దోసకాయ పచ్చడి (ఎండు మిర్చితో)

0
152
దోసకాయ పచ్చడి
దోసకాయ పచ్చడి

కావలసిన పదార్హాలు:-

చేదు లేని దోసకాయ 1, ఎండు మిర్చి 15, పచ్చిశనగపప్పు 2 స్పూన్లు, ఇంగువ % స్పూను,
పసుపు % స్పూను, ఉప్పు తగినంత, నూనె తగినంత.

దోసకాయ పచ్చడి
దోసకాయ పచ్చడి

తయారు చేయు విధానము:-

సన్నగా తరిగిన దోసకాయ ముక్కలు పసుపు వేసి పక్కన పెట్టుకోవాలి. చింతపండు తడిపి
ఉంచుకోవాలి. బాణలిలో నూనె వేసి మిర్చి, పచ్చిశనగపప్పు, ఇంగువ వేసి వేయించి పక్కన
ఉంచుకోవాలి. చల్లారిన తరువాత మిర్చి మిశ్రమాన్ని మిక్సీలో వేసి నలిగాక చింతపండు, దోసకాయ
ముక్కలు వేసి 2 చుట్లు తిప్పి గిన్నెలోకి తీసుకోవాలి. 2, 3 రోజులు మాత్రమే నిల్వ ఉంటుంది.
గమనించగలరు.

దోసకాయ పచ్చడి (పచ్చి మిర్చితో)
కావలసిన పదార్షాలు:-
ముక్కలు చేసిన చేదు లేని దోసకాయ 1, పచ్చి మిర్చి 8, చింతపండు 6 రెబ్బలు, ఉప్పు తగినంత,
పసుపు 1 స్పూను.
తయారు చేయు విధానము:-
మిక్సీలో పచ్చి మిర్చి, ఉప్పు, చింతపండు తడిపి వేయాలి. నలిగాక దోసకాయ ముక్కలు, పసుపు

వేసి 2 చుట్లు తిప్పి గిన్నెలోకి తీసుకోవాలి. 2, ౩ రోజులు మాత్రమే నిల్వ ఉంటుంది. గమనించగలరు.

 

Leave a Reply