Home PANCHANGAM Daily horoscope : 08/052021

Daily horoscope : 08/052021

0
Daily horoscope : 08/052021

Daily horoscope : 08/052021

ఓం శ్రీ గురుభ్యోనమః
శుభమస్తు

08, మే , 2021
స్వస్తి శ్రీ చాన్ద్రమాన ప్లవ నామ సంవత్సరమ్
చైత్రమాసము
వసంత ఋతువు
ఉత్తరాయణము స్థిర వాసరే
( శని వారం )

శ్రీ ప్లవ సంవత్సర దేవతా ధ్యానమ్
అగ్నిం నమామి సతతం జ్వాలామాలం తమోపహమ్ ౹
అజారూఢం చతుర్హస్తం ద్విశీర్షం ప్లవసంజ్ఞికమ్ ౹౹

Daily Horoscope : 08/05/2021
Daily Horoscope : 08/05/2021

రాశి ఫలాలు

మేషం

కుటుంబ సభ్యులతో కలిసి చేసే పనులు వెంటనే సిద్ధిస్తాయి. కీలక వ్యవహారాల్లో బుద్ధిబలం బాగా పనిచేస్తుంది. సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి. సాయి చరిత్ర పారాయణ చేయడం మంచిది.

వృషభం
మధ్యమ ఫలితాలు ఉన్నాయి. హుషారుగా పని చేయాలి. అధికారులతో అతి చనువు వద్దు. అందరినీ సమభావంతో చూడటం వల్ల సమస్యలు తగ్గుముఖం పడతాయి. గోసేవ చేయడం మంచి ఫలితాలను ఇస్తుంది.

మిధునం
చేపట్టే పనుల్లో అనుకూల ఫలితాలు ఉన్నాయి. లక్ష్యసాధనలో కుటుంబ సభ్యుల సహాయం లభిస్తుంది. అనవసర విషయాల్లో తలదూర్చకండి. మనఃశ్శాంతి తగ్గకుండా చూసుకోవాలి. విష్ణు సహస్రనామం చదివితే మంచిది

కర్కాటకం
అనుకూల సమయం. తోటి వారి సహకారాలు అందుతాయి. మీ బుద్ధిబలంతో కీలక సమస్యలను పరిష్కరించి అందరి మన్ననలు పొందుతారు. ప్రయాణాలు ఫలిస్తాయి. గణపతి ఆరాధన చేస్తే మంచిది.

సింహం
పట్టుదలతో ముందుకు సాగి అనుకున్నది సాధిస్తారు. కొందరి ప్రవర్తన మీ మనసును చికాకు పరుస్తుంది. అకారణ కలహ సూచన ఉంది. ఎట్టిపరిస్థితుల్లోనూ దైవారాధన మానకండి. ఇష్టదైవ సందర్శనం శుభప్రదం.

కన్య
అలసట పెరుగుతుంది. బంధుమిత్రులతో ఆచితూచి వ్యవహరించాలి. ఒక సంఘటన మనస్తాపాన్ని కలిగిస్తుంది. మహాలక్ష్మీ ధ్యానం శుభప్రదం.

తుల
ధర్మసిద్ధి ఉంది. కాలాన్ని సద్వినియోగం చేసుకోండి. మనోధైర్యంతో చేసే పనులు సిద్ధిస్తాయి. వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. గురుశ్లోకం చదవాలి.

వృశ్చికం
పనుల్లో ఆటంకాలు ఎదురైనా తెలివిగా పరిష్కరిస్తారు. మీ పై అధికారులతో అప్రమత్తంగా ఉండాల్సిన సమయం. దుష్టులను దరిచేరనీయకండి. ఈశ్వర సందర్శనం ఉత్తమ ఫలితాన్ని ఇస్తుంది.

ధనుస్సు
శుభ ఫలితాలు ఉన్నాయి. తోటివారి సహకారం ఉంటుంది. సమయానికి ఆహారం, విశ్రాంతి తీసుకోవాలి. ఖర్చులు పెరుగుతాయి. వేంకటేశ్వర స్వామి ఆరాధన శ్రేయోదాయకం.

మకరం
సమాజంలో గొప్ప పేరు ప్రతిష్టలను సంపాదిస్తారు. ఆత్మీయులతో కలిసి మరువలేని మధుర క్షణాలను గడుపుతారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. విష్ణు సహస్రనామం పఠించాలి.

కుంభం
ఆత్మబలంతో పోరాడి విజయం సాధిస్తారు. ధనధాన్యాభివృద్ధి కలదు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకండి. విష్ణు సహస్రనామ స్తోత్రం చదివితే మంచిది

మీనం
సత్పలితాలు ఉన్నాయి. సకాలంలో పనులు పూర్తి చేస్తారు. ఆత్మీయులతో ఆనందంగా గడుపుతారు. గొప్పవారిని కలుస్తారు. వ్యాపారంలో లాభాలు ఉన్నాయి. మానసిక ప్రశాంతత ఉంటుంది. ఆదిత్య హృదయం పఠించాలి.      Daily horoscope : 08/052021

Panchangam 08/05/2021
Panchangam 08/05/2021

Panchangam – 08/05/2021

శ్రీ గురుభ్యోనమః
శనివారం, మే 8, 2021
శ్రీ ప్లవ నామ సంవత్సరం
ఉత్తరాయణం వసంత ఋతువు
చైత్ర మాసం బహుళ పక్షం
తిధి:ద్వాదశి సా6.21 తదుపరి త్రయోదశి
వారం:శనివారం (స్థిరవాసరే)
నక్షత్రం:ఉత్తరాభాద్ర సా4.00 తదుపరి రేవతి
యోగం:విష్కంభం రా9.10 తదుపరి ప్రీతి
కరణం:కౌలువ ఉ5.55 తదుపరి తైతుల సా6.21ఆ తదుపరి గరజి
వర్జ్యం :తె4.57నుండి
దుర్ముహూర్తం :ఉ5.35 – 7.16
అమృతకాలం:ఉ10.54 – 12.36
రాహుకాలం: ఉ9.00 – 10.30
యమగండం/కేతుకాలం:మ1.30 – 3.00
సూర్యరాశి:మేషం ||
చంద్రరాశి: మీనం
సూర్యోదయం: 5.35

సూర్యాస్తమయం: 6.17

check other posts

Leave a Reply

%d bloggers like this: