Home Bhakthi Vaalmiki Ramayanam – 48

Vaalmiki Ramayanam – 48

0
Vaalmiki Ramayanam – 48
Vaalmiki Ramayanam -76
Vaalmiki Ramayanam – 48  కబంధుడు చెప్పిన విధముగా రామలక్ష్మణులు బయలుదేరి పంపాసరస్సుకి చేరుకున్నారు. పంపానదిలో అరవిసిరిన పద్మములు పైకి ఎగిరి నీళ్ళల్లో పడుతున్న చేపలని చూసి సీతమ్మ ముఖము కన్నులు గుర్తుకొచ్చి భోరున విలపించాడు.
లక్ష్మణుడితో ” చూసావా లక్ష్మణా! ఈ ప్రాంతము ఎంతో బాగున్నది. ఈ చెట్లకి పువ్వులు విశేషముగా ఉన్నాయి. పువ్వులు కిందకి పడుతూ ఎక్కడ చూసినా పుష్పముల యొక్క గుత్తులు గాలికి అటు ఇటూ కదులుతూ ఉన్నాయి.
కిందకి పడుతున్న పువ్వులని కదులుతున్న గుత్తులని చూస్తుంటే నాకు వాయుదేవుడు ఎవ్వరికీ కనపడకుండా వచ్చి ఈ పూల గుత్తులతో ఆడుకుంటున్నాడా! అనిపిస్తున్నది.
ఈ చెట్లకి అల్లుకున్న తీగలు పైకి వెళ్ళి పెద్ద పెద్ద పువ్వులని పుష్పించాయి. ఇవన్నీ చూడడానికి ఎంతో అందముగా ఉన్నాయి. ఇవన్నీ చూస్తుంటే సీత నా పక్కన లేదన్న విషయము జ్ఞాపకానికి వచ్చి నేను నా స్వస్థతని కోల్పోతున్నాను. Vaalmiki Ramayanam – 48
ఎవరూ అడక్కుండానే మేఘాలు ఆకాశంలో వర్షాన్ని వర్షిస్తాయి. ఈ చెట్లు కూడా పుష్పాలని వర్షిస్తున్నాయి. ఇవి చెట్లా! లేకపోతే పుష్పాలని వర్షించే మేఘాలా? అని నాకు అనుమానము వస్తున్నది. ఈ ప్రాంతము అంతా పుష్పములతో నిండిపోయి ఉన్నది.
మత్తకోకిలసన్నాదైః నర్తయన్నివ పాదపాన్ |
శైలకందరనిష్క్రాంతః ప్రగీత ఇవ చాఽనిలః ||
గాలి ఒక విచిత్రమైన ధ్వని చేస్తూ చెట్లని కదుపుతూ వీస్తుంది. కోకిల పాట పాడుతున్నది. ఇవన్నీ చూస్తుంటే నాకు వాయువు పాట పాడుతున్నాడు. చెట్లన్నీ నాట్యము చేస్తున్నాయి.
కోకిలచెట్టు మీద కూర్చొని పక్కవాయిద్యముల వలె కూస్తున్నది. నేను ఏదన్నా నృత్య కార్యక్రమానికి వచ్చానా? అని అనిపిస్తున్నది. ఈ సమయములో సీత నా పక్కన ఉంటే ఎంతో బావుండేది. సీత పక్కన లేకపోవడము వలన నేను ప్రాణములతో ఉండలేనేమో అనిపిస్తుంది.
లక్ష్మణా! అలా చూడు! కొండ మీద మగనెమలి పురి విప్పి నాట్యము చేస్తుంటే ఆడనెమలి దాని చుట్టూ పరమసంతోషముగా ఎలా తిరుగుతున్నదో.
Vaalmiki Ramayanam - 48
Vaalmiki Ramayanam – 48
అవునులే ఎందుకు ఆడవు? మగనెమలి భార్య అయిన ఆడనెమలిని ఎవరూ ఎత్తుకుపోలేదు కదా! ఎన్ని ఆటలన్నా ఆడతాయి. నా మనస్సు సీత దగ్గర ఉంటుంది. Vaalmiki Ramayanam – 48
సీత మనస్సు నా దగ్గర ఉంటుంది. మా ఇద్దరికీ ఉన్నది ఒకటే మనస్సు. ఆ ఒక్క మనస్సు ఆనందించాలంటే ఒకరి పక్కన ఒకరము ఉండాలి. అలా లేకపోవడము చేత ఇవ్వాళ నా మనస్సు ఆనందపడడము లేదు.
ఇది చైత్ర మాసము కనుక సీత కూడా ఇలాంటి దృశ్యాలనే చూస్తూ ఉంటుంది. మగవాడిని నేనే ఇంత బాధ పడుతున్నానంటే సీత ఇంకెంత బాధ పడుతున్నదో!
పూర్వము చైత్రమాసములో ఇటువంటి గాలి వీస్తుంటే నేను ఎంతో సంతోషించేవాడిని. ఇవ్వాళ అదే గాలి వీస్తుంటే నాకు దుఃఖముగా ఉన్నది.
ఈ అరవిసిరిన తామరపువ్వులని దగ్గరగా చూస్తుంటే ఆ పువ్వులలోని గాలి నా ముఖమునకు తగులుతుంటే ఎలా ఉందో తెలుసా? సీత ముఖము నా ముఖానికి దగ్గరగా ఉన్నప్పుడు సీత ముక్కునుండి విడిచిపెట్టిన నిశ్వాస వాయువు నా బుగ్గలకి తగిలిన అనుభూతి కలుగుతున్నది.
తుమ్మెదలు పువ్వుల మీద వాలి మకరందాన్ని త్రాగి ఎలా వెళ్ళిపోతున్నాయో! ఆ సన్నివేశం ఎంతో అందముగా ఉన్నది. కాని నా మనసుకి ఎందుకనో ఆనందము కలగడము లేదు.
సీత నా పక్కన ఉండి అప్పుడప్పుడు హాస్యము ఆడుతూ అప్పుడప్పుడు హితమైన మాటలు మాట్లాడుతూ ఉంటే ఆమె నోటి వెంట వచ్చే మధురమైన మాటలతో కూడిన ఈ సన్నివేశాన్ని చూస్తేనే నాకు సంతోషముగా ఉంటుంది.
సీతని చూడకుండా నేను ఉండలేను నా శరీరము పడిపోతున్నది. నువ్వు అయోధ్యకి వెళ్ళి భరతుడిని పట్టాభిషేకము చేసుకోమను ” అని అన్నాడు. Vaalmiki Ramayanam – 48
ఉత్సాహో బలవానార్య నాస్త్యుత్సాహాత్ పరం బలమ్ |
సోత్సాహస్యాస్తి లోకేఽస్మిన్ కించిదపి దుర్లభమ్ ||
లక్ష్మణుడు ” అన్నయ్యా! స్నేహము, ప్రేమ ఉండవలసిందే. మరీ ఇంత పిచ్చి ప్రేమయితే భరించడము కష్టం. నీకు ఇంత దుఃఖానికి కారణమైన రావణాసురుడు స్వర్గలోకానికి వెళ్ళినా, పాతాళలోకానికి వెళ్ళి దాక్కొన్నా, తన తల్లి కడుపులోకి దూరిపోయినా వాడిని మాత్రము వదలను చంపితీరుతాను.
నువ్వు ఈ దుఃఖాన్ని విడిచిపెట్టు. దుఃఖం పొందితే ఉత్సాహము నశిస్తుంది. ఉత్సాహము ఉంటే ప్రపంచంలో సాధించలేనిది అన్నది ఏది లేదు. ఉత్సాహము పోతే తనలో ఎంత శక్తి ఉన్నా అదంతా భయం చేత, దుఃఖం చేత పనికిరాకుండా పోతుంది. ఉత్సాహాన్ని పొందమ ” ని అన్నాడు.
లక్ష్మణుడి మాటలకి రాముడు సంతోషపడినవాడై ఉపశాంతిని పొందాడు. రామలక్ష్మణులు ఇద్దరూ ఋష్యమూక పర్వతము వైపునకు బయలుదేరారు.
వస్తున్న రామలక్ష్మణులను ఋష్యమూక పర్వత శిఖరముల మీద నుండి సుగ్రీవుడు చూసి భయముతో గడ్డ కట్టుకుపోయాడు. నారచీరలు కట్టుకొని కోదండములు పట్టుకుని, అరణ్యములోని చెట్ల వైపు చూస్తూ వస్తున్న రామలక్ష్మణులని చూసి వాలి తనని చంపడానికి వీళ్ళని పంపాడేమోనని భయపడి తన వానరమంత్రుల దగ్గరికి వెళ్ళి ” చూసారా ! ఎవరో ఇద్దరు నార చీరలు కట్టుకున్న వీరులు వస్తున్నారు. Vaalmiki Ramayanam – 48
వాళ్ళు నన్ను చంపడానికే వస్తున్నారు రండి పారిపోదాము ” అని నలుగురు వానరములతో కలిసి ఒక శిఖరం మీదనుండి మరొక శిఖరం మీదకి దూకాడు.
వాళ్ళు వచ్చేస్తున్నారేమో అన్న భయంతో అలా ఒక్కో శిఖరాన్ని దాటాడు. వాళ్ళు అలా గెంతుతుంటే చెట్లు విరిగిపోయాయి. ఏనుగులు, పులులు దిక్కులు పట్టి పారిపోయాయి. అలా కొంతసేపు గెంతి గెంతి తన మంత్రులతో కలిసి ఒక చోట కూర్చున్నాడు. ( సుగ్రీవుడి మంత్రులలో హనుమంతుడు ఒకడు ).
సంభ్రమస్త్యజ్యతామేష సర్వైర్వాలికృతే మహాన్ |
మలయోఽయం గిరివరో భయం నేహాస్తి వాలినః ||
వాక్య కోవిదుడైన హనుమంతుడు సుగ్రీవుడితో ” సుగ్రీవా! ఎందుకు ఇలా శిఖరముల మీద ఎగురుతున్నావు? ఇక్కడికి వాలి రాడు కదా! వాలికి ఉన్న శాపము వలన ఈ పర్వతం మీదకి వస్తే మరణిస్తాడు. నీకు కనపడినవాడు వాలి కాదు మరి ఎందుకీ గెంతులు? నువ్వు మహారాజుగా ఉండవలసిన వాడివి.
ఎవరో ఇద్దరిని చూసి నిన్ను చంపడానికే వచ్చారని అనుకొని గెంతులు వేశావు. ఈ చపలత్వం ఏమిటి? నడక చేత, అవయవముల కదలిక చేత, మాట చేత, అవతలివారు ఎటువంటి స్థితిలో ఉన్నారో, ఎందుకు వచ్చారో, వారి మనస్సులలో ఏ భావన ఉన్నదో కనిపెట్టి, దానికి అనుగుణంగా నడిచి, తనని, తన ప్రజలని రక్షించుకోగల సమర్ధత ఎవడికి ఉన్నదో వాడు రాజు.
అంతేకాని కనపడ్డ ప్రతివాడిని చూసి ఇలా పారిపోతే నువ్వు రేపు రాచపదవి ఎలా నిర్వహిస్తావు? ” అని అడిగాడు.
సుగ్రీవుడు ” హనుమా! నేను ఎందుకు భయపడుతున్నానో తెలుసా? రాజులైనవారు చాలా రహస్యముగా ప్రవర్తిస్తారు.
వాలికి నేను శత్రువుని. నన్ను రాజ్యం నుండి బయటకి పంపాడు. తాను ఈ కొండమీదకి రాలేడు. నన్ను సంహరించడము కోసమని తనతో సమానమైన బలవంతులైన ఇద్దరు క్షత్రియులని మునికుమారుల వలె ఇక్కడికి పంపిస్తున్నాడు. అందుకే వాళ్ళు నిర్భయముగా చెట్లవంక చూస్తూ వస్తున్నారు.
వాళ్ళ చేతుల్లో కోదండములు ఉన్నాయి. అందుకని నేను భయపడుతున్నాను. అంతగా చెబుతున్నావు కాబట్టి హనుమా! నువ్వు ఒక పని చెయ్యి. నువ్వు ఈ రూపాన్ని విడిచిపెట్టి వేరొక రూపాన్ని పొందు. ఆ రూపముతో ఆ ఇద్దరి దగ్గరికి వెళ్ళు. నా వైపుకి తిరిగి మాట్లాడు.
వాళ్ళు నాయందు ప్రేమతో వస్తున్నారా? శత్రుత్వంతో వస్తున్నారా? అన్న విషయాన్ని బాగా కనిపెట్టు. ప్రేమతో వస్తున్నవారైతే వాళ్ళని తీసుకురా. లేకపోతే మనం వేరే మార్గము ఆలోచిద్దాము. అందుకని నువ్వు తొందరగా వెళ్ళ ” ని అన్నాడు.
కపిరూపం పరిత్యజ్య హనుమాన్ మారుతాత్మజః |
భిక్షురూపం తతో భేజే శఠబుద్ధితయా కపిః ||
హనుమంతుడు తన కపి రూపాన్ని విడిచిపెట్టి భిక్షు రూపాన్ని( సన్యాసి రూపాన్ని) పొంది శఠబుద్ధితో బయలుదేరి రాముడి దగ్గరికి వెళ్ళాడు. Vaalmiki Ramayanam – 48
సన్యాసి రూపంలో ఉన్న హనుమంతుడు రాముడి దగ్గరికి వెళ్ళి నమస్కరించి ” మిమ్మల్ని చూస్తుంటే చాలా ఆశ్చర్యముగా ఉన్నది. మీరు రాజర్షుల వలె, తాపసుల వలె ఉన్నారు. విశేషమైన కాంతితో ఉన్నారు.
మీరు నడిచి వస్తుంటే మిమ్మల్ని చూసి మృగాలన్నీ పారిపోతున్నాయి. మిమ్మల్ని చూసి ఇక్కడున్న సర్వభూతములు భయపడుతున్నాయి. మీ యొక్క కాంతిచేత ఇక్కడున్న నదులలోని జలములు శోభిస్తున్నాయి.
మీరు నడుస్తుంటే సింహాలు నడుస్తున్నాయా? అన్నట్టుగా ఉన్నది. సింహముల యొక్క బలాన్ని అధిగమించిన స్వరూపముతో ఉన్నారు. మీ చేతులలో కోదండములు, బాణములు ఉన్నాయి.
మిమ్మల్ని చూస్తుంటే ఎటువంటి శత్రువునైనా సంహరించగలిగిన పరాక్రమము చేత విరాజిల్లుతున్న వారిలా కనపడుతున్నారు. ఠీవిగా నడిచే ఎద్దుల్లా నడుస్తున్నారు. నడుస్తున్న పర్వతాల్లా ఉన్నారు.
పద్మములవంటి కన్నులతో ఉన్నారు. జటామండలాలు కట్టుకొని ఉన్నారు. ఈ రూపములు ఒకదానితో ఒకటి సరిపోవడము లేదు. మీరు సూర్య- చంద్రుల్లా ఉన్నారు. విశాలమైన వక్షస్థలముతో ఉన్నారు.
మనుష్యరూపములో ఉన్న దేవతల్లా ఉన్నారు. పెద్ద భుజములతో ఉన్నారు. మీ బాహువుల చేత ఈ సమస్త పృధ్వీమండలాన్ని రక్షించగలిగిన వారిలా కనపడుతున్నారు.
మీరు ఇలా ఎందుకు నడిచి వస్తున్నారు? దీనికి కారణం ఏమిటి? మీ మొలలకి చాలా పెద్ద కత్తులు కట్టి ఉన్నాయి. ఆ కత్తుల్ని చూస్తే భయము వేస్తున్నది.
నేను సుగ్రీవుడి యొక్క సచివుడిని నన్ను హనుమ అంటారు. అన్నగారైన వాలి చేత తరమబడిన మా రాజైన సుగ్రీవుడు రాజ్యాన్ని విడిచిపెట్టి ఋష్యమూక పర్వత శిఖరముల మీద నలుగురు మంత్రులతో కలిసి ఉంటున్నాడు.
ఆయన ధర్మాత్ముడు. మీతో స్నేహం చెయ్యాలని అనుకుంటున్నాడు. మీరు మా ప్రభువుతో ఎందుకు స్నేహం చెయ్యకూడదు? నేను ఎన్నో విషయాలు మాట్లాడుతున్నాను మీరు నాతో మాట్లాడడంలేదు. మీరు మాట్లాడితే వినాలని ఉన్నది.
మీరు మాట్లాడండి ” అని చెప్పి హనుమ నిలబడిపోయాడు. ఆయనకి రాముడు శ్రీ మహావిష్ణువుగా దర్శనమిచ్చారు.
రాముడిని చూడగానే సన్యాసి రూపములో ఉన్న హనుమంతుడు సన్యాసి రూపము విడిచిపెట్టే తన నిజస్వరూపానికి వచ్చాడు.
రాముడు లక్ష్మణుడితో ” చూసావా లక్ష్మణా! హనుమ ఎలా మాట్లాడాడో ఆయన మాటలు విన్నావా! ఇలా మాట్లాడేవాడు మంత్రిగా దొరికితే కార్యాలు ఎందుకు నెరవేరవు? ఇలా మాట్లాడేవాడు ఎదురుగా వచ్చి నిలబడితే కత్తి పట్టి ప్రాణం తీసేద్దాము అనుకున్న వ్యక్తి కూడా కత్తిని ఒరలో పెట్టేస్తాడు. Vaalmiki Ramayanam – 48
ఇటువంటి వ్యక్తి మంత్రిగా కలిగిన ఆ రాజు ఎంతో అదృష్టవంతుడు. ఈయన మాట్లాడిన విధానాన్ని చూస్తే, ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం తెలియకపోతే ఇలా మాట్లాడలేడు.
అన్నిటినీ మించి ఈయన వ్యాకరణాన్ని చాలాసార్లు చదువుకున్నాడు. ఈయనికి ఉపనిషత్తుల అర్ధము పూర్తిగా తెలుసు. అందుకనే ఈయన మాట్లాడేటప్పుడు కనుబొమ్మలు నిష్కారణముగా కదలడము లేదు.
లలాటము కదలడం లేదు. వాక్యము లోపలినుంచి పైకి వచ్చేటప్పుడు గొణుగుతున్నటు లేదు, గట్టిగా లేదు. ఈయన మాటలు ప్రారంభించిన దగ్గరి నుంచి చివరి వరకూ ఒకే స్వరంతో పూర్తి చేస్తున్నారు.
కాళ్ళు, చేతులు, శరీరాన్ని కదపడము లేదు. ఏ శబ్దాన్ని ఎలా ఉచ్ఛరించాలో, ఎంతవరకు ఉచ్ఛరించాలో అలా పలుకుతున్నారు.
ఇటువంటి వ్యక్తి సుగ్రీవుడికి సచివుడిగా దొరికి మన దగ్గరికి వచ్చి సుగ్రీవుడితో స్నేహం కలపాలని కోరుకుంటున్నాడు. మనం అనుకున్న కోరిక సిద్ధించినట్లే. మనం ఎవరిమో! ఈ అరణ్యానికి ఎందుకు వచ్చామో హనుమకి చెప్పు ” అన్నాడు.
లక్ష్మణుడు ” అయ్యా హనుమా! ఈయన దశరథుడి కుమారుడైన రాముడు. దశరథుడు పరమ ధర్మాత్ముడై రాజ్యాన్ని పరిపాలించాడు. ఆయన ఉన్నప్పుడు ఎవరూ ఆయనని ద్వేషించలేదు.
ఆయనా ఎవరినీ ద్వేషించలేదు. చతుర్ముఖ బ్రహ్మగారిలా అందరిచేత దశరథుడు లోకులందరి చేత గౌరవింపబడినవాడు. తండ్రి మాటకి కట్టుబడి రాముడు అరణ్యానికి వచ్చాడు. ఎవరో ఒక రాక్షసుడు రాముడి భార్యయిన సీతమ్మని అపహరించాడు.
సీతమ్మని వెతికే ప్రయత్నములో ఉండగా మాకు కబంధుడనే రాక్షసుడు కనపడ్డాడు. ఆయనని సంహరించి శరీరాన్ని దహిస్తే ఆయన ధనువనే శరీరాన్ని పొంది మమ్మల్ని సుగ్రీవుడితో స్నేహం చెయ్యమని చెప్పాడు.
అందుకని మేము ఇక్కడికి వచ్చాము. నేను లక్ష్మణుడిని రాముడి తమ్ముడు అని లోకము అంటుంది. కాని రాముడి గుణములచేత తృప్తి, విశేషమైన ఆనందమును పొందినవాడనై రాముడికి దాసుడిని అనుకుంటాను.
లోకములో కష్టంలో ఉన్నవారందరూ రాముడికి శరణాగతి చేసారు. రాముడు ఈనాడు సుగ్రీవుడికి శరణాగతి చేస్తున్నాడు. మేము సుగ్రీవుడిని మిత్రుడిగా పొందాలని అనుకుంటున్నాము ” అన్నాడు. Vaalmiki Ramayanam – 48
ఈదృశా బుద్ధి సంపన్నా జితక్రోధా జితేంద్రియాః |
ద్రష్టవ్యా వానరేంద్రేణ దిష్ట్యా దర్శనమాగతాః ||
హనుమంతుడు ” జితేంద్రియులై, ధర్మాత్ములైన రామలక్ష్మణులని చూడడము మా సుగ్రీవుడికి కూడా చాలా సంతోషముగా ఉంటుంది. రండి మిమ్మల్ని తీసుకెళతాన ” ని చెప్పి రామలక్ష్మణులనిద్దరిని తన వీపు మీద కూర్చోబెట్టుకుని ఋష్యమూక పర్వత శిఖరముల మీదకి ఎక్కాడు.

Leave a Reply

%d bloggers like this: