Daily horoscope 29/04/2021

0
Daily horoscope 29/04/2021

Daily horoscope 29/04/2021

Today Horoscope - panchangam 29/4/2021
Today Horoscope – panchangam 29/4/2021

Daily horoscope 29/04/2021

ఓం శ్రీ గురుభ్యోనమః 
శుభమస్తు 

29, ఏప్రియల్ , 2021
స్వస్తి శ్రీ చాన్ద్రమాన ప్లవ నామ సంవత్సరమ్
చైత్రమాసము
వసంత ఋతువు
ఉత్తరాయణము బృహస్పతి వాసరే
( గురు వారం )

శ్రీ ప్లవ సంవత్సర దేవతా ధ్యానమ్
అగ్నిం నమామి సతతం జ్వాలామాలం తమోపహమ్ ౹
అజారూఢం చతుర్హస్తం ద్విశీర్షం ప్లవసంజ్ఞికమ్ ౹౹

రాశి ఫలాలు

మేషం

చేపట్టిన పనులలో అనుకున్నది సాధిస్తారు. ఒక వార్త మీ ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది. బంధుమిత్రులతో కలిసి శుభకార్యక్రమాలలో పాల్గొంటారు. ఒక వార్త మిమ్మల్ని ఉత్సాహపరుస్తుంది. దుర్గాధ్యానం శుభప్రదం.

వృషభం

శ్రమ పెరుగుతుంది. ఉద్యోగం విషయంలో అశ్రద్ధ రానీయకండి. తోటివారి మధ్య భేదాభిప్రాయం రానీయకండి. అనవసర ఖర్చులు జరిగే సూచనలు ఉన్నాయి. మనోధైర్యంతో ముందుకు సాగండి, ఇబ్బందులు తొలుగుతాయి.
శివారాధన శుభప్రదం.

మిధునం

శుభకాలం. ప్రారంభించిన పనులను దిగ్విజయంగా పూర్తి చేస్తారు. శ్రమ పెరుగుతుంది. బంధు,మిత్రుల సహకారం ఉంటుంది . ఒక వార్త ఉత్సాహాన్నిఇస్తుంది. ప్రయాణాలు ఫలిస్తాయి. శివ సందర్శనం మంచి ఫలితాన్ని ఇస్తుంది.

కర్కాటకం

ప్రారంభించిన పనులను ప్రణాళికాబద్దంగా పూర్తి చేయగలుగుతారు. కాలానుగుణంగా ముందుకు సాగండి. ఒక శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. చంద్రశేఖరాష్టకం పఠించాలి.

సింహం

ప్రారంభించిన పనులను కుటుంబసభ్యుల సహకారంతో పూర్తి చేస్తారు. కుటుంబ సౌఖ్యం ఉంది. మీ ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. ఒక సంఘటన మీ మనోధైర్యాన్ని పెంచుతుంది.
ఈశ్వర ధ్యాన శ్లోకం చదువుకోవాలి.

కన్య

ఉద్యోగంలో జాగ్రత్తగా పనిచేయాలి. ముఖ్య విషయాల్లో కుటుంబ సహకారం ఉంటుంది. కలహ సూచన ఉంది. ప్రయాణాలు ఫలిస్తాయి.
ఇష్టదైవ ప్రార్థన మేలు చేస్తుంది.

తుల

సందర్భానుసారంగా ముందుకు సాగితే శుభ ఫలితాలు అందుకుంటారు. పట్టుదలతో పనులను పూర్తి చేస్తారు. మానసికంగా ప్రశాంతంగా ఉండాలి. మాట పట్టింపులకు పోరాదు.
రామనామ జపం శుభాన్ని ఇస్తుంది.

వృశ్చికం

మనస్సౌఖ్యం కలదు. మీ స్వధర్మం మిమ్మల్ని రక్షిస్తుంది. కీలక సమస్యను పరిష్కరించి శత్రువులపై విజయం సాధించగలుగుతారు. కుటుంబసభ్యుల వల్ల మేలు జరుగుతుంది. పరిచయం లేని వారిని అతిగా నమ్మకండి. గురువుల సందర్శనం ఉత్తమ ఫలితాన్ని ఇస్తుంది.

ధనుస్సు

చేపట్టే పనుల్లో ఎన్ని ఆటంకాలు ఎదురైనా మనోధైర్యంతో ఎదుర్కొంటారు. ఆర్థికంగా పొదుపు సూత్రం పాటించాలి. శారీరక శ్రమ పెరుగుతుంది. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయరాదు. దైవారాధన మానవద్దు.

మకరం

మీ మీ రంగాల్లో నిబద్దత చాలా అవసరం. ఉత్సాహంగా పనిచేయాలి. కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది. ఒక శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. ఇష్టదైవారాధన మంచిది.

కుంభం

చేపట్టే పనుల్లో ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగి విజయం సాధిస్తారు. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. మానసిక ప్రశాంతతతో ముందుకు సాగితే సమస్యలు పరిష్కారం అవుతాయి. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయరాదు.
ఇష్ట దైవ నామస్మరణ శ్రేయోదాయకం.

మీనం

శుభ కాలం. చేపట్టే పనులు సకాలంలో పూర్తవుతాయి. అభివృద్ధి వైపు అడుగులు వేస్తారు. సమాజంలో కీర్తి యశస్సు పెరుగుతాయి. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు.
దుర్గారాధన శుభప్రదం.

Panchangam 04/28/2021
Panchangam 04/29/2021

Panchangam – 29/04/2021

శ్రీ గురుభ్యోనమః
గురువారం, ఏప్రిల్ 29, 2021
శ్రీ ప్లవ నామ సంవత్సరం
ఉత్తరాయణం వసంత ఋతువు
చైత్ర మాసం బహుళ పక్షం
తిధి :తదియ రా2 36 తదుపరి చవితి
వారం:గురువారం(బృహస్పతివాసరే)
నక్షత్రం:అనూరాధ సా6.26తదుపరి జ్యేష్ఠ
యోగం:వరీయాన్ మ3.32 తదుపరి పరిఘము
కరణం:వణిజ మ3.47 తదుపరి భద్ర/విష్ఠి రా2.36 ఆ తదుపరి బవ
వర్జ్యం :రా11.41 – 1.11
దుర్ముహూర్తం:ఉ9.51 – 10.51 &
మ2.52 – 3.43
అమృతకాలం:ఉ8.45 – 10.15
రాహుకాలం :మ1.30 – 3.00
యమగండం/కేతుకాలం: ఉ6.00 – 7.30
సూర్యరాశి:మేషం
చంద్రరాశి: వృశ్చికం
సూర్యోదయం:5.40
సూర్యాస్తమయం: 6.14

check other posts

Leave a Reply

%d bloggers like this: