Panchangam and Daily horoscope 24/04/2021

శ్రీ గురుభ్యోనమః శనివారం, ఏప్రిల్ 24, 2021 శ్రీ ప్లవ నామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు చైత్ర మాసం శుక్ల పక్షం

0
155
Daily Horoscope 20/10/2021
Daily Horoscope 20/10/2021

Panchangam and Daily horoscope 24/04/2021

Panchangam 04/21/2021
Panchangam 04/21/2021

శ్రీ గురుభ్యోనమః  Panchangam and Daily horoscope 24/04/2021
శనివారం, ఏప్రిల్ 24, 2021
శ్రీ ప్లవ నామ సంవత్సరం
ఉత్తరాయణం వసంత ఋతువు
చైత్ర మాసం శుక్ల పక్షం
తిధి:ద్వాదశి సా4.01 తదుపరి త్రయోదశి
వారం :శనివారం (స్థిరవాసరే)
నక్షత్రం;ఉత్తర/ఉత్తర ఫల్గుణి రా1.58
తదుపరి హస్త
యోగం:ధృవం ఉ8.50 తదుపరి వ్యాఘాతం
కరణం:బాలువ సా4.01 తదుపరి కౌలువ తె3.07 ఆ తదుపరి తైతుల
వర్జ్యం:ఉ9.46 – 11.18
దుర్ముహూర్తం :ఉ5.42 – 7.22
అమృతకాలం:రా7.01 – 8.33
రాహుకాలం :ఉ9.00 – 10.30
యమగండం/కేతుకాలం:మ1.30 – 3.00
సూర్యరాశి: మేషం
చంద్రరాశి: సింహం
సూర్యోదయం: 5.42
సూర్యాస్తమయం:6.13

Today Horoscope - panchangam 23/4/2021
Today Horoscope – panchangam 23/4/2021

ఓం శ్రీ గురుభ్యోనమః
శుభమస్తు

24, ఏప్రియల్ , 2021
స్వస్తి శ్రీ చాన్ద్రమాన ప్లవ నామ సంవత్సరమ్
చైత్రమాసము
వసంత ఋతువు
ఉత్తరాయణము స్థిర వాసరే
( శని వారం )

శ్రీ ప్లవ సంవత్సర దేవతా ధ్యానమ్
అగ్నిం నమామి సతతం జ్వాలామాలం తమోపహమ్ ౹
అజారూఢం చతుర్హస్తం ద్విశీర్షం ప్లవసంజ్ఞికమ్ ౹౹

రాశి ఫలాలు      Panchangam and Daily horoscope 24/04/2021

మేషం

పట్టు వదలకుండా పనిచేసి అనుకున్నది సాధిస్తారు. అనవసరంగా కష్టాలను కొని తెచ్చుకుంటారు. కొన్ని పరిస్థితులు మనోవిచారాన్ని కలిగిస్తాయి. హనుమాన్ చాలీసా పఠించడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి

వృషభం

వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో కొన్ని నిర్ణయాలు మీకు అనుకూలంగా వస్తాయి. కొన్ని సంఘటనలు బాధ కలిగిస్తాయి. అధైర్యపడకుండా ముందుకు సాగితే మేలైన ఫలితాలు సొంతం అవుతాయి. దుర్గాస్తుతి పఠించడం మంచిది.

మిధునం

బంగారు భవిష్యత్తుకు అవసరమైన పునాదులు వేసే సమయమిది. తలచిన కార్యక్రమాలు పూర్తి అవుతాయి. అవరోధాలు తొలగుతాయి. గృహ వాహనాది యోగాలు అనుకూలిస్తాయి. వ్యాపారంలో జాగ్రత్తగా ఉండాలి. దేనికీ తొందరవద్దు. ఆర్థిక విషయాల్లో జాగ్రత్త అవసరం. ఇష్టదేవతాస్మరణ మంచిది. Panchangam and Daily horoscope 24/04/2021

కర్కాటకం

ప్రారంభించిన కార్యక్రమాల్లో విజయసిద్ధి ఉంది. ఒక శుభవార్త ఉత్సాహాన్ని ఇస్తుంది. విందు,వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. తోటివారి సహాయ సహకారాలు ఉన్నాయి. దైవబలం రక్షిస్తోంది. వేంకటేశ్వరస్వామి దర్శనం శుభప్రదం.

సింహం

కీలక వ్యవహారాలలో అధికారుల ప్రశంసలు లభిస్తాయి. మీ కీర్తిప్రతిష్టలు పెరుగుతాయి. బంధుమిత్రుల వలన మేలు జరుగుతుంది. సుబ్రహ్మణ్య అష్టోత్తర శతనామావళి చదివితే బాగుంటుంది Panchangam and Daily horoscope 24/04/2021

కన్య

ప్రారంభించే పనులలో ఆటంకాలు ఎదురైనా అధిగమించే ప్రయత్నం చేస్తారు. శ్రమ ఫలిస్తుంది. మానసికంగా దృఢంగా ఉంటారు. సంకటహర గణపతి స్తోత్రం చదవడం మంచిది.

తుల

మీ స్వధర్మం మిమ్మల్ని కాపాడుతుంది. ఒక సమస్య మానసిక ప్రశాంతతను తగ్గిస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ప్రయాణాలలో జాగ్రత్తగా ఉండాలి. ఒక వార్త బాధ కలిగిస్తుంది. సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం చదవడం మంచిది

వృశ్చికం

చేపట్టిన పనులలో కొన్ని ఆటంకాలు ఎదురైనా అధిగమించే ప్రయత్నం చేస్తారు. ఆశించిన ఫలితాలు రావడానికి కాస్త ఎక్కువ శ్రమించాల్సి వస్తుంది. కీలక నిర్ణయాలు తీసుకోవడంలో తడబడతారు. అనవసరమైన ఖర్చులు చేయాల్సిన పరిస్థితులు వస్తాయి. గణపతి స్తోత్రం చదవండి. మంచి జరుగుతుంది.

ధనుస్సు 

మిశ్రమకాలం. లక్ష్యాలకు కట్టుబడి పనిచేయాలి. ధర్మ సందేహాలతో కాలాన్ని వృథా చేయకండి. కుటుంబ సభ్యులతో ఆచితూచి వ్యవహరించాలి. మనోవిచారం కలుగకుండా చూసుకోవాలి. ప్రయాణంలో ఆటంకాలు కలుగుతాయి. శివారాధన శుభప్రదం.

మకరం 

చేపట్టిన పనులలో పురోగతి ఉంటుంది. మానసికంగా దృఢంగా ఉంటారు. సౌభాగ్య సిద్ధి ఉంది. ఇష్టదేవత స్తోత్రం చదవడం మంచిది. ఉద్యోగ, వ్యాపారాల్లో తిరుగులేని విజయాలు ఉన్నాయి. ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు మంచి భవిష్యత్తును ప్రసాదిస్తాయి. విష్ణుమూర్తి ఆరాధన శ్రేయస్సునిస్తుంది

కుంభం 

ముఖ్య విషయాల్లో అనుకూల ఫలితం ఉంటుంది. కుటుంబ సభ్యుల సహకారంతో ఒక ముఖ్యమైన పనిని పూర్తి చేయగలుగుతారు. తప్పుదారి పట్టించే వారున్నారు జాగ్రత్త. సాయి నామాన్ని జపించాలి.

మీనం

శ్రమకు తగిన ఫలితాలు ఉంటాయి. బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు. చేపట్టే పనులు త్వరగా పూర్తయ్యే విధంగా ప్రణాళికను సిద్ధం చేయండి. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. ఆదిత్య హృదయం పఠించడం మంచిది. Panchangam and Daily horoscope 24/04/2021

check other posts

Leave a Reply