Home PANCHANGAM Daily Horoscope 15/06/2021

Daily Horoscope 15/06/2021

0

Daily Horoscope 15/06/2021 :

ఓం శ్రీ గురుభ్యోనమః
శుభమస్తు

15, జూన్ , 2021
స్వస్తి శ్రీ చాన్ద్రమాన ప్లవ నామ సంవత్సరమ్
జ్యేష్ఠమాసము
గ్రీష్మ ఋతువు
ఉత్తరాయణము భౌమ వాసరే
( మంగళ వారం )

శ్రీ ప్లవ సంవత్సర దేవతా ధ్యానమ్
అగ్నిం నమామి సతతం జ్వాలామాలం తమోపహమ్ ౹
అజారూఢం చతుర్హస్తం ద్విశీర్షం ప్లవసంజ్ఞికమ్ ౹౹

రాశి ఫలాలు

మేషం

చేపట్టే పనుల్లో ఆటంకాలు ఎదురవకుండా చూసుకోవాలి. కుటుంబసభ్యుల మాటకు ఎదురెళ్లకండి. అందరినీ కలుపుకొనిపోతే విజయాన్ని తొందరగా అందుకుంటారు. చతుర్ధంలో చంద్ర బలం అనుకూలంగా లేదు. ఇష్టదైవ నామస్మరణ శక్తిని ఇస్తుంది.

 వృషభం

ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది. చేపట్టిన పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. నూతన వస్తువులు కొంటారు. ఆదిత్య హృదయం పఠించాలి. Daily Horoscope 15/06/2021

మిధునం

ప్రారంభించిన పనులను పట్టుదలతో పూర్తిచేస్తారు. భవిష్యత్తు ప్రణాళికలు వేస్తారు. ఒక శుభవార్త మీ మనోధైర్యాన్ని పెంచుతుంది. కొన్నిసమయాల్లో అస్థిరబుద్ధితో వ్యవహరిస్తారు. ఈశ్వర ధ్యాన శ్లోకం చదివితే బాగుంటుంది.

కర్కాటకం

అనుకూల ఫలితాలు ఉన్నాయి. ఒక వార్త ఆనందాన్ని ఇస్తుంది. బంధుమిత్రులతో కలిసి చేసే పనులు సత్ఫలితాన్ని ఇస్తాయి. ఒక ముఖ్య వ్యవహారంలో మీరు ఆశించిన పురోగతి ఉంటుంది. శని శ్లోకం చదివితే బాగుంటుంది.

ఈవారం
గతానుభవంతో పనిచేయండి. కాలాన్ని సద్వినియోగం చేసుకోండి. బలహీన పరిచే ఆలోచనలను తిరస్కరించండి. ఉత్తమ ఫలితాలు ఉంటాయి.

చక్కటి బుద్ధిబలంతో సందర్భోచితంగా కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఆర్ధికంగా జాగ్రత్త పడాలి. ఎవరినీ అతిగా నమ్మకండి. అనవసర అంశాల్లో సమయాన్ని వెచ్చించకండి.

ప్రయాణాలలో ఆటంకాలు ఉంటాయి. మనశ్శాంతి కోల్పోకుండా జాగ్రత్త పడాలి. వారం మధ్యలో శుభం చేకూరుతుంది. హనుమంతుణ్ణి ఆరాధిస్తే మంచిది.

సింహం

వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో అభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. విందు,వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. ఈశ్వర దర్శనం ఉత్తమం.

కన్య

శ్రమకు తగిన ఫలితాలు ఉంటాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. శత్రువులపై మీరే విజయం సాధిస్తారు. కుటుంబం సహకారం ఉంటుంది. దత్తాత్రేయుడిని ఆరాధించడం మంచిది. Daily Horoscope 15/06/2021

తుల

శ్రమకు తగిన ఫలితాలు ఉంటాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. శత్రువులపై మీరే విజయం సాధిస్తారు. కుటుంబం సహకారం ఉంటుంది. దత్తాత్రేయుడిని ఆరాధించడం మంచిది.

వృశ్చికం

మనోధైర్యంతో చేసే పనులు గొప్ప ఫలితాన్ని ఇస్తాయి. అధికారులు మీకు అనుకూలమైన ఒక నిర్ణయాన్ని తీసుకుంటారు. కొన్ని కీలక పనులను పూర్తి చేయగలుగుతారు. ఉమామహేశ్వరస్తోత్రం పఠిస్తే మంచిది.

