
Kumara sathakam
అతి బాల్యములోనైనను,
బ్రతికూలపు మార్గములఁబ్రవర్తింపక స
ద్గతిమీఱ మెలఁగ నేర్చిన
నతనికి లోకమున సౌఖ్యమగును కుమారా!

తాత్పర్యం: ఓ కుమారా! ఎవడు లోకమునందు చిన్నవాడుగా నుండి ఉన్నప్పటిని, విరుద్ధముగా నడవక మంచిమార్గమున నడుచుచుండునో వాడు లోకమున సుఖముగా జీవింపగలడు.