Kumara Shatakam
వగవకు గడిచిన దానికి
బొగడకు దుర్మాతులనెపుడు పొసగని పనికై
యెగి దీనత నొందకుమీ
తగ దైవగతిం బొసంగు ధరను కుమారా!

తాత్పర్యం: ఓ కుమార! అయిపోయిన పనిని గురించి చింతించవద్దు. దుష్టులను మెచ్చుకొనవద్దు. నీకు సాధ్యము కాని దానిని పొందలేకపోతినని చింతించుట పనికిరాదు. భగవంతుడు ఇచ్చిన దానితో తృప్తి చెందుము.