పాలకూర సర్వరోగ నివారణి

0
55
పాలకూర
పాలకూర

సర్వరోగ నివారణి పాలకూర

పాలకూర : మనం నిత్యం తీసుకునే ఆహారంలో ఆకు కూరలను తప్పనిసరిగి తీసుకోవాలి. మిగిలిని కూరగాయలతో పోల్చితే ఆకుకూరల్లో అన్ని రకాల పోషక పదార్ధాలు ఉంటాయి.

పోషకాహారలో క్రమంగా తింటే వయసుతో పాటు వచ్చే మతిమరుపును రానవ్వకుండా తోడ్పడుతుంది.

ఇందులో లభించే విటమిన్ సీ, ఏ లు మెగ్నీషియం, పోలిక్ యాసిడ్లు క్యాన్సర్ ను నివారిచడంలో తోడ్పడుతాయి.

పాలకూర
పాలకూర

ముఖ్యంగా ఊపిరితిత్తులు, బ్రెడ్ క్యాన్సర్ ను అదుపు చేయడంలో ఇవి ప్రముఖ పాత్ర పోషిస్తాయి. గుండె జబ్బులు రాకుండా అడ్డుకుంటాయి.

ఆహారంలో ఎక్కువగా తీసుకునే వారికి ఒవేరియన్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు తక్కువ. శరీరానికి అవసరమైన ఇనుము పుష్కలంగా ఉండే రక్తహీనతను తగ్గిస్తుంది.

రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతుంది. జ్వరం, పిత్త, వాయు, శ్వాస సంబంధిత రోగాలను కూడా దూరం చేస్తుంది.

రక్తాన్ని శుద్దిచేసే తత్వం కూడా ఎక్కువగా ఉంటుంది. మహిళల సౌందర్యానికి కూడా ఎంతగానో తోడ్పడుతుంది.

పాలకూరను వెజ్ టెబుల్ సూప్ లోనూ, చపాతీలు చేసుకునే పిండీలోనూ, పకోడీల పిండోలోనూ, పన్నీర్ తో కలిపి వాడే కూరల్లోనూ అనేక రకాలుగా వాడుకోవచ్చు.

ఇతర ఆకుకూరల్లాగా వేపుడు చేసుకుని తినవచ్చు.

Check out my page : Telugu recipes

Leave a Reply