కరివేపాకు పచ్చడి

0
98
కరివేపాకు పచ్చడి
కరివేపాకు పచ్చడి

కరివేపాకు పచ్చడి. .

ఆరోగ్యానికి , నేత్ర సంబంధించిన సమస్యల నివారణకు ఎంతో మంచిది ఈ కరివేపాకు పచ్చడి .

కరివేపాకు పచ్చడి
కరివేపాకు పచ్చడి

కరివేపాకు పచ్చడి .

తయారీ విధానము .

స్టౌ మీద బాండి పెట్టి నాలుగు స్పూన్లు నూనె వేసి, నూనె బాగా కాగగానే 40 గ్రాముల పొట్టు మినపప్పు , పన్నెండు ఎండుమిరపకాయలు , అర స్పూను ఆవాలు మరియు కొద్దిగా ఇంగువను వేసి పోపు వేయించుకోవాలి .

తర్వాత అందులోనే మూడు కప్పుల కరివేపాకును వేసి బాగా వేయించుకోవాలి.

నిమ్మకాయంత చింతపండు వేడి నీళ్ళలో పావు గంట సేపు నాన బెట్టు కొని చిక్కగా రసం తీసుకోవాలి .

పోపు చల్లారగానే మిక్సీ లో ముందు వేగిన ఎండుమిరపకాయలు , తగినంత ఉప్పు వేసుకుని మెత్తగా మిక్సీ వేసుకోవాలి .

ఆ తర్వాత పొట్టు మినపప్పు కరివేపాకు మిశ్రమం , చింతపండు రసం , ఇష్టమైతే కొద్దిగా బెల్లం వేసుకుని కొంచెం నీరు పోసుకుని మరీ మెత్తగా కాకుండా మిక్సీ వేసుకుంటే కరివేపాకు పచ్చడి చాలా రుచిగా ఉంటుంది .

ఈ పచ్చడికి పొట్టు మినపప్పే వాడాలి. చాయమినపప్పు తో పచ్చడి అంత రుచిగా ఉండదు .

Leave a Reply