ఊర మిరపకాయలు (చల్ల మిరపకాయలు)

0
164

ఊర మిరపకాయలు

కావలసిన పదార్షాలు:
వంకర లేని సన్న మిరపకాయలు 1 కిలో, పెరుగు 1 లీటర్‌, రాళ్ళ ఉప్పు % కిలో, వాము 50

గ్రాములు, పసుపు 2 స్పూన్లు.

‌తయారు చేయు విధానము:

పెరుగుని చిక్కని మజ్జిగలా తయారు చేసుకోవాలి. ప్లాస్టిక్‌ బకెట్‌ లో పెట్టుకొంటే మంచిది. ఆ
మజ్జిగలో ఉప్పు, పసుపు, వాము మిక్సీ వేసి వేయాలి. తరువాత మిర్చిని పిన్నీసుతో కానీ
సూదితో కానీ మధ్యలో గీయాలి. గీసిన మిర్చిని మజ్జిగ మిశ్రమంలో వేయాలి. ఒక వారం రోజులు
రోజూ కలుపుతూ ఉండాలి. ఉప్పు కరిగి మిర్చికి పట్టాలి. తరువాత మజ్జిగలో నుండి మిర్చి తిసి
ప్లాస్టిక్‌ పట్టా మీద ఉదయం ఆరబెట్టి సాయంత్రం మజ్జిగలో వేస్తుండాలి. ఇంచుమించు మజ్జిగ
అయిపోయే వరకు ఇలా చేయాలి. చివరలో గల గలలాడే వరకు ఆరబెట్టాలి. తరువాత డబ్బాలో
పెట్టుకొ ని కావలసినప్పుడల్లా ఎన్ని కావాలంటే అన్ని వేయించుకొంటూ ఉండొచ్చు. సంవత్సరం
నిల్వ ఉంటాయి. ఈ ఊర మిరపకాయల ప్రొసీజర్‌ 15 నుండి 20 రోజులు ఉంటుంది.

Leave a Reply