Thirumala ugadi asthanam తిరుమలలో ఉగాది ఆస్థానం..అంటే ఏమిటి ?

0
118
thirumala ugadi asthanam
thirumala ugadi asthanam

Thirumala ugadi asthanam ఏటా ఛైత్రశుద్ధ పాడ్యమిని తెలుగువారు ఉగాదిగా జరుపుకుంటారు. తెలుగువారి కొత్త ఏడాదిని పురస్కరించుకుని ఉగాది ఆస్థానం తిరుమల శ్రీవారి ఆలయంలో వైభవంగా నిర్వహిస్తారు.

ఉగాది పండుగను పురస్కరించుకుని తిరుమలలో ఉగాది ఆస్థానాన్ని టీటీడీ ఘనంగా నిర్వహించనున్నారు.

ఉగాది రోజు ఉదయం 3.00 గంటలకు సుప్రభాతసేవ అనంతరం శుద్థి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. అనంతరం తోమాలసేవ నిర్వహించి బంగారు వాకిలి చెంత పంచాంగ శ్రవణ కార్యక్రమం జరుగనుంది.

ఉదయం 6.00 గంటలకు శ్రీదేవి భూదేవి సమేత మలయప్పస్వామికి, విష్వక్సేనులకి విశేష సమర్పణను నిర్వహిస్తారు.

ఉదయం 7.00 నుంచి 9.00 గంటల మధ్య విమాన ప్రాకారం, ధ్వజస్థంభం చుట్టు ఊరేగింపుగా ఆలయంలోనికి ప్రవేశిస్తారు.

అనంతరం శ్రీవారి మూలవిరాట్టు, ఉత్సవ మూర్తులకు నూతన వస్త్రాలను ధరింపజేస్తారు. ఇది పూర్తియిన తర్వాత పంచాగ శ్రవణం నిర్వహించనున్నారు.

thirumala ugadi asthanam
thirumala ugadi asthanam

ఉగాది ఆస్థానాన్ని బంగారు వాకిలిలో ఆగమ పండితులు, అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు.
కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం అత్యంత వైభవంగా టిటిడి నిర్వహించనున్నట్టు అధికారులు వెల్లడించారు.Thirumala ugadi asthanam

సాధారణంగా ఏడాదికి నాలుగుసార్లు ఈ కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీ.

ఉగాది, ఆణివార ఆస్థానం, బ్రహ్మూత్సోవాలు, వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు మంగళవారం ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు.

ఉదయం 6.00 గంటలకు ప్రారంభమయ్యే తిరుమంజనం సుమారు 5 గంటలపాటు కొనసాగతుంది

. ఆనంద నిలయం మొదలుకొని బంగారు వాకిలి వరకు సుగంధ ద్రవ్యాలు కలిపిన పవిత్ర జలంతో శుద్ధి కార్యక్రమాన్ని ఆలయ సిబ్బంది ఒక మహాయజ్ఞంలా నిర్వహిస్తారు.

తిరుమంజనం అనంతరం స్వామివారి మూలవిరాట్టుకు అర్చకులు ఆగమోక్తంగా పూజాది కార్యక్రమాలు నిర్వహించి మధ్యాహ్నం 12.00 గంటల నుంచి భక్తులను దర్శనానికి అనుమతిస్తారు.

please check other posts in mana bhakti

Leave a Reply