Intriguing verses – చమత్కార శ్లోకాలు

0
683
Intriguing verses
Intriguing verses

చమత్కార శ్లోకాలు

Intriguing verses

సంపత్,సరస్వతీ, సత్యం, సంతానం,సదనుగ్రహః
సత్తా,సుకృతి సంభారః సకారాస్సప్త దుర్లభాః

తా:–లోకములో ఎన్నో వుండవచ్చును గానీ ఈ ఏడు ‘స’ కారాలు మాత్రం ఒకచోట వుండవు అంటున్నారు కవి.అవి ఏమిటంటే 1.సంపద–కొందరివద్దనే వుంటుంది.
2.సరస్వతీ,=విద్య అందరికీ అబ్బదు కదా!
3.సత్యమ్=సత్యసంధత యిది చాలామంది దగ్గర పూజ్యము (వుండదు)
4.సంతానానికి కొదవ లేదు గానీ సత్సంతానం వుండాలి కదా!
5.సదనుగ్రహః=సత్పురుషుల యొక్క అనుగ్రహం యిది అత్యంత దుర్లభ మైనది.
6.సత్తా=శక్తి యిదికూడా అందరికీ వుండదు.
7.సుకృతి సంభారః =పుణ్యఫల విశేషం యీ లభించటం కూడా దుర్లభమే
ఒకటి,రెండు మాత్రం ఒక చోట ఉండవచ్చునేమో గానీ ఈ ఏడు ఒకచోట వుండడం దుర్లభం.

Intriguing verses

జనకస్య సుతా సీతా రాఘవస్య విలాసినీ
జనకస్య సుతా సీతారాఘవస్య విలాసినీ

ఈ శ్లోకం లోని రెండు పాదాలూ ఒకే విధంగా వున్నాయి.అయితే మొదటి పాదాన్ని ప్రశ్న
గానూ,రెండవ పాదాన్ని సమాధానం గానూ చెప్పుకుంటే ఆనందంగా వుంటుంది.

జన =ఓ జనుడా! రాఘవస్య =రాముని యొక్క , విలాసినీ =భార్య యగు సీతాదేవి Intriguing verses
కస్య సుతా?ఎవరి కూతురు?ఓ జనుడా!రామునికి భార్యయగు సీతాదేవి ఎవరి కూతురు?అన్నది ప్రశ్న అయితే
రాముడి భార్య అయిన సీతాదేవి, జనకస్య సుతా=జనకుని కూతురు
శ్లోకం లోని రెండు పాదాలూ ఒకటిగా వుండడం ఒకటి ప్రశ్న మరొకటి సమాధానం అగుట యిందులో చమత్కారం.

check other posts

Leave a Reply