ధనుస్సు

వృత్తి, ఉద్యోగ,వ్యాపారాలలో అభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. విందు,వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. ఈశ్వర సందర్శనం ఉత్తమం.

మకరం

మీ మీ రంగాల్లో అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి. ముఖ్యమైన పనులను ప్రారంభించడానికి ఇది సరైన సమయం. కొన్నిపరిస్థితులు మానసిక సంతృప్తిని కలిగిస్తాయి. లక్ష్మీదేవి దర్శనం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి.

కుంభం

మంచి కాలం. ఒక శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. ఒక కీలక విషయంలో మీ ఆలోచనా ధోరణికి ప్రశంసలు లభిస్తాయి. కుటుంబ సభ్యులకు శుభ కాలం. దుర్గాదేవి దర్శనం శుభప్రదం.

మీనం

మీ మీ రంగాల్లో ఆచితూచి వ్యవహరించాలి. అనవసర ఖర్చులు జరిగే సూచనలు ఉన్నాయి. అధికారులతో కాస్త జాగ్రత్తగా ఉండాలి. నిర్ణయాలు తీసుకోవడంలో ఇబ్బంది పడతారు. ఈశ్వర ధ్యానం శుభప్రదం. Daily Horoscope 15/06/2021

Panchangam

ఓం శ్రీగురుభ్యోనమః
శుభమస్తు

శ్రీ ప్లవ సంవత్సర దేవతా ధ్యానమ్
అగ్నిం నమామి సతతం జ్వాలామాలం తమోపహమ్ ౹
అజారూఢం చతుర్హస్తం ద్విశీర్షం ప్లవసంజ్ఞికమ్ ౹౹

తేది : 15, జూన్ 2021
సంవత్సరం : స్వస్తి శ్రీ చాంద్రమాన ప్లవ నామ సంవత్సరం
ఆయనము : ఉత్తరాయణము
ఋతువు : గ్రీష్మ ఋతువు
కాలము : వేసవి కాలం
మాసం : జ్యేష్ఠ మాసము
పక్షం : శుక్ల పక్షం
వారము : భౌమ వాసరే (మంగళ వారము )
తిథి : పంచమి
( ఈరోజు రాత్రి 10 గం ౹౹ 53 ని ౹౹ వరకు )
నక్షత్రం : ఆశ్రేష
( ఈరోజు రాత్రి 09 గం ౹౹ 38 ని ౹౹ వరకు )
యోగము : వ్యాఘాత
( ఈరోజు పగలు 08 గం ౹౹ 57 గం ౹౹ వరకు )
కరణం : బవ
( ఈరోజు పగలు 10 గం ౹౹ 42 గం ౹౹ వరకు )
అనంతరం
బాలవ
( ఈరోజు రాత్రి 10 గం ౹౹ 53 ని ౹౹ వరకు )
వర్జ్యం
(ఈరోజు పగలు 09 గం ౹౹ 55 ని ౹౹ లగాయతు 11 గం ౹౹ 35 ని ౹౹ వరకు )
అమృత ఘడియలు :
(ఈరోజు రాత్రి 07 గం ౹౹ 57 ని ౹౹ లగాయతు 09 గం ౹౹ 38 ని ౹౹ వరకు )
దుర్ముహూర్తం :
(ఈరోజు పగలు 08 గం ౹౹ 21 ని ౹౹ లగాయతు 09 గం ౹౹ 14 ని ౹౹ వరకు )
మరల
(ఈరోజు రాత్రి 11 గం ౹౹ 10 ని ౹౹ లగాయతు 11 గం ౹౹ 54 ని ౹౹ వరకు )
సూర్యోదయం : ఉదయం 05 గం॥ 45 ని॥ లకు
సూర్యాస్తమయం : సాయంత్రం 06 గం॥ 47 ని॥ లకు
సూర్యరాశి : వృషభం
చంద్రరాశి : కర్కాటకం
కార్తె : మృగశిర
శార్దతిధి: పంచమి Daily Horoscope 15/06/2021

Leave a Reply

%d bloggers like this: