తెలుగు వారి వంటలు

0
86

వంకాయ ఉల్లిపాయ కూర

కావలసిన పదార్షాలు:-

పొడుగు వంకాయలు 1/2 కిలో, ఉల్లిపాయలు 4, కారం 1/2 స్పూను, ఉప్పు తగినంత, పసుపు 1/2 స్పూను, నూనె 50 గ్రాములు, పోపు గింజలు.

తయారు చేయు విధానము:-

ముందుగా ఉల్లిపాయలు కోసి పక్కన పెట్టుకోవాలి. వంకాయలు నీళ్లలో తరగాలి. పొయ్యి మీద గిన్నె
పెట్టి నూనె వేసి, కాగిన తరువాత పోపు వేయాలి. పైన నీళ్ల మూత పెట్టాలి. ఈ కూర సన్నని సెగతోనే

చేయాలి. సగం మగ్గాక ఉల్లిపాయ ముక్కలు వేయాలి. ఉల్లిపాయలు కూడా మగ్గాక పసుపు, ఉప్పు,
కారం వేసి కారం పచ్చి వాసనా పోయేదాకా 2 నిముషాలు ఉంచి దించి వేరే గిన్నెలోకి
మార్చుకోవచ్చు. నలుగురు, ఐదుగురికి వస్తుంది.

Leave a Reply