
Kumara Shatakam
శ్రీ భామినీ మనోహరు
సౌభాగ్యదయాస్వభావు సారసనాభున్
లో భావించెద; నీకున్
వైభవము లోసంగుచుండ వసుధ కుమారా!

తాత్పర్యం: ఓ కుమారా! శ్రీ లక్ష్మీనాథుడును, సంపదయు, ప్రేమయు రూపంగా కల వాడును అగు శ్రీ మహావిష్ణువును నీకెల్లప్పుడును సకల ఐశ్వర్యములను ఇచ్చునట్లుగా నా మనస్సునందు తలంచుచున్నాను.