Home Bhakthi Srivenkateswara Divya History-2

Srivenkateswara Divya History-2

0
Srivenkateswara Divya History-2
Srivenkateswara Divya History-2

Srivenkateswara Divya History-2 భృగువు చరిత్ర: భృగువు బ్రహ్మమానసపుత్రులలో ఒకఁరు.
ఇతని పుత్రుఁడు కవి. పౌత్రుడు అసురులకు గురువు అయిన శుక్రాచార్యులు.

భార్గవ వంశ మూలపురుషుడు అయిన భృగువు బ్రహ్మ హృదయ స్థానం నుండి జన్మించెను.

ఇదికాక ఇతనికి ఖ్యాతివలన ధాత, విధాత అని ఇరువురు కొడుకులు కలిగిరి. అందు ధాతకు మృకండుఁడు, విధాతకు ప్రాణుఁడును జన్మించిరి.

ప్రాణుని కొడుకు వేదశిరుఁడు. వేదశిరుని కొడుకు ఉశేనస్సుడు. మృకండుని కొడుకు మార్కండేయుఁడు.

భృగు మహర్షి ప్రజాపతులలో నవ బ్రహ్మలలో అగ్రజుడు కనుక ఆయన అత్యంత శక్తివంతుడే కాక సకల దేవతలకు సకల ఋషులకు మానవులకు పూజ్యుడు.

వారుణ యాగమున అగ్ని తేజమున జన్మించెను కనుక “వారుణీ విద్య” కు అధిపతి అయ్యారు.

ఇతఁడు భాగీరథీ దక్షిణతీరమున మహాపద్మము అనియెడు పురమునందు ఉండెను.

అతని భార్య పులోమ గర్భవతిగా ఉన్నప్పుడు, ఒకనాడు భృగువు “నేను నదీ స్నానానికి వెళ్ళొస్తాను, ఈలోగ నువ్వు నిత్యాగ్నిహోత్రానికి అవసరమైన సామాగ్రి కూర్చుము” అని చెప్పి వెడలినాడు. Srivenkateswara Divya History-2

పులోమ హోమగుండంలో అగ్ని వెలిగించి, మిగతా పనులు చేసుకుంటూ వుండగా
పులోముడు అను రాక్షసుడు, అక్కడికి వచ్చి ఆమెను చూసి కామించి, ఆమె గురించి అగ్నిదేవుణ్ణి అడుగుతాడు.

” నేను నిజం చెప్పిన పులోమకి హాని కలుగును, అబద్ధము చెప్పిన నాకు అసత్య దోషము అంటును అని” అని అగ్నిదేవుడు యోచించి

చివరికి నిజమే చెప్పాలనే నిర్ణయంతో, ఆమె భృగు మహర్షి భార్య పులోమ అని చెప్తాడు.

పులోముడు ఆమెను పెళ్ళి కాకముందు ప్రేమిస్తాడు
కాని పులోమ తిరస్కరిస్తుంది.

ఇప్పుడు సమయం వచ్చిందని ఆమెను చెరబట్టాలని నిశ్చయించి
పెద్ద వరాహంగా మారి ఆమెను తన భుజాలపై వేసుకుని పారిపోవడానికి ప్రయత్నించగా ఆమెకు ప్రసవం జరిగి మగ పిల్లవాడు జన్మిస్తాడు

అతనే చ్యవనుడు, అత్యంత శక్తి మంతుడు.
.
ఆ బాలుడు కోపంతో పులోముణ్ణి చూడగానె, మంటలలో పులోముడు కాలిపోతాడు.

అప్పుడు పులోమ ఆ పిల్లవాని తీసుకొని ఆశ్రమానికి పోయి జరిగిందంతా భృగువు కి చెప్తుంది.

భృగువు కోపంతో నీ గురించి ఎవరు చెప్పారు అని అడుగుగా అగ్నిదేవుడు చెప్పాడు అని పులోమ చెప్తుంది.

అగ్నిదేవుడు నేను అబద్ధం చెప్పిన పాపం చుట్టుకుంటుందని నిజం చెప్పాను అని
పలుకగా, భృగువు “ఇక నుండి నువ్వు సర్వభక్షకునివి అగుదువు” అని శపిస్తాడు.

అప్పుడు అగ్నిదేవుడు “నేను సర్వభక్షకుడినీ అయిన, దేవతలకు హవిస్సులు ఎలా తీసుకెళ్ళాలి” అని, తన మంటలను ఆపివేస్తాడు.

Srivenkateswara Divya History-2
Srivenkateswara Divya History-2

ఇక హోమాలు, దేవతలకు హవిస్సులు లేకపోవడంతో బ్రహ్మదేవుడు అగ్ని దగ్గరికి వచ్చి

“ఓ అగ్నిదేవా, భృగువు శాపం ప్రకారం నువ్వు సర్వభక్షకునివే,
కానీ నీ పవిత్రత పోలేదు కావున నువ్వు ఎప్పటిలాగే దేవతలకు హవిస్సులు చేరవేస్తుండు” అని చెప్పగా అగ్నిదేవుడు అంగీకరిస్తాడు. Srivenkateswara Divya History-2

ఇంతటి శక్తి మంతుడు ఆ భృగు మహర్షి అంతే కాక, భగవద్గీతలో శ్రీ కృష్ణ పరబ్రహ్మ, భృగువు గురించి ఇలా పలికెను

శ్లో: మహర్షీణాం భృగురహం గిరామస్మ్యక మక్షరం!
యజ్ఞానాం జపయజ్ఞోస్మి స్థావరాణాం హిమాలయం!!

మహర్షులలో భృగుమహర్షిని నేనే

అక్షరములలో ఓంకారమును నేనే

యజ్ఞములలో జపయజ్ఞము నేనే

స్థావరములలో హిమాలయమును నేనే యని పరమాత్మ పలికెను.

అనగా శ్రీ మహా విష్ణువే “భృగు మహర్షి” యని అవగతమవుతున్నది.

తన తపఃశక్తిచే తన పాదమున ఒక నేత్రం మొలిచేలా చేసుకున్నమహా విశిష్టత కలిగిన మహాత్ముడు భృగు మహర్షి.

అందువల్ల త్రిమూర్తులను పరీక్ష జేయగల కార్యము ఆయన మాత్రమే నిర్వర్తింపగలడు అని నిశ్చయించినారు.

తక్కిన మునులు కూడా ‘‘భృగువును పంపినచో పని చక్కబడును’’ అని ఏకీభవించిన వారయి వారి ఆమోదమును తెలిపిరి.

భృగువు తన పై బెట్టిన దుష్కర కార్యసాధనకై వారి వద్ద శెలవు గైకొని వెడలినాడు..

నిత్యనిర్మల గోవిందా, నీలమేఘశ్యామా గోవిందా, పురాణపురుష గోవిందా, పుండరికాక్ష గోవిందా; |

గోవిందా హరి గోవిందా, వేంకట రమణా గోవిందా, గోవిందా హరి గోవిందా, వేంకట రమణా గోవిందా. |

ఓం నమో వెంకటేశాయ!!

check other posts

Leave a Reply

%d bloggers like this: