
Vemana poems – వేమన పద్యాలు
అనువుగానిచోట నధికులమనరాదు
కొంచెముండుటెల్ల కొదువ గాదు
కొండ అద్దమందు కొంచమై యుండదా?
విశ్వదాభిరామ! వినుర వేమ!

తాత్పర్యం: మనకు తగని ప్రదేశంలో గొప్పవారమని, ఎక్కువ అని అనుట మంచిది కాదు. మనకు గల గొప్పతనమును, ఆధిక్యతను ప్రదర్శించకపోయినంత మాత్రాన మన ఔన్నత్యమునకు భంగం కలగదు. కొండ ఎంత పెద్దదైననూ అద్దములో చూచినపుడు చిన్నదిగానే కనిపించును గదా! అని అర్థం.