
Sumati sathakam – సుమతీ శతకం
ఉదకము ద్రావెడు హయమును
మదమున నుప్పొంగుచుండు మత్తేభంబున్
మొదవుకడ నున్న వృషభముఁ
జదువని యా నీచుకడకుఁజనకుర సుమతీ!

తాత్పర్యం: ఓ సుమతీ! నీరు త్రాగెడి గుఱ్ఱము వద్దకు, క్రొవ్వుచే విజ్రుంభించు మదపు ఏనుగు వద్దకు, ఆవు దగ్గరున్న ఆంబోతు వద్దకు, విద్యనేర్వని మానవుని వద్దకు వెళ్ళరాదు. వెళ్ళినచో గుర్రము సకిలించును. ఏనుగు తొండంతో కొట్టును. ఆంబోతు పొడిచి చంపును. విద్యలేనివాడు వింత పశువు వలె ప్రవర్తించును. వీటి నుండి తప్పించుకొని వెళ్ళుట మంచిది.