Daily horoscope-4/05/2021

0
Daily horoscope-4/05/2021

Daily horoscope-4/05/2021

ఓం శ్రీ గురుభ్యోనమః 
శుభమస్తు 

04, మే , 2021
స్వస్తి శ్రీ చాన్ద్రమాన ప్లవ నామ సంవత్సరమ్
చైత్రమాసము
వసంత ఋతువు
ఉత్తరాయణము భౌమ వాసరే
( మంగళ వారం )

శ్రీ ప్లవ సంవత్సర దేవతా ధ్యానమ్
అగ్నిం నమామి సతతం జ్వాలామాలం తమోపహమ్ ౹
అజారూఢం చతుర్హస్తం ద్విశీర్షం ప్లవసంజ్ఞికమ్ ౹౹

 

రాశి ఫలాలు

మేషం

ఒక వ్యవహారంలో డబ్బు చేతికి అందుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాది రంగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. గతంలో పరిష్కారం కాని ఒక సమస్య ఇప్పుడు చక్కబడుతుంది. దుర్గా అష్టోత్తర శతనామావళి పారాయణ చేయాలి.

వృషభం

వృత్తి, ఉద్యోగ, వ్యాపారాది రంగాలలో మిశ్రమ వాతావరణం ఉంటుంది. కుటుంబ సభ్యుల మాట ప్రకారం పనిచేయండి. మంచి జరుగుతుంది. చేసే పనిలో తొందరపాటు నిర్ణయాలు వద్దు. అనవసర ఖర్చులు పెరుగుతాయి. అన్నదానం చేస్తే మంచిది

మిధునం

దైవబలంతో పనులను పూర్తి చేస్తారు. కీలక నిర్ణయాలు ఫలిస్తాయి. ముఖ్య వ్యవహారాల్లో శాంతంగా వ్యవహరించి అభివృద్ధి సాధిస్తారు. దుర్గాస్తుతి పఠించాలి.

కర్కాటకం

ఒక శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. చేపట్టిన పనులను ప్రణాళికాబద్ధంగా పూర్తి చేయగలుగుతారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాది రంగాలలో మీకు ప్రోత్సాహకరమైన వాతావరణం ఉంటుంది. నూతన వస్తువులను కొంటారు. దుర్గాస్తుతి పఠించడం మంచిది.

సింహం

వృత్తి, ఉద్యోగ, వ్యాపారాది రంగాలలో మీకు అనుకూలమైన వాతావరణం ఉంటుంది. కీలక వ్యవహారాలలో మీకు అనుకూలమైన నిర్ణయాలు వస్తాయి. చేపట్టిన పనులను ప్రణాళికాబద్ధంగా పూర్తి చేస్తారు. సుబ్రహ్మణ్య అష్టోత్తరం చదవాలి.

కన్య

అనుకున్న పనులను అనుకున్నట్టు పూర్తి చేయగలుగుతారు. ప్రయత్నాలు ఫలిస్తాయి. బంధుప్రీతి ఉంది. శుభకార్యక్రమాల్లో పాల్గొంటారు. భోజనసౌఖ్యం కలదు. బిల్వాష్టకం చదివితే బాగుంటుంది.

తుల

మీ మీ రంగాల్లో జాగ్రత్తగా పనిచేయాలి. ఆత్మవిశ్వాసం సడలకుండా జాగ్రత్త పడాలి. చేపట్టిన పనులలో కొన్ని ఆటంకాలు ఎదురవుతాయి. అనవసర ఖర్చులు వస్తాయి. నిర్ణయాలలో స్థిరత్వం ఉండదు. కలహాలకు దూరంగా ఉండాలి. శని శ్లోకం చదివితే శుభఫలితాలు కలుగుతాయి.

వృశ్చికం

మీ నిజాయతీ మిమ్మల్ని కాపాడుతుంది. కుటుంబ సహకారం లభిస్తుంది. ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది. మొహమాటాన్ని దరిచేరనీయకండి. ప్రయాణాలు ఫలిస్తాయి. శ్రీరామనామాన్ని జపిస్తే మేలు జరుగుతుంది.

ధనుస్సు

శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. కుటుంబ సభ్యుల నుంచి ఒక ముఖ్య వ్యవహారంలో సంపూర్ణ సహకారం లభిస్తుంది. అవసరానికి తగిన సహకారం లభిస్తుంది. ఒక శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. సూర్యాష్టకం చదివితే బాగుంటుంది.

మకరం

ఒక శుభవార్త మీ ఇంట్లో సంతోషాన్ని నింపుతుంది. ప్రయత్నకార్యసిద్ధి ఉంది. ఒక ముఖ్య వ్యవహారంలో ఆర్థిక సాయం అందుతుంది. అనుకున్న పనులను అనుకున్నట్టు చేయగలుగుతారు. కొన్ని వ్యవహారాలలో ధైర్యంగా వ్యవహరించి అందరి ప్రశంసలు అందుకుంటారు. ఇష్టదేవతా స్తోత్రం చదివితే బాగుంటుంది.

కుంభం

మనోల్లాసాన్ని కలిగించే ఘటనలు చోటుచేసుకుంటాయి. ఉత్సాహవంతంగా వాతావరణం ఉంటుంది. ఇష్టదైవ ప్రార్థన చేయడం ద్వారా మరింత శుభఫలితాలు పొందుతారు.

మీనం

మీ మీ రంగాల్లో విజయసిద్ధి ఉంది. ఒక విషయంలో మనః సంతోషాన్ని పొందుతారు. ఆర్ధిక పరంగా మేలు జరుగుతుంది. వేంకటేశ్వర స్వామి ఆరాధన శుభప్రదం.  Daily horoscope-4/05/2021

Panchangam-4/05/2021

Panchangam 4/05/2021
Panchangam 4/05/2021

శ్రీ గురుభ్యోనమః
మంగళవారం, మే 4, 2021
శ్రీ ప్లవ నామ సంవత్సరం
ఉత్తరాయణం వసంత ఋతువు
చైత్ర మాసం బహుళ పక్షం
తిధి:అష్టమి సా5.52 తదుపరి నవమి
వారం:మంగళవారం(భౌమ వాసరే)
నక్షత్రం:శ్రవణం మ1.05 తదుపరి ధనిష్ఠ
యోగం:శుక్లం రా12.34 తదుపరి బ్రహ్మం
కరణం:బాలువ ఉ6.24 తదుపరి కౌలువ సా5.52 ఆ తదుపరి తైతుల తె5.33
వర్జ్యం: సా5.03 – 6.39
దుర్ముహూర్తం:ఉ8.08 – 8.59 & రా10.48 – 11.33
అమృతకాలం:రా2.39 – 4.15
రాహుకాలం: మ3.00 – 4.30
యమగండం/కేతుకాలం:ఉ9.00 – 10.30
సూర్యరాశి:మేషం
చంద్రరాశి: మకరం
సూర్యోదయం: 5.37
సూర్యాస్తమయం: 6.16

check other posts

Leave a Reply

%d bloggers like this: