Daily horoscope – 10/05/2021

0
Daily horoscope – 10/05/2021
Daily Horoscope 6/02/2022

Daily horoscope – 10/05/2021

ఓం శ్రీ గురుభ్యోనమః 
శుభమస్తు 

10, మే , 2021
స్వస్తి శ్రీ చాన్ద్రమాన ప్లవ నామ సంవత్సరమ్
చైత్రమాసము
వసంత ఋతువు
ఉత్తరాయణము ఇందు వాసరే
( సోమ వారం )

శ్రీ ప్లవ సంవత్సర దేవతా ధ్యానమ్
అగ్నిం నమామి సతతం జ్వాలామాలం తమోపహమ్ ౹
అజారూఢం చతుర్హస్తం ద్విశీర్షం ప్లవసంజ్ఞికమ్ ౹౹

రాశి ఫలాలు

Daily horoscope 10/05/2021
Daily horoscope 10/05/2021
మేషం

శుభఫలితాలున్నాయి. ఒక ముఖ్యమైన పనిని విజయవంతంగా పూర్తి చేస్తారు. ఒక ముఖ్యమైన విషయమై అధికారులను కలుస్తారు. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. ఈశ్వర సందర్శనం చేస్తే మంచి జరుగుతుంది.

వృషభం

చేపట్టే పనుల్లో శ్రద్ధ బాగా అవసరం. భవిష్యత్ ప్రణాళికలు కొన్ని అమలు చేయగలుగుతారు. ముఖ్య విషయాల్లో బంధుమిత్రుల సలహాలు అవసరమవుతాయి. మొహమాటంతో ఖర్చులు పెరుగుతాయి.
శ్రీ లక్ష్మీగణపతి ధ్యానం శుభప్రదం.

మిధునం

శ్రమఫలిస్తుంది. కార్యసిద్ధి ఉంది. ఆర్థిక వ్యవహారాలలో అప్రమత్తంగా ఉండాలి. మాతృసౌఖ్యం ఉంది. నవగ్రహ ధ్యానం శుభప్రదం.

కర్కాటకం

శ్రమ పెరగకుండా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఉత్సాహంగా పనిచేయాలి. కీలక వ్యవహారాల్లో కుటుంబ సహకారం అందుతుంది. అవగాహనా లోపం లేకుండా చూసుకోవాలి. ఒత్తిడి పెరగకుండా చూసుకోవాలి. ఈశ్వర సందర్శనం శుభప్రదం.

సింహం

తలపెట్టిన కార్యాల్లో ఉత్సాహంతో పనిచేసి విజయం సాధిస్తారు. ఆర్థికంగా శుభఫలితాలున్నాయి. విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గంటారు. ఆత్మీయులతో ఆనందంగా గడుపుతారు. ఇష్టదైవారాధన శుభప్రదం.

కన్య

శారీరక శ్రమ పెరుగుతుంది. ముఖ్య వ్యవహారాల్లో స్థితప్రజ్ఞతతో వ్యవహరించాలి. అనవసర విషయాలలో సమయాన్ని వృథా చేయకండి. శివ నామస్మరణ ఉత్తమ ఫలితాలను ఇస్తుంది.

తుల

చేపట్టే పనుల్లో శారీరక శ్రమ పెరుగకుండా చూసుకోవాలి. మొహమాటం వల్ల ఇబ్బందులను ఎదుర్కొంటారు. ప్రయాణాల్లో జాగ్రత్త. వేంకటేశ్వర స్వామిని సందర్శించడం మంచిది.

వృశ్చికం

మనస్సౌఖ్యం ఉంది. బుద్ధిబలం బాగుంటుంది. సందర్భోచితంగా కీలక నిర్ణయాలు తీసుకుంటారు. బంధువులతో ఆనందంగా గడుపుతారు. విద్య వినోద సుఖం ఉంది. సుబ్రహ్మణ్యస్వామిని ఆరాధిస్తే మంచిది.

ధనుస్సు

మనోబలాన్ని కోల్పోరాదు. మంచిపనులు తలపెడతారు. అనవసర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. కుటుంబ వాతావరణం అంత అనుకూలంగా ఉండకపోవచ్చు. శారీరక శ్రమ పెరుగుతుంది.
శని ధ్యానం శుభప్రదం.

మకరం

కీలకమైన పనులను ప్రారంభిస్తారు. మీ ధర్మం మిమ్మల్ని ఉన్నతుల్ని చేస్తుంది. మొహమాటం వల్ల ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఆహార నియమాలను పాటించాలి.
వేంకటేశ్వర స్వామిని సందర్శించడం మంచిది.

కుంభం

మీ అభివ్రుద్దికి దోహదపడే ఒక కీలక నిర్ణయాన్ని తీసుకుంటారు. తరచూ నిర్ణయాలు మారుస్తూ ఇబ్బందులు పడతారు. స్థిరమైన బుద్ధితో ముందుకు సాగండి. కుటుంబంలో సమస్యలు రాకుండా జాగ్రత్తపడాలి.
దుర్గా అష్టోత్తరం చదవడం మంచిది.

మీనం

మీ మీ రంగాల్లో విజయావకాశాలు మెరుగవుతాయి. అభివృద్ధికై చేసే ఆలోచనలను ఆచరణలో పెట్టి సత్ఫలితాలు సాధిస్తారు. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. పెద్దల ఆశీర్వచనాలుంటాయి. ప్రయాణాలు ఫలిస్తాయి. ఇష్టదైవారాధన శుభప్రదం.

Daily Horoscope - 10/05/2021
Daily Horoscope – 10/05/2021

Panchangam – 10/05/2021

ఓం శ్రీ గురుభ్యోనమః 
 మే 10, 2021 
శ్రీ ప్లవ నామ సంవత్సరం
ఉత్తరాయణం
వసంత ఋతువు
చైత్ర మాసం
కృష్ణ పక్షం
తిధి: చతుర్థశి రా9.21
తదుపరి అమావాస్య
వారం: సోమవారం
(ఇందువాసరే)
నక్షత్రం: అశ్విని రా8.10
తదుపరి భరణి
యోగం: ఆయుష్మాన్ రా9.36
తదుపరి సౌభాగ్యం
కరణం: భద్ర/విష్ఠి ఉ8.30
తదుపరి శకుని రా9.21
ఆ తదుపరి చతుష్పాత్
వర్జ్యం: మ3.47 – 5.32
దుర్ముహూర్తం: మ12.20 – 1.11
&
మ2.53 – 3.44
అమృతకాలం: మ12.17 – 2.02
రాహుకాలం: ఉ7.30 – 9.00
యమగండం: ఉ10.30 – 12.00
సూర్యరాశి: మేషం
చంద్రరాశి: మేషం
సూర్యోదయం: 5.34
సూర్యాస్తమయం: 6.17
 మాస శివరాత్రి 
లోకాః సమస్తాః
సుఖినోభవంతు
సర్వే జనాః సుఖినోభవంతు              Daily horoscope – 10/05/2021

check other posts

Leave a Reply

%d bloggers like this: