గోంగూర పచ్చడి

0
91
గోంగూర పచ్చిమిర్చి పచ్చడి

కావలసిన పదార్షాలు:-

ఒలిచి, కడిగి ఆరబెట్టిన గోంగూర 4 గుప్పెళ్ళు, పచ్చిమిర్చి 10, ఎండు మిర్చి 150 గ్రాములు,
మెంతిపిండి 1 స్పూన్లు, ఉప్పు తగినంత, నూనె , ఇంగువ స్పూను.

గోంగూర పచ్చడి

తయారు చేయు విధానము:-

బాణలిలో నూనె వేసి గోంగూర మగ్గనివ్వాలి. సగం మగ్గాక పచ్చిమిర్చి, మెంతిపొడి వేయాలి. వేగాక
పక్కన ఉంచుకోవాలి. బాణలిలో నూనె వేసి ఎండుమిర్చి, ఇంగువ వేసి వేయించాలి. చల్లారిన
తరువాత మిర్చి మిశ్రమం, ఉప్పు వేసి మిక్సీలో వేయాలి. నలిగిన తరువాత గోంగూర వేసి 2 చుట్లు
తిప్పి గిన్నెలోకి తీసుకోవాలి. 10 రోజులు నిల్వ ఉంటుంది.

Leave a Reply