Home PANCHANGAM Daily Horoscope – 09/05/2021

Daily Horoscope – 09/05/2021

0

Daily Horoscope – 09/05/2021

ఓం శ్రీ గురుభ్యోనమః
శుభమస్తు

09, మే , 2021
స్వస్తి శ్రీ చాన్ద్రమాన ప్లవ నామ సంవత్సరమ్
చైత్రమాసము
వసంత ఋతువు
ఉత్తరాయణము భాను వాసరే
( ఆది వారం )

శ్రీ ప్లవ సంవత్సర దేవతా ధ్యానమ్
అగ్నిం నమామి సతతం జ్వాలామాలం తమోపహమ్ ౹
అజారూఢం చతుర్హస్తం ద్విశీర్షం ప్లవసంజ్ఞికమ్ ౹౹

Daily Horoscope - 09/05/20211
Daily Horoscope – 09/05/2021

 

రాశి ఫలాలు

మేషం

మీ ప్రతిభకు పనితీరుకు అధికారుల ప్రశంసలు లభిస్తాయి. కుటుంబంలో ఆనందకర వాతావరణం నెలకొంటుంది. బంధుమిత్రుల వల్ల మేలు జరుగుతుంది. సుబ్రహ్మణ్య భుజంగస్తవం పఠించాలి.

వృషభం

చేపట్టిన పనులలో ముందుచూపు అవసరం. ఒక వ్యవహారంలో కీలక నిర్ణయం తీసుకుంటారు. మనోబలాన్ని తగ్గించే సంఘటనలకు దూరంగా ఉండాలి.
ఆదిత్య హృదయం చదవడం ఉత్తమం.

మిధునం

చేపట్టిన పనులను ప్రణాళికా బద్దంగా పూర్తిచేసే ప్రయత్నం చేస్తారు. అవసరానికి తగిన సహాయం చేసేవారున్నారు. కొన్ని విషయమాలలో మీరు అనుకున్నదానికంటే ఎక్కువ శ్రమ పడాల్సి వస్తుంది. ఎవ్వరితోను విభేదించకండి. దుర్గాదేవిని ఆరాధిస్తే మంచిది.

కర్కాటకం

మానసికసౌఖ్యం కలదు. కొన్ని కీలక వ్యవహారాలలో కుటుంబసభ్యుల సహకారం లభిస్తుంది. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. ముఖ్య వ్యవహారాల్లో నిర్లక్ష్యం చేయవద్దు.
గోసేవ చేయాలి.

 సింహం

దైవబలం విశేషంగా రక్షిస్తోంది. ఆర్థికంగా అనుకూలమైన సమయం. సమాజంలో గౌరవ మర్యాదలు ఉంటాయి. భవిష్యత్ ప్రణాళికలు వేస్తారు. అభివృద్ధి పథంలో ముందుకు సాగుతారు. విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. ఇష్టదైవారాధన శుభదాయకం.

కన్య

సంపూర్ణ మనోబలంతో ముందుకు సాగి అనుకున్నది సాధిస్తారు. అనవసర విషయాలతో కాలం వృథా కాకుండా చూసుకోవాలి. కలహ సూచన ఉంది. అనవసర ప్రసంగాలు చేయకండి. శత్రువుల విషయంలో ఆచితూచి అడుగు వేయాలి. శని ధ్యాన శ్లోకం చదవాలి.

తుల

మానసికంగా ద్రుఢంగా ఉంటారు. సమయస్ఫూర్తిగా నిర్ణయాలు తీసుకోవాలి. ముఖ్యమైన వ్యవహారాలలో మీరు ఆశించిన ఫలితాలు వస్తాయి.
దుర్గాస్తుతి చేయడం వలన మంచి ఫలితాలను పొందగలుగుతారు.

వృశ్చికం

శ్రమ ఫలిస్తుంది. ఉద్యోగంలో మంచి ఫలితాలు ఉన్నాయి. స్వస్థాన ప్రాప్తి ఉంది. శుభకార్యక్రమాలలో పాల్గొంటారు. పెద్దల ఆశీర్వచనాలు మేలు చేస్తాయి. కొన్ని సంఘటనలు మిమ్మల్ని నిరుత్సాహపరుస్తాయి. దుర్గాస్తుతి పఠించాలి.

ధనుస్సు

చేసే పనుల్లో అవగాహన లోపం లేకుండా చూసుకోవాలి. అనవసర ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. బంధుమిత్రులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. అధికారులను మెప్పించడానికి కాస్త ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది.
శివ స్తోత్రం పఠించడం వలన మంచి ఫలితాలు పొందగలరు.

మకరం

శుభ సమయం. కీలక వ్యవహారాల్లో సమయస్పూర్తితో వ్యవహరించి అందరి ప్రశంసలను అందుకుంటారు. మీ మీ రంగాల్లో స్పష్టమైన ఆలోచనలతో ముందుకు సాగి మంచి ఫలితాలు పొందుతారు. ఇష్టదైవం ధ్యానం శుభప్రదం.

కుంభం

శుభ కార్యక్రమములలో పాల్గొంటారు. ఆత్మవిశ్వాసంతో చేసే పనులు మంచినిస్తాయి, మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. అవసరానికి సహాయం చేసేవారున్నారు. విష్ణుసహస్రనామ పారాయణం చేయాలి.

 మీనం

అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి ఒక వ్యవహారంలో డబ్బు చేతికి అందుతుంది. ఒక వ్యవహరంలో మీ పేరుప్రతిష్ఠలు పెరుగుతాయి. విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు.
హనుమాన్ చాలీసా పారాయణ చేయడం మంచిది.

 

Daily Horoscope - 09/05/2021
Daily Horoscope – 09/05/2021

పంచాంగం

ఓం శ్రీ గురుభ్యోనమః
మే 9, 2021
శ్రీ ప్లవ నామ సంవత్సరం
ఉత్తరాయణం
వసంత ఋతువు
చైత్ర మాసం
కృష్ణ పక్షం
తిధి: త్రయోదశి రా7.39
తదుపరి చతుర్థశి
వారం: ఆదివారం
(భానువాసరే)
నక్షత్రం: రేవతి సా5.53
తదుపరి అశ్విని
యోగం: ప్రీతి రా9.14
తదుపరి ఆయుష్మాన్
కరణం: గరజి ఉ7.00
తదుపరి వణిజ రా7.39
ఆ తదుపరి భద్ర/విష్ఠి
వర్జ్యం: ఉ.శే. వ6.40వరకు
దుర్ముహూర్తం: సా4.35 – 5.26
అమృతకాలం: మ3.18 – 5.01
రాహుకాలం: సా4.30 – 6.00
యమగండం: మ12.00 – 1.30
సూర్యరాశి: మేషం
చంద్రరాశి: మీనం
సూర్యోదయం: 5.34
సూర్యాస్తమయం: 6.17

check other posts

Leave a Reply

%d bloggers like this: