Kumara Satakam – కుమార శతకం
ఆజ్ఞ యొనర్చెడి వృత్తుల
లో జ్ఞానము గలిగి మెలఁగు లోకులు మెచ్చన్,
బ్రాజ్ఞతను గలిగి యున్నన్,
బ్రాజ్ఞులలోఁబ్రాజ్ఞుడవుగ ప్రబలు కుమారా!
తాత్పర్యం: ఓ కుమారా! ఇతరులకు ఉత్తర్వు చేయునట్టి పనులలో వివేకము కలిగి నడుచుకొనుము. లోకమునందలి వారెల్లరునూ మెచ్చుకొనునట్లుగా వివేకము కలిగి యుండిన యెడల నిన్ను బుద్ధిమంతులగు వారిలో బుద్ధిమంతుడువుగ ఎంచుతారు.