Daily Horoscope 12/05/2021

0

Daily Horoscope 12/05/2021

ఓం శ్రీ గురుభ్యోనమః
శుభమస్తు

12, మే , 2021
స్వస్తి శ్రీ చాన్ద్రమాన ప్లవ నామ సంవత్సరమ్
చైత్రమాసము
వసంత ఋతువు
ఉత్తరాయణము సౌమ్య వాసరే
( బుధ వారం )

శ్రీ ప్లవ సంవత్సర దేవతా ధ్యానమ్
అగ్నిం నమామి సతతం జ్వాలామాలం తమోపహమ్ ౹
అజారూఢం చతుర్హస్తం ద్విశీర్షం ప్లవసంజ్ఞికమ్ ౹౹

Daily Horoscope 12/05/2021
Daily Horoscope 12/05/2021

రాశి ఫలాలు

మేషం

ఉత్సాహంతో ముందుకు సాగితే సత్ఫలితాలు సాధిస్తారు. కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది. సమాజంలో తోటివారికి సహాయపడతారు. కీర్తి పెరుగుతుంది.
గోవింద నామాలు చదవాలి. Daily Horoscope 12/05/2021

 వృషభం

మధ్యమ ఫలితాలున్నాయి. ఒక వ్యవహారంలో కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. అస్థిర బుద్ధితో ఇబ్బందులు ఎదుర్కొంటారు. కలహాలు సూచితం. అధికారులను ప్రసన్నం చేసుకోవడానికి అధికంగా శ్రమించాల్సి వస్తుంది. ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ అవసరం.
నవగ్రహ శ్లోకం చదవండి.

మిధునం

మంచి కాలం. చేసే పనిలో విజయావకాశాలు పెరుగుతాయి. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. ఒక సంఘటన మానసిక శక్తిని పెంచుతుంది. ఇష్టదైవ స్తుతి శక్తినిస్తుంది

 కర్కాటకం

అభివృద్ధికి సంబంధించిన వ్యవహారాల్లో మీకు అనుకూలమైన నిర్ణయాలు వస్తాయి. గొప్ప వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. స్థానచలన సూచనలు ఉన్నాయి. లలితా సహస్రనామ పారాయణ చేయాలి.

సింహం

ఒక వ్యవహారంలో అందరి ప్రశంసలను అందుకుంటారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. శుభకార్యక్రమాల్లో పాల్గొంటారు.
తల్లిదండ్రుల ఆశీర్వచనాలు మేలుచేస్తాయి.

 కన్య

ముఖ్య కార్యాల్లో ఆలస్యం జరిగే సూచనలు ఉన్నాయి. ఆపదలు కలుగకుండా చూసుకోవాలి. శ్రమకు తగిన గుర్తింపు దక్కడానికి బాగా కష్టపడాల్సి వస్తుంది. విష్ణుసహస్రనామాలు పారాయణ చేయడం మంచిది.

తుల

మీరు పనిచేసే రంగంలో ఊహించిన ఫలితాలు వెలువడతాయి. బంధుమిత్రులతో కలిసి శుభకార్యక్రమాల్లో పాల్గొంటారు. సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఆదిత్య హృదయం పారాయణ చేస్తే బాగుంటుంది.

వృశ్చికం

కాలానుగుణంగా ముందుకు సాగితే సత్ఫలితాలు వస్తాయి. ఆర్థికంగా ఫర్వాలేదనిపిస్తుంది. కీలక పనుల్లో కాస్త జాప్యం జరిగే సూచనలు ఉన్నాయి. హనుమాన్ చాలీసా పఠించడం మంచిది.

ధనుస్సు
చేపట్టే పనుల్లో శ్రమ పెరుగుతుంది. మీ కుటుంబ సభ్యులతో అభిప్రాయం బేధాలు రాకుండా చూసుకోవాలి. ఒక సంఘటన ఇబ్బంది కలిగిస్తుంది. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. శ్రీరామ నామాన్ని జపించాలి.

మకరం

అనుకూలమైన వాతావరణం ఉంటుంది. ఆర్థికంగా జాగ్రత్తలు అవసరం. నూతన వస్తువులను కొంటారు. మీ అధికార పరిధి పెరుగుతుంది. లక్ష్మి గణపతి ఆరాధన శుభప్రదం.

 కుంభం

పట్టుదలతో పనిచేస్తే మంచి ఫలితాలను సాధిస్తారు. చక్కటి ప్రణాళికలతో వ్యాపారంలో లాభాలను పొందుతారు. ఒక వార్త మనోధైర్యాన్నిపెంచుతుంది. Daily Horoscope 12/05/2021

 మీనం

మీమీ రంగాల్లో శ్రద్ధగా పనిచేయాలి. అందరినీ కలుపుకొనిపోవడం వల్ల సమస్యలు తగ్గుతాయి. శ్రమ అధికమవుతుంది. సమాచారలోపం లేకుండా చూసుకోవాలి. ఆవేశాలకు పోకూడదు.
దుర్గా ధ్యాన శ్లోకం చదివితే మంచి జరుగుతుంది.

సమస్తసన్మంగళాని భవన్తు,
ఇష్టకామ్యార్థఫలసిద్ధిరస్తు,
శుభపరంపరాప్రాప్తిరస్తు,
ఇష్టదేవతానుగ్రహప్రసాదసిద్ధిరస్తు
లోకాసమస్తా సుఖినోభవంతు
సర్వేజనాః సుఖినోభవ

Daily Horoscope 11/05/2021
Daily Horoscope 11/05/2021

పంచాంగం

ఓం శ్రీ గురుభ్యోనమః
మే 12, 2021
శ్రీ ప్లవ నామ సంవత్సరం
ఉత్తరాయణం
వసంత ఋతువు
వైశాఖ మాసం
శుక్ల పక్షం
తిధి: పాడ్యమి రా1.20
తదుపరి విదియ
వారం: బుధవారం
(సౌమ్యవాసరే)
నక్షత్రం: కృత్తిక రా1.18
తదుపరి రోహిణి
యోగం: శోభన రా10.49
తదుపరి అతిగండ
కరణం: కింస్తుఘ్నం మ12.18
తదుపరి బవ రా1.20
ఆ తదుపరి బాలువ
వర్జ్యం: ఉ11.59 – 1.46
దుర్ముహూర్తం: ఉ11.30 – 12.21
అమృతకాలం: రా10.38 – 12.24
రాహుకాలం: మ12.00 – 1.30
యమగండం: ఉ7.30 – 9.00
సూర్యరాశి: మేషం
చంద్రరాశి: వృషభం
సూర్యోదయం: 5.34
సూర్యాస్తమయం: 6.18 Daily Horoscope 12/05/2021

check other posts

Leave a Reply

%d bloggers like this: