Home Poetry Bathrulahari subhashithalu Rathnalu – భర్తృహరి సుభాషిత రత్నములు

Bathrulahari subhashithalu Rathnalu – భర్తృహరి సుభాషిత రత్నములు

0

Bathrulahari subhashithalu Rathnalu

భర్తృహరి సుభాషిత రత్నములు
మూర్ఖుల దెల్పు నెవ్వడు?

మత్తేభం పద్యము:

కరిరాజున్ బిసతంతు సంతతులచే, కట్టన్ విజృంభించు వా
డురు వజ్రంబు శిరీష పుష్పము లచే నూహించు భేదింప, తీ
పు రచింపన్ లవణాబ్దికిన్, మధు కణంబున్ చిందు యతించు, ని
ద్ధరణిన్ మూర్ఖుల దెల్పు నెవ్వడు సుధా ధారానుకా రోక్తులన్

Bathrulahari subhashithalu Rathnalu
Bathrulahari subhashithalu Rathnalu

నీతి శతకం
మూర్ఖ పద్ధతి., ఏనుగు లక్ష్మణ కవి

మూర్ఖుని సమాధాన పర్చుట.. అ వివేకము!
అంటారు, మహా కవి
భర్తృహరి మహా శయుడు.
మదపు టేనుగును లేత తామర తూడు దారము లతో బంధించుటకు; ప్రయత్నించు వాడు;
శిరీష పుష్పము ( దిరిసన పువ్వు ) అంచుతో.. వజ్రము,రత్నము లను కోయుటకు; ఊహించు వాడు;
లవణ(ఉప్పు) సముద్రమును.. మధురముగా (తీపిగా) చేయుటకు; అందొక తేనె బొట్టును విడుచు వాడు;
మంచి మాటలతో.. మూర్ఖ నరులను, మంచి త్రోవలో మరలించుటకు కోరువాడు; అని, కవి హృదయము!
తెలుగు బాల పదాలు
మంచి మాటల నైన
వినిపించు కోలేరు!
దురాలోచన యందు!
ఓ తెలుగు బాల!

check other posts

Leave a Reply

%d bloggers like this: