Daily Horoscope 30/04/21 – panchangam

0

Daily Horoscope 30/04/21

ఓం శ్రీ గురుభ్యోనమః
శుభమస్తు

Daily Horoscope
Daily Horoscope 30/04/21

30, ఏప్రియల్ , 2021
స్వస్తి శ్రీ చాన్ద్రమాన ప్లవ నామ సంవత్సరమ్
చైత్రమాసము
వసంత ఋతువు
ఉత్తరాయణము భృగు వాసరే
( శుక్ర వారం )

శ్రీ ప్లవ సంవత్సర దేవతా ధ్యానమ్
అగ్నిం నమామి సతతం జ్వాలామాలం తమోపహమ్ ౹
అజారూఢం చతుర్హస్తం ద్విశీర్షం ప్లవసంజ్ఞికమ్ ౹౹ Daily Horoscope 30/04/21

రాశి ఫలాలు

మేషం

చేపట్టిన పనులలో ఆటంకాలు ఎదుర్కోకుండా చూసుకోవాలి. ఒక వార్త మీ ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది. బంధుమిత్రులతో కలిసి శుభకార్యక్రమంలో పాల్గొంటారు. ఒక వార్త మిమ్మల్ని ఉత్సాహపరుస్తుంది. అష్టమంలో చంద్రబలం అనుకూలంగా లేదు. చంద్ర ధ్యానం శుభప్రదం.

వృషభం

శ్రమ పెరుగుతుంది. ఉద్యోగం విషయంలో అశ్రద్ధ రానీయకండి. తోటివారి మధ్య భేదాభిప్రాయం రానీయకండి. అనవసర ఖర్చులు జరిగే సూచనలు ఉన్నాయి. మనోధైర్యంతో ముందుకు సాగండి. ఇబ్బందులు తొలుగుతాయి. నవగ్రహ ఆరాధన శుభప్రదం.

మిధునం

శుభకాలం. ప్రారంభించిన పనులను దిగ్విజయంగా పూర్తి చేస్తారు. శ్రమ పెరుగుతుంది. బంధు మిత్రుల సహకారం ఉంటుంది. ఒక వార్త ఉత్సాహాన్ని ఇస్తుంది. ప్రయాణాలు ఫలిస్తాయి. శివ సందర్శనం మంచి ఫలితాన్ని ఇస్తుంది.

కర్కాటకం

ప్రారంభించిన పనులను ప్రణాళికాబద్ధంగా పూర్తి చేయగలుగుతారు. కాలానుగుణంగా ముందుకు సాగండి. ఒక శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. చంద్రశేఖరాష్టకం పఠించాలి.

సింహం

ప్రారంభించిన పనులను కుటుంబసభ్యుల సహకారంతో పూర్తి చేస్తారు. కుటుంబ సౌఖ్యం ఉంది. మీ ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. కొన్ని సంఘటనలు మీ మనోధైర్యాన్ని పెంచుతాయి. ఈశ్వర ధ్యాన శ్లోకం చదువుకోవాలి.

కన్య

మిశ్రమకాలం. ధనవ్యయం జరిగే సూచనలు ఉన్నాయి. కొన్ని పరిస్థితులు బాధ కలిగిస్తాయి. కొందరిని అతిగా నమ్మడం మంచిది కాదు. _సూర్య నమస్కారం ఆత్మశక్తిని పెంచుతుంది. _ Daily Horoscope 30/04/21

తుల

ఉద్యోగంలో జాగ్రత్తగా పనిచేయాలి. ముఖ్య విషయాల్లో కుటుంబ సహకారం ఉంటుంది. దైవబలం సదా రక్షిస్తుంది. ప్రయాణాలు ఫలిస్తాయి. ఇష్టదైవ ప్రార్థన మేలు చేస్తుంది.

వృశ్చికం

మనస్సౌఖ్యం కలదు. మీ స్వధర్మం మిమ్మల్ని రక్షిస్తుంది. కీలక సమస్యను పరిష్కరించి శత్రువులపై విజయం సాధించగలుగుతారు. కుటుంబ సభ్యుల వల్ల మేలు జరుగుతుంది. అపరిచితులను అతిగా నమ్మకండి. గురువుల సందర్శనం ఉత్తమ ఫలితాన్ని ఇస్తుంది.

ధనుస్సు

మధ్యమ ఫలితాలు ఉన్నాయి. చేపట్టే పనుల్లో ఎన్ని ఆటంకాలు ఎదురైనా మనోధైర్యంతో ఎదుర్కొంటారు. ఆర్థికంగా పొదుపు సూత్రం పాటించాలి. శారీరక శ్రమ పెరుగుతుంది. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయరాదు. దైవారాధన మానవద్దు.

 మకరం

శుభకాలం. చేపట్టే పనులు సకాలంలో పూర్తవుతాయి. మీ మీ రంగాల్లో శుభఫలితాలు అందుకుంటారు. పట్టుదలతో పనులను పూర్తి చేస్తారు. మానసిక ప్రశాంతత ఉంటుంది. రామనామ జపం శుభాన్ని ఇస్తుంది.

 కుంభం

దృఢ సంకల్పంతో చేపట్టే పనుల్లో విజయం సాధిస్తారు. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. మానసిక ప్రశాంతతతో ముందుకు సాగితే సమస్యలు పరిష్కారం అవుతాయి. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయరాదు. ఇష్ట దైవ నామస్మరణ శ్రేయోదాయకం.

మీనం

అభివృద్ధి వైపు అడుగులు వేస్తారు. సమాజంలో కీర్తి,యశస్సు పెరుగుతాయి. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. దుర్గారాధన శుభప్రదం. Daily Horoscope 30/04/21

 

శ్రీ గురుభ్యోనమ
శుక్రవారం, ఏప్రిల్ 30, 2021
శ్రీ ప్లవ నామ సంవత్సరం
ఉత్తరాయణం వసంత ఋతువు
చైత్ర మాసం బహుళ పక్షం
తిధి:చవితి రా12.20 తదుపరి పంచమి
వారం :శుక్రవారం(భృగువాసరే)
నక్షత్రం: జ్యేష్ఠ సా4.55 తదుపరి మూల
యోగం:పరిఘము మ12.33 తదుపరి శివం
కరణం :బవ మ1.27 తదుపరి బాలువ రా12.20ఆ తదుపరి కౌలువ
వర్జ్యం :రా12.26 – 1.57
దుర్ముహూర్తం:ఉ8.10 – 9.00 & మ12.21 – 1.12
అమృతకాలం:ఉ8.39 – 10.09
రాహుకాలం :ఉ10.30 – 12.00
యమగండం/కేతుకాలం:మ3.00 – 4.30
సూర్యరాశి:మేషం
చంద్రరాశి: వృశ్చికం
సూర్యోదయం: 5.39
సూర్యాస్తమయం:6.14
సంకష్టహర చతుర్థీ వ్రతము
శుక్ర మౌఢ్యమి త్యాగము ఉ11.03 Daily Horoscope 30/04/21

check other posts

Leave a Reply

%d bloggers like this: