పచ్చి బొ ప్పాయి కూర

0
107

పచ్చి బొ ప్పాయి కూర


కావలసిన పదార్షాలు:-

పచ్చి బొ ప్పాయి కూర
పచ్చి బొ ప్పాయి కూర


లేత పచ్చి బొప్పాయికాయ మీడియం సైజు, పచ్చి కొబ్బరి చిప్ప 1, ఉప్పు, కారం తగినంత, నూనె 3
స్పూన్లు, ఆవాలు స్పూను, పసుపు స్పూను, ఎండుమిర్చి 1, కరివేపాకు 1 రెమ్మ


తయారు చేయు విధానము:-

బొప్పాయికాయ చెక్కు తిసి తురిమి పెట్టుకో వాలి. బాణలిలో నూనె వేసి కాగినాక ఆవాలు, ఎండు
మిర్చి, కరివేపాకు వేసి వేగాక తురిమిన బొప్పాయికాయ తురుము వేయాలి. సగం గ్లాసు (చిన్నది)
నీళ్లు చిలకరించాలి. సన్నని సెగ మీద 2 నిముషాలు ఉంచాలి. పచ్చి కొబ్బరి తురుము, పసుపు,
ఉప్పు, కారం వేసి మరో 2 నిముషాలు ఉంచి, దించేయాలి. బాగా కలిపి వేరే బౌల్‌ లోకి
మార్చుకోవాలి. ఈ కూర నలుగురికి సరిపోతుంది.

Leave a Reply