dina phalalu – దిన ఫలాలు ,15, ఏప్రియల్ , 2021

1
150
Daily Horoscope 27/11/2021
Daily Horoscope 27/11/2021
dina phalalu ఓం శ్రీ గురుభ్యోనమః
శుభమస్తు  15, ఏప్రియల్ , 2021
స్వస్తి శ్రీ చాన్ద్రమాన ప్లవ నామ సంవత్సరమ్
చైత్రమాసము
వసంత ఋతువు
ఉత్తరాణము               బృహస్పతి వాసరే
( గురువారం )
శ్రీ ప్లవ సంవత్సర దేవతా ధ్యానమ్
అగ్నిం నమామి సతతం జ్వాలామాలం తమోపహమ్ ౹
అజారూఢం చతుర్హస్తం ద్విశీర్షం ప్లవసంజ్ఞికమ్ ౹౹
రాశి ఫలాలు
 మేషం
ఈరోజు
స్వయంకృషితో విజయాన్ని సాధిస్తారు. సమాజంలో కీర్తి పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు.ఆందోళనలను దరిచేరనీయకండి. ఆంజనేయ ఆరాధన శ్రేయోదాయకం. dina phalalu
 వృషభం
ఈరోజు
ఉద్యోగంలో మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. అనవసర ప్రసంగాలు వద్దు. అకారణ కలహ సూచన. శారీరక శ్రమ పెరుగుతుంది. కొందరి ప్రవర్తన వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటారు. మనోవిచారం కలుగకుండా చూసుకోవాలి. విష్ణు ఆలయ సందర్శనం శుభప్రదం
dina phalalu
dina phalalu
 మిధునం
ఈరోజు
బుద్ధిబలంతో పనులను పూర్తి చేస్తారు. ఆత్మీయుల సహకారం లభిస్తుంది. కీలక నిర్ణయాలు తీసుకునే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించాలి. మాట పట్టింపులకు పోకూడదు. సుబ్రహ్మణ్య ఆరాధన మంచిది.
 కర్కాటకం
 ఈరోజు
చేపట్టే కార్యక్రమాలను విజయవంతంగా పూర్తిచేస్తారు. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. అనవసర కలహాలతో కాలం వృథా చేసుకోకండి. విష్ణు సహస్రనామ పారాయణతో శుభం కలుగుతుంది. dina phalalu
 సింహం
ఈరోజు
ఈరోజు
గ్రహబలం అనుకూలంగా ఉంది. పట్టువదలకుండా పనిచేసి అనుకున్నది సాధిస్తారు. మీ మీ రంగాల్లో పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. చేసే ప్రతిపని అనుకూలతను ఇస్తుంది. లక్ష్మీ ఆరాధన శుభప్రదం.
 కన్య
ఈరోజు
మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. కీలక విషయాల్లో తోటివారి సలహాలు తప్పనిసరి. కొందరి ప్రవర్తన మీకు ఇబ్బంది కలిగిస్తుంది. శత్రువులతో జాగ్రత్త. సమయం వృథా చేయకండి. నవగ్రహ ఆరాధన శుభప్రదం.
💃💃💃💃💃💃💃
⚖ తుల
ఈరోజు
మీ శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. ఒక తీపి వార్త వింటారు. వ్యాపారంలో ఆర్థికంగా ఎదుగుతారు. బంధుమిత్రుల నుంచి సానుకూల స్పందన ఉంటుంది. ఇష్టదైవ ప్రార్థనతో మరింత శుభ ఫలితాలు పొందుతారు
 వృశ్చికం
ఈరోజు
నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. తోటివారితో ఆనందంగా గడుపుతారు. బంధుమిత్రులతో సత్సంబంధాలు ఏర్పడతాయి. కీలకమైన చర్చలు ఫలిస్తాయి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దర్శనం శుభప్రదం dina phalalu
 ధనుస్సు
 ఈరోజు
ప్రారంభించిన పనిలో విజయం సాధిస్తారు. మానసికంగా దృఢంగా ఉండాలి. అపార్థాలకు తావివ్వకండి. అనవసర విషయాలతో సమయం వృథా చేయవద్దు. శివారాధన శుభప్రదం.
 మకరం
 ఈరోజు
మీరు చేసే పనిలో కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. శత్రువులపై విజయం సాధిస్తారు. అవసరానికి తగిన సహాయం అందుతుంది. అకారణ కలహసూచన ఉంది. వాదనలకు దూరంగా ఉండటమే మంచిది. దైవారాధన మానవద్దు.
 కుంభం
 ఈరోజు
మనోధైర్యంతో ముందుకు సాగి శుభ ఫలితాలను పొందుతారు. ఆత్మీయుల అండదండలు ఉంటాయి. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. అధికారులతో ఆచితూచి వ్యవహరించాలి. చెడు ఆలోచనలను దరిచేరనీయకండి. దత్తాత్రేయ స్వామిని దర్శించండి.
 మీనం
ఈరోజు
చేపట్టిన పనులు దైవబలంతో పూర్తి చేస్తారు. భవిష్యత్తు ప్రణాళికలు రచించడానికి ఇది సరైన సమయం. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. మనస్సును స్థిరంగా ఉంచుకోవాలి. మనోబలం పెరగడానికి శివారాధన చేయాలి. dina phalalu
check other posts

1 COMMENT

Leave a Reply