బరువుగా ఉన్నది. అప్పటికే మా అన్నయ్య ఈ దుందుభితో చాలాసేపు యుద్ధం చేసి ఉన్నాడు, దానికితోడు తాగి ఉన్నాడు.
తన భార్యలతో రమిస్తూ బయటకి వచ్చాడు. అనేకరకములుగా బడలిపోయిన శరీరంతో ఉన్నాడు. రాముడు చాలా ఉత్సాహముగా ఉన్నాడు. మద్యాన్ని సేవించి లేడు పరీక్షకి నిలబడుతున్నాననే పూనికతో ఉన్నాడు.
ఆనాడు మా అన్నయ్య విసిరింది ఒక పచ్చి శరీరము. అది ఒక యోజనం వెళ్ళి పడింది. ఈనాడు రాముడు తన్నినది ఎండిపోయిన కళేబరము.
దానిని పదియోజనాలు తన్నడములో పెద్ద గొప్పేమున్నది? ఆ సాల వృక్షాన్నికూడా కొట్టమను నాకు కొంత నమ్మకము కలుగుతుంది మనం వాలిని సంహరించడానికి వెళదాము” అన్నాడు. Vaalmiki Ramayanam – 50
రాముడు ఒక బంగారుబాణాన్ని చేతితో పట్టుకొని వింటినారికి సంధించిగురి చూసి సాలవృక్షముల వైపు విడిచిపెట్టాడు. కనురెప్ప మూసి తెరిచే లోపల ఆ బాణము ఏడు సాలవృక్షాలనీ పడగొట్టి ఎదురుగా ఉన్నటువంటి పర్వత శిఖరాన్ని తొలిచి భూమిలో పాతాళలోకము వరకూ వెళ్ళి తిరిగొచ్చి రాముడి యొక్క అమ్ములపొదిలో కూర్చుండిపోయింది.
Vaalmiki Ramayanam - 50 
Vaalmiki Ramayanam – 50
రాముడి శక్తి ఏమిటో చూసిన సుగ్రీవుడు వెంటనే రాముడి పాదాలకి తన శిరస్సు తగిలేటట్టు పడిపోయాడు. అప్పుడాయన కిరీటం రాముడి పాదాల మీద పడిపోయింది.
సుగ్రీవుడు ” రామా ! నీ బాణానికి ఉన్న వేగం ఇంద్రుడి బాణానికి కూడా లేదు. నేను ఏమో అనుకున్నాను ఇంక వాలి ఏమిటి? నువ్వు బాణ ప్రయోగము చేస్తే వజ్రాయుధము పట్టుకున్న ఇంద్రుడి శిరస్సు కూడా కింద పడిపోతుంది. నీ బాణానికి ఉన్న వేగము సామాన్యమైనది కాదు. వాలి దగ్గరికి వెళదాము పద ” అన్నాడు.
“తప్పకుండా సుగ్రీవా ! బయలుదేరదాము” అని అందరూ బయలుదేరారు. ముందు సుగ్రీవుడు వేగంగా వెళుతున్నాడు. ఆయన వెనకాల రామలక్ష్మణులు, సుగ్రీవుడి మంత్రులైన హనుమంతుడు, నీలుడు, నలుడు మొదలైన వారు వెళుతున్నారు.
సర్వే తే త్వరితం గత్వా కిష్కింధాం వాలినః పురీమ్ |
వృక్షైఃరాత్మా నమావృత్య వ్యతిష్ఠన్ గహనే వనే ||
ముందు వెళుతున్న సుగ్రీవుడు కిష్కింద పట్టణంలోకి వెళ్ళిపోయాడు. మిగిలిన వారందరూ దట్టమైన చెట్ల చాటున పైకి కనపడకుండా దాగి ఉన్నారు.
లోపలికి వెళ్ళిన సుగ్రీవుడు గట్టిగా కేకలు వేసి వాలిని బయటకి రమ్మన్నాడు. సుగ్రీవుడు ఇంత ధైర్యముగా పిలిచేసరికి వాలి ఆశ్చర్యంతో బయటకి వచ్చి ” ఏరా బుద్ధిహీనుడా! మళ్ళీ వచ్చావు నా ప్రతాపము ఏమిటో చూద్దువు కాని రా! ” అన్నాడు.
వాలి తన పిడికిలిని బిగించి సుగ్రీవుడి శిరస్సు మీద ఒక్క దెబ్బ కొట్టాడు. ఆ దెబ్బకి సుగ్రీవుడి నవరంధ్రముల నుండి రక్తం ఏరులై పారింది. సుగ్రీవుడు తేరుకొని వాలిని కొట్టడము ప్రారంభించాడు, వాలి కూడా సుగ్రీవుడిని కొడుతున్నాడు.
ఇద్దరూ అలా మోచేతులతో పొడుచుకుంటు, పాదములతో కొట్టుకుంటు, శిరస్సులతో కుమ్ముకుంటున్నారు. కొంత సేపు కొట్టుకున్నాక ఇంకా బాణము వెయ్యడము లేదు రాముడు ఎక్కడున్నాడని సుగ్రీవుడు అటూ ఇటూ చూశాడు కాని రాముడు కనపడలేదు.
వాలితో యుద్ధం చెయ్యలేక సుగ్రీవుడు ఋష్యమూక పర్వతము మీదకి పారిపోయాడు. వాలి కూడా తిరిగి అంతఃపురానికి వెళ్ళిపోయాడు.
సుగ్రీవుడు ఆ ఋష్యమూక పర్వతం మీద ఒక శిల మీద కూర్చొని ఒంట్లోనుండి కారిపోతున్న రక్తాన్ని తుడుచుకుంటూ ఆయాసపడుతూ ఏడుస్తూ ఉన్నాడు. Vaalmiki Ramayanam – 50
లక్ష్మణుడితో కలిసి రాముడు అక్కడికి వచ్చాడు. వాళ్ళని చూడగానే సుగ్రీవుడు ” నేను నిన్ను వాలిని చంపమని అడిగానా ? నువ్వు వాలిని చంపుతానని ప్రతిజ్ఞ చేస్తేనే కదా! నేను యుద్ధానికి వెళ్ళాను.
నేను వాలిని చంపను అని నువ్వు ఒకమాట చెబితే నేను వెళతానా ? నన్ను ఇలా ఎందుకు కొట్టించావు ? ” అని రాముడిని ప్రశ్నించాడు.
రాముడు ” సుగ్రీవా ! నేను ఇంతకముందెన్నడూ వాలిని చూడలేదు. నువ్వు వాలితో యుద్ధం చేస్తున్నప్పుడు వాలి మీద బాణం వేద్దామని అనుకొని వచ్చాను. వాలి బయటకి వచ్చాక నేను విస్మయము చెందాను.
నువ్వు, వాలి ప్రతి విషయంలో ఒకేలా ఉన్నారు. మీరిద్దరూ దెబ్బలాడుకుంటుంటే అశ్విని దేవతలు దెబ్బలాడుకున్నట్టు ఉన్నది. మీలో ఎవరు వాలి? ఎవరు సుగ్రీవుడు ? నాకు తెలియలేదు.
కంఠస్వరంలో మార్పు ఉంటుందేమో అని చూశాను. ఇద్దరూ ఒకేలా అరిచారు. ఇద్దరూ ఒకేలా పరిగెడుతున్నారు. ఒకేలా అలంకారము చేసుకున్నారు. ఇద్దరూ ఒకే వేగంతో కొట్టుకుంటున్నారు.
ఎలాగో నిర్ణయించుకొని ఇతడే వాలి అయ్యుంటాడని బాణ ప్రయోగము చేస్తే సుగ్రీవా! అది తగిలినవాడు ఈ లోకమునందు ఉండడు. ఆ బాణము పొరపాటున నీకు తగిలితే నువ్వు నేను కూడా ఉండము.
గజ పుష్పీ మిమాం ఫుల్లాముత్పాట్య శుభలక్షణామ్ |
కురు లక్ష్మణ కంఠేఽస్య సుగ్రీవస్య మహాత్మనః ||
నిన్ను వాలికన్నా వేరుగా గుర్తుపట్టాలంటే ఒకటే లక్షణం ఉంది. లక్ష్మణా! అక్కడ గజపుష్ప తీగ ఒకటి పాకుతోంది. నువ్వు దానిని తీసి సుగ్రీవుడి మెడలో కట్టు.
పెద్ద పెద్ద పువ్వులచే విరాజితుడై సుగ్రీవుడు ఉంటాడు. అటువంటి మాల లేనివాడై వాలి ఉంటాడు. అప్పుడు నేను వాలిని నిగ్రహించగలను. ఇప్పుడు ఆ మాల వేసుకొని మళ్ళీ యుద్ధానికి వెళ్ళు ” అన్నాడు.
సుగ్రీవుడు సరే అని బయలుదేరాడు. ఆయన వెనకాల రాముడు, లక్ష్మణుడు, హనుమంతుడు మొదలైన వారు బయలుదేరారు. అలా వారు వెళుతూ లోయలని, నదులని, పర్వతాలని, చెట్లని చూసుకుంటూ వెళుతున్నారు.
వాళ్ళకి పక్కన నుంచి అక్షర సముదాయము చేత అవ్యక్తమైనటువంటి గంధర్వ గానం ఒకటి వినపడింది. అది వింటున్నప్పుడు వాళ్ళ మనస్సులకి ఆనందము కలుగుతోంది.
అక్కడ ఉన్న చెట్లపైకి పావురాల రంగులో పొగలు చుట్టుకొని ఉన్నాయి. రాముడు ఈ వనము ఏమిటి? అని సుగ్రీవుడిని అడిగాడు. సుగ్రీవుడు ఆగకుండా ముందుకి వెళ్ళిపోతూ ” రామా ! ఇక్కడ సప్తజనులు అనేటటువంటి ఏడుగురు ఋషులు ఉండేవారు. Vaalmiki Ramayanam – 50
వారు తలలు కిందకి పెట్టి, కాళ్ళు పైకి పెట్టి ఏడువందలు సంవత్సరాలు తపస్సు చేశారు. అలా తపస్సు చేస్తూ ప్రతి ఏడు రాత్రులకి ఒకసారి గాలిని తినేవారు.
వాళ్ళ తపస్సుకి ఇంద్రుడు ఆశ్చర్యపోయి సశరీరముగా స్వర్గలోకానికి తీసుకువెళ్ళాడు. వాళ్ళ తపోశక్తి ఇప్పటికీ ఈ వనంలో ఉన్నది. అందువలన క్రూరమృగం ఈ వనంలోకి వెళ్ళదు వెళితే ఇక తిరిగిరాదు. నువ్వు లక్ష్మణుడితో కలిసి నమస్కారము చెయ్యి ” అన్నాడు.
లక్ష్మణుడితో కలిసి రాముడు ఆ సప్తజనుల ఆశ్రమము వైపుకి తిరిగి నమస్కారం చేశాడు. వారు నమస్కారం చెయ్యగానే వాళ్ళ మనస్సులో గొప్ప ఉత్సాహము పుట్టింది.
వాళ్ళందరూ కిష్కింద చేరుకున్నాక సుగ్రీవుడు వెళ్ళి గట్టిగా తొడలు కొట్టి కేకలు వేసి వాలిని పిలిచాడు. వాలి గబగబా బయటకి వస్తుండగా ఆయన భార్య అయిన తార (తార సుషేణుడి కుమార్తె) ఆపి ” ఎందుకు అలా తొందరపడి వెళ్ళిపోతున్నావు.
సుగ్రీవుడు ఇప్పుడే ఒక గంట క్రితం వచ్చాడు కదా! నవరంధ్రములనుండి నెత్తురు కారేటట్టుగా నువ్వు కొడితే దిక్కులు పట్టి పారిపోయాడు కదా! నువ్వు ఇంట్లోకి వచ్చి ఎంతో సేపు కాలేదు. సుగ్రీవుడు వచ్చి నిన్ను యుద్ధానికి రమ్మంటున్నాడు. నీకు అనుమానం రావడం లేదా?
సుగ్రీవుడు వచ్చి ‘ వాలి యుద్ధానికి రా ‘ అంటున్నాడంటే నాకు శంకగా ఉన్నది. సుగ్రీవుడు నిన్ను ఇప్పుడు పిలవడములో నీకు తేడా కనపడడం లేదా? చాలా ధైర్యంగా పిలుస్తున్నాడు.
ఇప్పుడే దెబ్బలు తిని వెళ్ళినవాడిలో ఉండే బలహీనతలు కనపడడము లేదు. ఆ స్వరంలో ఒక పూనిక ఒక గర్వం కనపడుతున్నది. సుగ్రీవుడికి వెనకాల ఎవరిదో సహాయము ఉన్నది.
నువ్వు సుగ్రీవుడితో యుద్ధం చేసేటప్పుడు నీకు వేరొకరితో ప్రమాదం పొంచి ఉన్నది. సుగ్రీవుడికి స్నేహం చెయ్యడములో మంచి తెలివితేటలు ఉన్నాయి.
ఇక్ష్వాకు వంశంలో జన్మించిన అపారమైన శౌర్యమూర్తులైన దశరథ మహారాజు కుమారులైన రామలక్ష్మణులతో ఇవ్వాళ సుగ్రీవుడు స్నేహం చేశాడు నేను గూఢచారుల ద్వారా అంగదుడి(అంగదుడు వాలి – తారలు కుమారుడు) ద్వారా తెలుసుకున్న విషయము.
నువ్వు నీ బలాన్ని నమ్ముకున్నావు, కాని సుగ్రీవుడి బుద్ధి బలాన్ని గూర్చి ఆలోచించడము లేదు.
సుగ్రీవుడు నీ తమ్ముడన్న విషయాన్ని మరిచిపోయి నీ తమ్ముడి భార్యని నీ భార్యగా అనుభవిస్తున్నావు. నీ తమ్ముడిని పక్కన పెట్టుకోవడము మానేసి శత్రుత్వాన్ని పెంచుకుంటున్నావు.
మీ ఇద్దరి మధ్యలోకి మూడవ వ్యక్తి రావలసిన అవసరమేమిటి? ఇది నీ ఇంటి సమస్య. నా మాట వినీ సుగ్రీవుడిని ఆహ్వానించి యువరాజ పట్టాభిషేకము చెయ్యి. అప్పుడు నీ బలం పెరుగుతుంది. ఇవాళ నీ తమ్ముడు రాముడి నీడలో ఉన్నాడు. రాముడిలా నీడ ఇవ్వగలిగే చెట్టు ఈ ప్రపంచంలో లేదు ” అన్నది. Vaalmiki Ramayanam – 50
వాలి శరీరము పడిపోవలసిన కాలం ఆసన్నమయ్యింది. ఈశ్వరుడు ఫలితాన్ని ఇవ్వడం ప్రారంభించాడు కనుక ఇంతకాలం తార మాటలు వినడానికి అలవాటుపడ్డ వాలి ఆమె మాట వినడము మానేసి సుగ్రీవుడితో యుద్ధానికి వెళ్ళాడు.
ఇద్దరూ హోరాహోరుగా యుద్ధం చేసుకుంటున్నారు. ఈసారి సుగ్రీవుడు చెట్లని పెరికించి వాలిని తుక్కుగా కొట్టాడు. వాలి మెడలో ఇంద్రుడి మాల ఉండడము వలన మెల్లగా సుగ్రీవుడి శక్తి నశించి వాలి బలం పెరిగింది. సుగ్రీవుడు ఇంతకముందులా పారిపోకుండా ఈసారి రాముడి కోసం అన్ని వైపులా చూశాడు.
సుగ్రీవుడి శక్తి తగ్గిపోవడము గమనించిన రాముడు వెంటనే బాణాన్ని తీసి వింటినారికి తొడిగించి వెనక్కి లాగాడు. అలా లాగడం వలన ఆ వింటినారి నుండి వచ్చిన ధ్వని యుగాంతమునందు ప్రళయము చేసేటప్పుడు హరుడు చేసే శబ్దంలా ఉన్నది. ఆ శబ్దము చేత మృగములన్నీ దిక్కులు పట్టి పారిపోయాయి, పక్షులు ఆకాశములోకి ఎగిరిపోయాయి.
రాఘవేణ మహా బాణో వాలివక్షసి పాతితః |
రాముడి బాణం యొక్క శబ్దం వినపడి ఆ శబ్దం ఎక్కడినుంచి వచ్చిందని వాలి అటువైపుకి తిరిగెలోగా ఆ బాణం అమితమైన వేగంతో వచ్చి వాలి గుండెల మీద పడింది.
ఆ దెబ్బకి వాలి కిందపడిపోయాడు. రాముడు, లక్ష్మణుడు, సుగ్రీవుడి మంత్రులు అక్కడికి వచ్చారు. పక్కనే చేతులు కట్టుకొని సుగ్రీవుడు నిలబడ్డాడు. వాలి రాముడితో ” రామా ! నువ్వు చాల గొప్పవాడివి ధర్మం తెలిసినవాడివి పరాక్రమము ఉన్నవాడివి అంటారు.
నీతో కాకుండా ఇంకొకరితో నేను అటువైపుకి తిరిగి యుద్ధం చేస్తుంటే ఇంత ధర్మాత్ముడివి అయిన నువ్వు చెట్టు చాటు నుంచి నా మీద బాణం వెయ్యడానికి సిగ్గుగా లేదా? నా చర్మము ఒలిచి వేసుకోడానికి, మాంసము తినడానికి పనికిరావు. యుద్ధం అంటూ వస్తే బంగారం వల్ల, వెండి వల్ల, భూమి వల్ల రావాలి.
నీకు నాకు ఈ విషయాలలో తగాదా లేదు. నేను చెట్ల మీద ఉండే ఆకులని, పండ్లని తినే శాఖామృగాన్ని. నువ్వు మనిషివి, ధర్మం అనే తొడుగు కప్పుకున్న మహా పాపాత్ముడివి.
చేతిలో కోదండము పట్టుకొని కనపడ్డ ప్రతి ప్రాణిని హింసించే స్వభావము ఉన్నవాడివి. నీయందు కామము విపరీతంగా ఉన్నది. అందుచేతనే ఏ కారణం లేకుండా నన్ను కొట్టి చంపావు.
నువ్వు నాకు ఎదురుగా వచ్చి నిలబడి యుద్ధం చేసినట్టయితే, ఆ యుద్ధంలో నేను నిన్ను యమసదనానికి పంపించి ఉండేవాడిని.
అయిదింటి మాంసాన్ని మాత్రమే బ్రాహ్మణులు, క్షత్రియులు తినాలని ధర్మశాస్త్రం చెబుతుంది. ( త్రేతా యుగంలో బ్రాహ్మణులు కూడా మాంసాన్ని తినేవారు, కలికాలంలో అది నిషిద్దము.
అరణ్యకాండలో అగస్త్యమహర్షి వాతాపి, ఇల్వలుడు అనే రాక్షసులని చంపేముందు మాంసాహారాన్ని తిన్నారు). అయిదు గోళ్ళున్న వాటిల్లో ముళ్ళపంది మాంసాన్ని తినచ్చు. చెవులపిల్లి మాంసాన్ని తినచ్చు.
ఉడుముమాంసాన్ని తినచ్చు. తాబేలుమాంసాన్ని తినచ్చు. కుక్కలని తరిమి చంపే ఏదుపంది మాంసాన్ని తినవచ్చు. ఇంక ఆరవదాని మాంసం తినకూడదు.
ఒకవేళ అలా తిన్నారాజ్యం చేస్తున్న రాజుని చంపినా, గోవుని చంపినా, బ్రాహ్మణుడిని చంపినా, అలా చేసిన వారికి పాతకం చేసిన పాపం వస్తుంది. నువ్వు నన్ను చంపడానికి కారణం ఏమిటి? నువ్వు చేసినవి దోషాలు కావా? నాకు జవాబు చెప్పు.
నీ భార్య కోసం అడవిలో వెతుక్కుంటున్నావుట కదా! నీ భార్యని ఎత్తుకుపోయిన రావణాసురుడు నా కింకరుడు. నువ్వు నాతో చెప్పి ఉంటే పశువుని ఈడ్చుకు వచ్చినట్టు రావణుడిని మెడలో పాశం వేసి నీ కాళ్ళ ముందు పడేసేవాడిని.
అటువంటిది నాకు చెప్పకుండా, నన్నే గెలవలేని సుగ్రీవుడిని ఆశ్రయించి నువ్వు సీతని ఎలా తెచ్చుకోగలవు? సుగ్రీవుడి కోసం నన్ను చంపావు. ఇది కిరాయి హత్య కాదా? నువ్వు ఈ పని చెయ్యొచ్చా ?” అని రాముడిని ప్రశ్నించి, ఇక మాట్లాడడానికి ఓపిక లేక ఉండిపోయాడు. Vaalmiki Ramayanam – 50
ధర్మమ్ అర్థం చ కామం చ సమయంచాపి లౌకికమ్ |
అవిజ్ఞాయ కథం బాల్యాత్ మామిహాద్య విగర్హసే ||
రాముడు ” నీకు అసలు ధర్మం గురించి కాని, అర్ధం గురించి కాని, కామం గురించి కాని తెలుసా? నువ్వు అజ్ఞానివి. బాలుడు ఎలా ప్రవర్తిస్తాడో నువ్వు అలా ప్రవర్తించేవాడివి.
నీకు ఏమి తెలుసని నామీద ఇన్ని ఆరోపణలు చేశావు? నువ్వు అజ్ఞానివి కావడము వలన నీకు తెలియకపోతే ఆచారం తెలిసినవారిని, పెద్దలైనవారిని ఆశ్రయించి కనుక్కోవాలి. నువ్వు అవేమి తెలుసుకోకుండా నా గురించి అడుగుతున్నావు.
ఇక్ష్వాకుల యొక్క రాజ్యంలోకి ఈ భాగం కూడా వస్తుంది. ఆ ఇక్ష్వాకు వంశంలో పుట్టిన భరతుడు ఇప్పుడు రాజ్యం చేస్తున్నాడు. ఇక్ష్వాకు వంశంవారు రాజ్యం చేస్తుండగా ధర్మాధర్మములు జరిగిన చోట నిగ్రహించే అధికారం మాకు ఉంటుంది.
నీకు కామం తప్ప వేరొకటి తెలియదు. అందుచేత నీకు ధర్మాధర్మ విచక్షణ చేసే అధికారము లేదు. జన్మనిచ్చిన తండ్రి, పెద్ద అన్నగారు, చదువు నేర్పిన గురువు, ఈ ముగ్గురు తండ్రులతో సమానం. అలాగే తనకి జన్మించిన కుమారుడు, తోడబుట్టిన తమ్ముడు, తన దగ్గర విద్య నేర్చుకున్న శిష్యుడు ముగ్గురూ కుమారులతో సమానము.
నీ తండ్రి మరణించడము చేత, నువ్వు పెద్దవాడివి అవడము చేత నువ్వు తండ్రితో సమానము. నీ తమ్ముడు సుగ్రీవుడి భార్యయిన రుమ నీకు కోడలితో సమానము.
సుగ్రీవుడు బతికి ఉన్నాడని తెలిసి, కోడలితో సమానమైన రుమని నువ్వు అనుభవించి, నీ భార్యగా కామ సుఖాలని పొందుతున్నావు ( వాలి బిలంలో ఉండిపోయినప్పుడు వాలి మరణించాడు అనుకొని సుగ్రీవుడికి పట్టాభిషేకము చేశారు.
సుగ్రీవుడు వాలి భార్య అయిన తారని తన భార్యగా అనుభవించాడు. మరి సుగ్రీవుడు చేసింది దోషం కాదా? ఇక్కడ మీరు గమనించవలసిన విషయం సంధ్యావందనం చేసే వానరజాతికి, రాజ్యపాలన చేసే వానరజాతికి, మంత్రులచేత సేవింపబడే వానరజాతికి కొన్ని నియమాలు ఉన్నాయి.
ఆ జాతిలోని స్త్రీలు తమ భర్త మరణిస్తే మరిదిని పునర్వివాహం చేసుకొని వారితో ఉండచ్చు. ఆనాడు వాలి చనిపోయాడనుకొని తార సుగ్రీవుడిని వివాహమాడింది. కనుక సుగ్రీవుడితో ఆనాడు తార ఉండడం ధర్మం తప్పడము కాదు. సుగ్రీవుడు బతికే ఉన్నాడని తెలిసి కూడా ఆయన భార్యతో కామ సుఖాలని అనుభవించడం వాలి యొక్క దోషం.
కేవలం పైన చెప్పిన వానరజాతికి మాత్రమే ఈ నియమం. మనుష్యులకి కాదు. అలాగే వాలికి రెండుశక్తులు ఉన్నాయి. ఒకటి ఇంద్రుడు ఇచ్చిన మాలని మెడలో వేసుకుంటే వాలి అపారమైన ఉత్సాహంతో ఉంటాడు. రెండు ఎవరన్నా వాలికి ఎదురుగా వెళితే వాళ్ళ శక్తిలో సగం శక్తిని ఈయన లాగేసుకుంటాడు, ఇది బ్రహ్మగారు వాలికి ఇచ్చిన వరం.
అలాగే వాలికి రావణాసురుడికి స్నేహం ఉన్నది. వాళ్ళిద్దరూ ఒక ఒప్పందం కుదుర్చుకున్నారు. దాని ప్రకారం వాలి అనుభవించే స్త్రీని రావణుడు అనుభవించచ్చు. వాలికి శత్రువు రావణుడికి శత్రువే……..అలా కొన్ని విషయాలలో ఒప్పందం కుదుర్చుకున్నారు ). Vaalmiki Ramayanam – 50
అందుచేత ఒక మామగారు కోడలితో కామభోగాన్ని అనుభవిస్తే ఎంత దోషమో అంత దోషాన్ని నువ్వు చేశావు. ధర్మశాస్త్రంలో దీనికి మరణశిక్ష తప్ప వేరొక శిక్ష లేదు.
అందుకని నేను నిన్ను చంపవలసి వచ్చింది. నువ్వు ప్రభువువి, మంత్రుల చేత సేవింపబడుతున్నవాడివి. సంధ్యావందనం చేస్తున్నవాడివి. నువ్వు ధర్మం తప్పితే నీ వెనుక ఉన్నవారు కూడా ధర్మం తప్పుతారు. నేను క్షత్రియుడని కనుక నిన్ను శిక్షించవలసిన అవసరం నాకు ఉన్నది.
ఇది తప్పు అని తెలిసికూడా నేను నిన్ను శిక్షించకపోతే నువ్వు చేసిన పాపం నాకు వస్తుంది. ఈ పాపం అవతలవాడు చేశాడని ప్రభువైనవాడికి తెలిసి వాడిని శిక్షిస్తే వాడి పాపం పోతుంది.
ప్రభువు అలా శిక్షించకపోతే ఆ పాపం రాజుకి వెళుతుంది. అందుకే మా వంశంలో ఇంతకు పూర్వం మాంధాత అనే రాజు ఒక శ్రమణికుడు ఇటువంటి దోషం చేస్తే శిక్ష వేశాడు.
ఇంక నాతో ఎందుకు స్నేహం చెయ్యలేదు. చేసి ఉంటే సీతమ్మని తీసుకు వచ్చేవాడిని అన్నావు కదా! నీలాంటి అధర్మాత్ముడితో నేను స్నేహం చెయ్యను. నన్ను చెట్టు చాటునుండి చంపావు వేరొకడితో యుద్ధం చేస్తుంటే కొట్టావు అది దోషం కాదా? అని నన్ను అడిగావు. దానికి నేను సమాధానం చెబుతాను విను.
తప్పు చేసినవాడిని రాజు శిక్షిస్తే వాడి పాపం ఇక్కడితో పోతుంది. నేను నిన్ను చంపడం వల్ల నువ్వు ఏ పాపము లేని స్థితికి వచ్చావు. నీ పాపం ఇక్కడితో పోయింది అందుకని నువ్వు ఉత్తమలోకాలకి వెళ్ళిపోతావు.
న మే తత్ర మనస్తాపో న మన్యుర్హరియూథప |
వాగురాభిశ్చ పాశైశ్చ కూటైశ్చ వివిధైర్నరాః ||
నేను మానవుడిని, నువ్వు వానరానివి. నేను మనిషిని నువ్వు జంతువువి. క్షత్రియుడు, మాంసం తినేవాడు, ధర్మాన్ని నిలబెట్టవలసినవాడు ఒక మృగాన్ని కొట్టవలసి వస్తే తాను చాటున ఉండి కొట్టచ్చు, వల వేసి పట్టుకొని కొట్టచ్చు.
పాశం వేసి పట్టుకొని కొట్టచ్చు. అది అప్రమత్తంగా ఉన్నప్పుడు కొట్టచ్చు. అది పడుకొని ఉన్నప్పుడు కొట్టచ్చు. నిలబడి ఉన్నప్పుడు కొట్టచ్చు. పారిపోతున్నప్పుడు కొట్టచ్చు. ఎప్పుడైనా కొట్టచ్చు.
కాని ఆ మృగం వేరొక స్త్రీ మృగంతో సంగమిస్తున్నప్పుడు మాత్రం బాణ ప్రయోగము చెయ్యకూడదు. నువ్వు మైధున లక్షణంతో లేవు. అందుకని నిన్ను కొట్టాను.
నేను నరుడిని కనుక మృగానివైన నిన్ను ఎలా కొట్టినా నాకు పాపం రాదని తెలిసి కొట్టాను. కాని నువ్వు చనిపోయేముందు రోషం కలిగి నన్ను ప్రశ్నించావు. నాయందు ఎటువంటి దోషము లేదు ” అని రామచంద్రమూర్తి సమాధానమిచ్చారు.
రాముడు మాటలు విన్న వాలి తన రెండుచేతులతో రాముడికి నమస్కారం పెట్టి ” మహానుభావా ! ధర్మాత్మా ! రామచంద్రా ! నువ్వు చెప్పినది పరమ యదార్థము. Vaalmiki Ramayanam – 50
దోషం నాయందే ఉన్నది. నువ్వు నన్ను చంపడంలోకాని నాయందు దోషం ఉన్నదని చెప్పడంలోకాని కించిత్ సందేహం లేదు. నువ్వు ధర్మాధర్మ విచక్షణ చేత నీకు ఉన్న జ్ఞానం చేత పూర్వాపరములను బాగా పరిశీలించిన మీదట ఏమిచెయ్యాలో నిర్ణయించుకుని దానిని అమలుచేసి దానిమీద స్థిరంగా నిలబడగల వ్యక్తిత్వం ఉన్నవాడివి. అటువంటి నిన్ను చూసి పొంగిపోతున్నాను. నీ చేతిలో మరణమైనా నాకు స్వర్గమే ” అన్నాడు.

Leave a Reply

%d bloggers like this: