Daily horoscope 02/05/2021 – panchangam

0
Daily horoscope 02/05/2021 –  panchangam
Daily Horoscope 23/09/2022 

Daily horoscope 02/05/2021

ఓం శ్రీ గురుభ్యోనమః
శుభమస్తు

02, మే , 2021
స్వస్తి శ్రీ చాన్ద్రమాన ప్లవ నామ సంవత్సరమ్
చైత్రమాసము
వసంత ఋతువు
ఉత్తరాయణము భాను వాసరే
( ఆది వారం )

శ్రీ ప్లవ సంవత్సర దేవతా ధ్యానమ్
అగ్నిం నమామి సతతం జ్వాలామాలం తమోపహమ్ ౹
అజారూఢం చతుర్హస్తం ద్విశీర్షం ప్లవసంజ్ఞికమ్ ౹౹

Daily horoscope 02/05/2021
Daily horoscope 02/05/2021

రాశి ఫలాలు

మేషం

ముఖ్య విషయాల్లో అనుకూల ఫలితాలు వస్తాయి. అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించండి. అనవసరంగా భయాందోళనలకు గురవుతారు. అనవసర ఖర్చులను అదుపు చేయండి. లక్ష్మీధ్యానం శుభప్రదం.

వృషభం

ఉద్యోగంలో పై అధికారులతో జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ సభ్యులు మధ్య విభేదాలు రాకుండా జాగ్రత్త పడాలి. మీ నిజాయతీ మిమ్మల్ని కాపాడుతుంది. శివనామాన్ని జపించాలి.

మిధునం

ఆత్మీయుల సలహాలు మేలు చేస్తాయి. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. మీ ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. ఇష్టదేవతా స్తుతి మంచిది.

కర్కాటకం

కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది. ధర్మం మిమ్మల్ని కాపాడుతుంది. పొదుపు పాటించాలి. స్థానచలనం సూచితం. కీలక వ్యవహారాల్లో ఓర్పుగా వ్యవహరించండి. శివనామాన్ని జపించాలి.

సింహం

విజయావకాశాలు మెరుగవుతాయి. శత్రువులపై మీదే పైచేయి అవుతుంది. ఆర్థిక వ్యవహారాలలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఇష్ట దైవ నామస్మరణ మంచిది. Daily horoscope 02/05/2021

కన్య

శ్రమకు తగిన ఫలితాలు ఉంటాయి. మనశ్శాంతి తగ్గకుండా చూసుకోవాలి. బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు. ముఖ్య పనులను త్వరగా పూర్తయ్యేలా ప్రణాళికను సిద్ధం చేయండి. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. ఆదిత్య హృదయం పఠించడం మంచిది

తుల

శారీరక శ్రమ పెరుగుతుంది. చేయని పొరపాటుకు నిందపడాల్సి వస్తుంది. మనోధైర్యాన్ని కోల్పోకండి. బంధువులతో వాదనలకు దిగడం వల్ల మనశ్శాంతి నశిస్తుంది. నవగ్రహ స్తోత్ర పారాయణ చేస్తే మంచిది.

వృశ్చికం

ప్రణాళికలను అమలు చేసే దిశగా ముందుకు సాగండి. బలమైన ఆహారాన్ని తీసుకోవాలి. శత్రువుల జోలికి పోరాదు. వృథా ప్రయాణాల వల్ల నిరుత్సాహం కలుగుతుంది. దుర్గారాధన వల్ల మేలు జరుగుతుంది.

ధనుస్సు

ప్రారంభించిన పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. ఒక శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. కీర్తిప్రతిష్టలు పెరుగుతాయి. ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఎట్టిపరిస్థితుల్లోనూ దైవారాధన మానవద్దు

మకరం

శుభ కాలం. కొన్ని వ్యవహారాలలో స్థిరమైన బుద్ధితో వ్యవహరించి మంచి ఫలితాలను అందుకుంటారు. వ్యాపారంలో లాభదాయకమైన ఫలితాలు ఉంటాయి. సకాలంలో సహాయం చేసేవారు ఉన్నారు. శివారాధన మంచిది.

కుంభం

కీలక వ్యవహారాలలో అధికారుల ప్రశంసలు లభిస్తాయి. మీ కీర్తిప్రతిష్టలు పెరుగుతాయి. బంధుమిత్రుల వల్ల మేలు జరుగుతుంది. సుబ్రహ్మణ్య అష్టోత్తర శతనామావళి చదివితే బాగుంటుంది.

మీనం

ఒక ముఖ్యమైన సమస్య పరిష్కారం అవుతుంది.ఇష్టమైన వారితో కాలాన్ని గడుపుతారు. వ్యాపారంలో అనుకూల ఫలితాలు ఉన్నాయి. చిత్తసౌఖ్యం ఉంది. ఇష్టదైవ స్తుతి శుభప్రదం. Daily horoscope 02/05/2021

శ్రీ గురుభ్యోనమః
ఆదివారం, మే 2, 2021
శ్రీ ప్లవ నామ సంవత్సరం
ఉత్తరాయణం వసంత ఋతువు
చైత్ర మాసం బహుళ పక్షం
తిధి:షష్ఠి రా8.27 తదుపరి సప్తమి
వారం:ఆదివారం (భానువాసరే)
నక్షత్రం:పూర్వాషాఢ మ2.22 తదుపరి ఉత్తరాషాఢ
యోగం:సిద్ధం ఉ6.56 తదుపరి సాధ్యం తె4.32
కరణం:గరజి ఉ9.2)1 తదుపరి వణిజ రా8.27 ఆ తదుపరి భద్ర/విష్ఠి
వర్జ్యం :రా10.05 – 11.38
దుర్ముహూర్తం :సా4.34 – 5.24
అమృతకాలం:ఉ9.47 – 11.19
రాహుకాలం :సా4.30 – 6.00
యమగండం/కేతుకాలం:మ12.00 – 1.30
సూర్యరాశి:మేషం
చంద్రరాశి: ధనుస్సు
సూర్యోదయం: 5.39
సూర్యాస్తమయం:6.15
సర్వేజనా సుఖినోభవంతు
శుభమస్తు
గోమాతను పూజించండి
గోమాతను సంరక్షించండి Daily horoscope 02/05/2021

CHECK OTHER POSTS

Leave a Reply

%d bloggers like this: