Home Poetry Subhashitam –  సుభాషితమ్

Subhashitam –  సుభాషితమ్

0
Subhashitam –  సుభాషితమ్
Subhashitam - సుభాషితమ్ 

Subhashitam –  సుభాషితమ్

శ్లో|| వనేఽపి దోషాః ప్రభవన్తి రాగిణాం
గృహేఽపి పఞ్చేన్ద్రియనిగ్రహస్తపః।
అకుత్సితే కర్మణి యః ప్రవర్తతే
నివృత్తరాగస్య గృహం తపోవనమ్॥

హితోపదేశః

తా|| “విషయవాసనలు కలవారికి అడవికి వెళ్లినా కామక్రోధాదిదోషాలు సంభవిస్తాయి. పంచేంద్రియాలను నిగ్రహించినవారు ఇంటిలో ఉన్నా తపస్సు చేయగలరు. అనగా వారు తాపసులే. శాస్త్రముచే నిందింపబడని (శాస్త్రసమ్మతములైన) కర్మలు ఆచరిస్తూ విషయవాంఛలు వదిలి చరించేవాడికి ఇల్లే తపోవనమ్.”

Subhashitam
Subhashitam

శ్లో|| ఆత్మానమేవ ప్రథమం వినయైరుపపాదయేత్
అనుభృత్యాన్ ప్రజాః పశ్చాత్ ఇత్యేష వినయక్రమః||

తా|| “రాజు ముందుగా తనను తాను వినయశీలునిగా రూపొందించుకోవాలి. తర్వాత సేవకులను ఆ తర్వాత ప్రజలను వినయశీలురుగా చేయాలి”.

Leave a Reply

%d bloggers like this: