సగ్గుబియ్యం ఒడియాలు (saggubiyyam vadiyalu)

0
150

సగ్గుబియ్యం ఒడియాలు (తేలిక పద్ధతి)


కావలసిన పదార్షాలు:


సగ్గుబియ్యం 1 గ్రాసు, నువ్వులు గుప్పెడు, పచ్చిమిర్చి లీ ఉప్పు తగినంత, నీళ్లు 7 గ్లాసులు.


తయారు చేయు విధానము:


ముందుగా సగ్గుబియ్యం 2 గ్లాసుల నీళ్లలో 2 గంటలు నానపెట్టాలి. రేపు ఒడియాలు
పెట్టుకోవాలంటే ఈరోజు నిద్ర పోయేటప్పుడు ఈ మిశ్రమాన్ని రెడీ చేయాలి. ఒక మందపాటి
గిన్నెలో 5 గ్లాసుల నీళ్లు తెరలనివ్వాలి. ఉప్పు, పచ్చిమిర్చి పేస్టు చేసుకొని వేసుకోవాలి.
నువ్వులు కూడా వేయాలి. స్టవ్‌ ఆపేసి నానపెట్టుకున్న సగ్గుబియ్యం కాగిన నీళ్లలో వేసి బాగా
కలిపి గట్టి మూత పెట్టాలి. తెల్లారేసరికి సగ్గుబియ్యం మగ్గిపోయి ఉంటాయి. మిక్సీలో 1 రౌండ్‌ తిప్పి
ఉప్పు సరిచూచుకుని ప్లాస్టిక్‌ పట్టా మీద నచ్చిన సైజులో ఒడియాలు పెట్టుకోవటమే. 2 రోజులు

ఎండాక డబ్బాలో పెట్టుకోవచ్చు. 1 సంవత్సరం ఉంటాయి.

Leave a Reply