Daily Horoscope 14/06/2021 :

0
Daily Horoscope 14/06/2021 :
Daily Horoscope 23/09/2022 

Daily Horoscope 14/06/2021 :

ఓం శ్రీ గురుభ్యోనమః
శుభమస్తు

14, జూన్ , 2021
స్వస్తి శ్రీ చాన్ద్రమాన ప్లవ నామ సంవత్సరమ్
జ్యేష్ఠమాసము
గ్రీష్మ ఋతువు
ఉత్తరాయణము ఇందు వాసరే
( సోమ వారం )

శ్రీ ప్లవ సంవత్సర దేవతా ధ్యానమ్
అగ్నిం నమామి సతతం జ్వాలామాలం తమోపహమ్ ౹
అజారూఢం చతుర్హస్తం ద్విశీర్షం ప్లవసంజ్ఞికమ్ ౹౹

రాశి ఫలాలు

మేషం

ఒక శుభవార్త వింటారు. కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. ఒక వ్యవహారంలో ఊహించని ఫలితాలు వస్తాయి. అధికారులకు మీ పనితీరు నచ్చుతుంది. మీ ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. మహాలక్ష్మి అమ్మవారిని ఆరాధించాలి.

వృషభం

ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది. మనస్సౌఖ్యం కలదు. ఒక శుభవార్త వింటారు. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. కీలక వ్యవహారాలలో అధికారుల ఆశీస్సులు లభిస్తాయి. హనుమాన్ చాలీసా పఠించాలి.

 

మిధునం

మిత్రుల వల్ల మేలు జరుగుతుంది. మీ మీ రంగాల్లో చక్కటి శుభయోగం ఉంది. శరీర సౌఖ్యం ఉంటుంది. దత్తాత్రేయ స్వామి ఆరాధన మంచి ఫలితాన్నిస్తుంది.

కర్కాటకం

చేసే పనిలో మనోధైర్యం కోల్పోకుండా చూసుకోవాలి. అనవసర ఖర్చులు పెరిగే సూచనలు ఉన్నాయి. శారీరక సమస్యలను నిర్లక్ష్యం చేయకండి. ఆదిత్య హృదయం పఠించాలి. Daily Horoscope 14/06/2021

 సింహం

కొత్త ఆలోచనలను ఆచరణలో పెడతారు. సమాజంలో గౌరవాభిమానాలు పెరుగుతాయి. బంధుమిత్రులను ఆదరిస్తారు. శుభవార్తలు వింటారు. పెద్దల ఆశీస్సులు అండదండలు లభిస్తాయి. ఇష్టదేవతా నామస్మరణ మంచినిస్తుంది.

కన్య

అనుభవజ్ఞులు సూచించిన మార్గంలో ముందుకు సాగండి మంచి చేకూరుతుంది. ధనలాభం కలుగుతుంది. సంతోషంగా ఉంటారు. శ్రీవేంకటేశ్వరస్వామి సందర్శనం మేలు చేస్తుంది

తుల

మీ మీ రంగాల్లో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కొన్ని వ్యవహారాలలో సమయస్ఫూర్తితో వ్యవహరిస్తారు. చేపట్టిన పనులను పూర్తిచేయడంలో ఇబ్బందులు ఎదురైనా పూర్తిచేసే ప్రయత్నం చేస్తారు. ఒకరి ప్రవర్తన మీకు బాధ కలిగిస్తుంది. సూర్యాష్టకం చదివితే ఇంకా బాగుంటుంది.

వృశ్చికం

నలుగురిలో మంచిపేరును సంపాదిస్తారు. కుటుంబ సభ్యుల సలహాలను పెడచెవిన పెట్టరాదు. నూతన వస్తు, వస్త్ర ప్రాప్తి కలదు. చిరునవ్వుతో అనేక సమస్యలు దూరమవుతాయని గుర్తించాలి. శ్రీరామ నామాన్ని జపించాలి.

ధనుస్సు

మొహమాటంతో ఇబ్బందులు ఎదురవుతాయి. బంధుమిత్రులతో మాట పట్టింపులకు పోరాదు. చెడు సావాసాలు చేయరాదు. కీలక విషయాల్లో అశ్రద్ధగా వ్యవహరిస్తే ఇబ్బందులు తప్పవు. విష్ణు సహస్రనామాన్ని పఠించాలి.

మకరం

పనుల్లో ఆటంకాలు ఎదురైనా తెలివిగా పరిష్కరిస్తారు. నూతన ప్రయత్నాలు సిద్ధిస్తాయి. ఒక ముఖ్యమైన విషయమై పెద్దలను కలుస్తారు. ఆశించిన ఫలితం దక్కుతుంది. ఆదాయం కంటే వ్యయం మించకుండా చూసుకోవాలి. ఈశ్వర సందర్శనం ఉత్తమ ఫలితాలనిస్తుంది.

కుంభం

సుఖసౌఖ్యాలతో సంతోషంగా ఉంటారు. స్వధర్మం మిమ్మల్ని కాపాడుతుంది. అనూహ్యమైన ఆర్థిక ప్రయోజనాలున్నాయి. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. శివారాధన వల్ల శుభఫలితాలను అందుకుంటారు. Daily Horoscope 14/06/2021

మీనం

ఉత్సాహంగా ముందుకు సాగితే సత్ఫలితాలు సిద్ధిస్తాయి. బంధుమిత్రులను కలుపుకోవాలి. మీ బుద్ధి బలంతో కీలక సమస్యలకు పరిష్కార మార్గాలను కనుగొంటారు. మానసిక ప్రశాంతత కోసం సూర్య ఆరాధన చేస్తే మంచిది.

Panchangam

శ్రీ గురుభ్యోనమః
సోమవారం, జూన్ 14, 2021
శ్రీ ప్లవ నామ సంవత్సరం
ఉత్తరాయణం – గ్రీష్మ ఋతువు
జ్యేష్ఠ మాసం – శుక్ల పక్షం
తిధి:చవితి రా7.33 తదుపరి పంచమి
వారం:సోమవారం (ఇందువాసరే)
నక్షత్రం:పుష్యమి సా6.20 తదుపరి ఆశ్లేష
యోగం:ధృవం ఉ8.04 తదుపరి వ్యాఘాతం
కరణం:వణిజ ఉ7.20 తదుపరి భద్రా7.33 ఆ తదుపరి బవ
వర్జ్యం :లేదు
దుర్ముహూర్తం:మ12.26 – 1.18 &
మ3.02 – 3.54
అమృతకాలం: ఉ11.38 – 1.18
రాహుకాలం : ఉ7.30 – 9.00
యమగండం/కేతుకాలం:ఉ10.30 – 12.00
సూర్యరాశి:వృషభం
చంద్రరాశి: కర్కాటకం
సూర్యోదయం: 5.29
సూర్యాస్తమయం: 6.31 Daily Horoscope 14/06/2021

Leave a Reply

%d bloggers like this: