మన పురాణ ఇతిహాసాలలో పేర్కొన్న కొన్ని నగరాల పేర్లు మరియు అవి ప్రస్తుతం వున్న స్థలముల వివరాలు: Names of some of the cities mentioned in our mythology and details of their present location

0
132

మన పురాణ ఇతిహాసాలలో పేర్కొన్న కొన్ని నగరాల పేర్లు మరియు అవి ప్రస్తుతం వున్న స్థలముల వివరాలు:

కుశపురం (సీతారాముల పెద్ద కుమారుడు కుశుడు కట్టించిన నగరం) -కుశార్, పాకిస్తాన్


  • లవపురం (సీతారాముల చిన్న కుమారుడు లవుడు కట్టించిన నగరం) -లాహోర్, పాకిస్తాన్

  • తక్షశిల (శ్రీరాముని తమ్ముడైన భరతుని పెద్దకొడుకు తక్షకుడు నిర్మించిన నగరం) – తక్షశిల, పాకిస్తాన్

  • పుష్కలావతి / పురుషపురం (శ్రీరాముని తమ్ముడైన భరతుని రెండవ
    కొడుకు పుష్కరుడు నిర్మించిన నగరం) – పెషావర్, పాకిస్తాన్
    భాగవతం,మహాభారతం

  • మహావిష్ణువు గజేంద్రున్ని మొసలి బారి నుంచి
    రక్షించిన స్థలం – దేవ్ ధాం,నేపాల్

  • నృసింహస్వామి హిరణ్యకశిపుని వధించిన స్థలం – అహోబిలం, ఆంధ్రప్రదేశ్

  • జమదగ్ని మహర్షి ఆశ్రమం – జమానియా, ఉత్తర్ ప్రదేశ్

  • మహీష్మతి (కార్తవీర్యార్జునుని రాజధాని) -మహేశ్వర్,మధ్యప్రదేశ్

  • శమంతక పంచక (పరశురాముడు ఇరవైయొక్క మార్లు క్షత్రియులపై
    దండెత్తి వారి రక్తంతో 5 మడుగులు నెలకొల్పిన చోటు),కురుక్షేత్రం,

  • దుర్యోధనుని చంపిన చోటు-కురుక్షేత్ర, హర్యానా

  • పరశురామక్షేత్రం (పరశురాముడు తన గొడ్డలిని సముద్రంలోకి
    విసిరి,సముద్రజలాలను వెనక్కి పంపి
    తనకోసం నేలను సృష్టించుకొన్న ప్రాంతం) – కేరళ,కర్ణాటక,మహరాష్ట్ర
    సముద్రతీర ప్రాంతం

  • మహేంద్ర పర్వతం (పరశురాముడు తపస్సు చేసిన స్థలం) – పశ్చిమ ఒరిస్సా

  • నిషాద రాజ్యం (నల మహారాజు రాజ్యం) – గ్వాలియర్
    జిల్లా,మధ్యప్రదేశ్

  • వ్యాస మహర్షి పుట్టిన స్థలం- ధమౌలి, నేపాల్

  • నైమిశారణ్యం (వ్యాస మహర్షి తన శిష్యులకు వేదాలు,పురాణాలు
    బోధించిన ప్రాంతం) – సీతాపూర్ జిల్లా, ఉత్తర్ ప్రదేశ్

  • వ్యాస మహర్షి చెబుతుండగా, విఘ్నేశ్వరుడు మహాభారతం వ్రాసిన చోటు- మన గ్రామం, ఉత్తరాంచల్

  • రతిష్టానపురం (పురూరవుని రాజధాని) -ఝున్సి,అలహాబాద్

  • సాళ్వ రాజ్యం(సావిత్రీ,సత్యవంతుల కథలో సత్యవంతుని రాజ్యం)- కురుక్షేత్ర దగ్గర

  • హస్తినాపురం (కౌరవుల రాజధాని) – హస్తినాపూర్, ఉత్తర్ ప్రదేశ్

  • మధుపురం / మధువనం (కంసుని రాజధాని) -మధుర, ఉత్తర్ ప్రదేశ్

  • వ్రేపల్లె / గోకులం – గోకుల్, మధుర దగ్గర

  • కుంతిపురి (పాండురాజు మొదటి భార్య కుంతిదేవి పుట్టినిల్లు) – గ్వాలియర్

  • మద్ర దేశం (పాండురాజు రెండో భార్య మాద్రి పుట్టినిల్లు) – పంజాబ్ ప్రావిన్స్, పాకిస్తాన్

  • ద్రోణనగరి (ద్రోణుడు నివసించిన ప్రాంతం)-డెహ్రాడూన్

  • గురుగ్రామం (కురుపాండవులు విద్యాభ్యాసం చేసిన చోటు) – గురుగావ్, హర్యానా

  • కర్ణుడు పరిపాలించిన అంగ రాజ్యం – కాబుల్ (ఆఫ్ఘనిస్తాన్)

  • పాండవుల లక్కగృహ దహనం- వర్నాల్, హస్తినాపూర్

  • కాలయవనుడు ముచికుందుని కోపాగ్ని జ్వాలలకు భస్మమైన స్థలం – గిర్నార్,గుజరాత్

  • శ్రీకృష్ణ,బలరాముల ద్వారకా నగరం – ద్వారక,గుజరాత్

  • హిడింబవనం (హిడింబాసురుడిని భీముడు చంపిన చోటు) -జలాన్ జిల్లా, ఉత్తర్ ప్రదేశ్

  • విదర్భ (దమయంతి, రుక్మిణిదేవి తండ్రులు యేలిన రాజ్యం) – విదర్భ, మహరాష్ట్ర

  • కుండినపుర (రుక్మిణిదేవి జన్మస్థలం) – కుండినపుర, మహరాష్ట్ర

  • చేది రాజ్యం (శిశుపాలుడు ఏలిన రాజ్యం) – బుందేల్ ఖండ్, మధ్యప్రదేశ్

  • కారుష రాజ్యం (దంతవక్రుడు ఏలిన రాజ్యం) – దాతియ జిల్లా, మధ్యప్రదేశ్

  • ఖాండవప్రస్థం / ఇంద్రప్రస్థం (పాండవుల రాజధాని) – ఇంద్రప్రస్థ, ఢిల్లీ దగ్గర

  • కుచేలుడు నివసించిన చోటు – పోర్ బందర్, గుజరాత్

  • పాంచాల దేశం (ద్రుపద మహారాజు రాజ్యం) – ఎటాహ్,సహజహంపూర్
    ,ఫారుఖాబాద్ ప్రాంతాలు, ఉత్తర్ ప్రదేశ్

  • కంప్లి (ద్రౌపది పుట్టినిల్లు,మత్స్యయంత్ర బేధన స్థలం) –
    కంపిల్, ఉత్తర్

  • జరాసంధుని భీముడు చంపిన చోటు – జరాసంధ్ కీ ఆఖరా / రణ్ భూమి,
    బీహార్

  • కామ్యక వనం,దైత్య వనం (పాండవులు అరణ్య వాసం చేసిన
    ప్రాంతాలు) – పశ్చిమ హర్యానా

  • మత్స్య దేశం (విరాట మహారాజు రాజ్యం) -ఆల్వార్,గురుగావ్ నుంచి జైపూర్ వరకు వున్న ప్రాంతం,రాజస్థాన్

  • విరాటనగరం (పాండవులు అజ్ఞాత వాసం చేసిన స్థలం) – విరాట్ నగర్,రాజస్థాన్

  • శోణపురం (బాణాసురుడి రాజధాని) – సోనిత్ పూర్, అస్సాం

  • ప్రాగ్జ్యోతిష్యం (నరకాసురుని రాజధాని) – తేజ్ పూర్, అస్సాం

  • నిర్యాణానికి ముందు శ్రీకృష్ణుడు బోయవాని వేటుకి గురైన స్థలం –
    ప్రభాస తీర్థం, సోంనాథ్, గుజరాత్

  • జనమేజయుడు సర్పయాగం చేసిన స్థలం – పర్హాం,ఉత్తర్ ప్రదేశ్

  • కపిలవస్తు (బుద్ధుని జన్మస్థలం)-ల నేపాల్ లోని తిలార్కోట్
    *
    బుద్ధునికి జ్ఞానోదయం అయిన స్థలం- బోధ్ గయ, బీహార్

  • గౌతమ బుద్ధుడు నిర్యాణం చెందిన చోటు- కుశీనగర్, ఉత్తర్ ప్రదేశ్…..

Leave a Reply