Home Poetry Anniversary of “Thallapaka Annamacharyulu” :

Anniversary of “Thallapaka Annamacharyulu” :

0
Anniversary of  “Thallapaka Annamacharyulu” :
Anniversary of "Tallapaka Annamacharya"

Anniversary of “Thallapaka Annamacharyulu” :తెలుగునాట తాళ్లపాక గ్రామంలో 15వ శతాబ్దంలో జన్మించిన అన్నమాచార్యులు సంస్కృతాంధ్ర భాషల్లో రచించిన వేల పదకవితలు పండితులను, పామరులను రంజింపజేశాయి. తత్త్వసంకీర్తనలు గానం చేస్తూ, తంబురమీటుతూ పురవీధులలో, తిరువీధులలో నాట్యం చేశాడు అన్నమయ్య.

ఆనాటి వేద వాఙ్మయం నుండి నేటి ఆధునిక సాహిత్యం వరకు అన్ని ప్రక్రియల్లో కనిపించే మానవతాధర్మాలు అన్నమయ్య పదాలలో గమనించవచ్చు.

Anniversary of "Tallapaka Annamacharya"
Anniversary of “Tallapaka Annamacharya”

‘నానాటి బతుకు నాటకము/ కానక కన్నది కైవల్యము/ పుట్టుటయు నిజము పోవుటయు నిజము/ నట్టనడిమి పని నాటకము/ యెట్ట నెదుట గల దీ ప్రపంచము/ కట్ట గడపటిది కైవల్యము/ కుడిచే దన్నము కోక చుట్టెడిది/ నడ మంత్రపు పని నాటకము/ వొడి గట్టుకొనిన వుభయ కర్మములు/ గడి దాటినపుడె కైవల్యము/ తెగదు పాపము తీరదు పుణ్యము/ నగి నగి కాలము నాటకము/ యెగువనె శ్రీ వేంకటేశ్వరుడేలిక/ గగనము మీదిది కైవల్యము’ అన్నాడు అన్నమయ్య.

ఎదుట కనిపిస్తున్న ఈ ప్రపంచమంతా ఒక రంగస్థలం, దానిపై మానవుల అశాశ్వతమైన బతుకు నాటకమేనని ఉద్బోధించాడు. మనిషి పుట్టడం నిజం, మరణించడం నిజం, ఈ మధ్య జరుగుతున్న బతుకు కేవలం నాటకం; ఈ జనన మరణచక్రం ఎక్కడ ఆగుతుందో అదే కైవల్యము అన్నాడు. Anniversary of “Thallapaka Annamacharyulu”

అదివో అల్లదివో శ్రీహరివాసము
పదివేల శేషుల పడగలమయము॥

అదె వేంకటాచల మఖిలోన్నతము
అదివో బ్రహ్మాదుల కపురూపము
అదివో నిత్యనివాస మఖిలమునులకు
అదె చూడుడదె మ్రొక్కుడానందమయము॥

చెంగట నల్లదివో శేషాచలము
నింగి నున్నదేవతల నిజవాసము
ముంగిట నల్లదివో మూలనున్నధనము
బంగారు శిఖరాల బహు బ్రహ్మమయము॥

కైవల్యపదము వేంకటనగమదివో
శ్రీ వేంకటపతికి సిరులైనవి
భావింప సకలసంపదరూపమదివో
పావనములకెల్ల పావనమయము॥

check other posts

Leave a Reply

%d bloggers like this: