Daily Horoscope : 7/05/2021

0
Daily Horoscope : 7/05/2021

Daily Horoscope : 7/05/2021

ఓం శ్రీ గురుభ్యోనమః 
శుభమస్తు

07, మే , 2021
స్వస్తి శ్రీ చాన్ద్రమాన ప్లవ నామ సంవత్సరమ్
చైత్రమాసము
వసంత ఋతువు
ఉత్తరాయణము భృగు వాసరే
( శుక్ర వారం )

శ్రీ ప్లవ సంవత్సర దేవతా ధ్యానమ్
అగ్నిం నమామి సతతం జ్వాలామాలం తమోపహమ్ ౹
అజారూఢం చతుర్హస్తం ద్విశీర్షం ప్లవసంజ్ఞికమ్ ౹౹

Daily Horoscope : 7/05/2021
Daily Horoscope 5/05/2021

రాశి ఫలాలు

మేషం

ఒక వార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. కీలక వ్యవహారాలలో కుటుంబ సభ్యుల సలహాలతో మంచి జరుగుతుంది. చేపట్టిన పనులను ప్రణాళికాబద్ధంగా పూర్తిచేస్తారు. సమయానికి నిద్రాహారాలు అవసరం. శివారాధన శుభప్రదం

వృషభం

మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. భవిష్యత్తు ప్రణాళికలు వేస్తారు. బంధుమిత్రులతో అభిప్రాయ బేధాలు వచ్చే సూచనలు ఉన్నాయి. ఆగ్రహావేశాలకు పోకూడదు. నవగ్రహ ధ్యాన శ్లోకం చదవాలి

 మిధునం

భవిష్యత్తు ప్రణాళికలు వేస్తారు. శ్రమ పెరగకుండా ముందుచూపుతో వ్యవహరించాలి. ఒక శుభవార్త మీ మనోధైర్యాన్ని పెంచుతుంది. శివారాధన శుభప్రదం.

కర్కాటకం

బంధుమిత్రులతో కలిసి శుభకార్యక్రమంలో పాల్గొంటారు. మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. కొన్ని సంఘటనలు మిమ్మల్ని ఉత్సాహపరుస్తాయి. దుర్గాదేవి సందర్శనం శుభప్రదం.

సింహం

అనుకున్న పనిని వెంటనే పూర్తి చేయగలుగుతారు. కీర్తి పెరుగుతుంది. సంతోషంగా గడుపుతారు. భోజనంసౌఖ్యం కలదు. ప్రశాంతమైన జీవనం ఉంది. లక్ష్మీ ఆరాధన మంచిది.

కన్య

అనుకున్న పనులను ప్రణాళికాబద్ధంగా పూర్తిచేయగలుగుతారు. శారీరక శ్రమ పెరిగినా అందుకు తగిన ఫలితాలు లభించడం వల్ల సంతోషంగా ఉంటారు. దుర్గాస్తుతి పఠించాలి.

తుల

అభివృద్ధి వైపు అడుగులు వేస్తారు. కొద్దిపాటి సమస్యలు ఉన్నప్పటికీ ఆరోగ్యం ఫర్వాలేదనిపిస్తుంది. మానసికంగా దృఢంగా ఉంటారు. తల్లిదండ్రుల ఆశీర్వచనాలు మంచినిస్తాయి.

వృశ్చికం

మనః సౌఖ్యం ఉంది. బంధుమిత్రుల సహకారంతో పనులు పూర్తి చేయగలుగుతారు. ధన,ధన్య లాభాలు ఉన్నాయి. సత్యనిష్ఠతో విజయసిద్ధి ఉంది. లక్ష్మీధ్యానం శుభప్రదం Daily Horoscope : 7/05/2021

ధనుస్సు

చేపట్టిన పనులను ప్రణాళికాబద్ధంగా పూర్తి చేస్తారు. అనవసర వ్యవహారాల్లో తలదూర్చకుండా ఉండటం మేలు. సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి. నారాయణ మంత్రాన్ని జపించాలి

మకరం

మీ మీ రంగాల్లో మీ శక్తిసామర్ధ్యాలు పెరుగుతాయి. శుభకార్యక్రమాలలో పాల్గొంటారు. ఒక వార్త బాధ కలిగిస్తుంది. ముఖ్యమైన విషయాల్లో తొందరపాటు నిర్ణయాలు వద్దు. గణపతిని పూజిస్తే మంచిది.

కుంభం

వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో మీకు ప్రోత్సాహకరమైన వాతావరణం ఉంటుంది. ఆర్థికంగా అన్నివిధాలా బాగుంటుంది. బంధువులతో విబేధాలు వచ్చే సూచనలు ఉన్నాయి. విష్ణు నామస్మరణ మేలు చేస్తుంది.

 మీనం

అనుకూల ఫలితాలు ఉన్నాయి. ఆస్తిని వృద్ధి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబ సౌఖ్యం కలదు. కీలక వ్యవహారాలు అనుకూలిస్తాయి. ఇష్టదైవ ధ్యానం శుభప్రదం.

పంచాంగం

శ్రీ గురుభ్యోనమః
శుక్రవారం, మే 7, 2021
శ్రీ ప్లవ నామ సంవత్సరం
ఉత్తరాయణం వసంత ఋతువు
చైత్ర మాసం బహుళ పక్షం
తిధి:ఏకాదశి సా5.29 తదుపరి ద్వాదశి
వారం:శుక్రవారం (భృగువాసరే)
నక్షత్రం:పూర్వాభాద్ర మ2.31 తదుపరి ఉత్తరాభాద్ర
యోగం:వైధృతి రా9.26 తదుపరి విష్కంభం
కరణం:బాలువ సా5.29 తదుపరి కౌలువ
వర్జ్యం: రా12.42 – 2.24
దుర్ముహూర్తం:ఉ8.07 – 8.58 &
మ12.21 – 1.12
అమృతకాలం:ఉ6.11 – 7.51
రాహుకాలం:ఉ10.30 – 12.00
యమగండం/కేతుకాలం:మ3.00 – 4.30
సూర్యరాశి:మేషం
చంద్రరాశి: కుంభం
సూర్యోదయం:5.36
సూర్యాస్తమయం:6.16
సర్వ ఏకాదశి

check other posts

Leave a Reply

%d bloggers like this: