17, మార్చి , 2021 సౌమ్య వాసరే దినఫలాలు

0
17, మార్చి , 2021 సౌమ్య వాసరే దినఫలాలు

ఓం శ్రీ గురుభ్యోనమః
శుభమస్తు
17, మార్చి , 2021 సౌమ్య వాసరే
రాశి ఫలాలు

మేషం
విజయావకాశాలు మెరుగవుతాయి. శత్రువులపై మీదే పైచేయి అవుతుంది. ఆర్థిక వ్యవహారాల్లో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఇష్టదైవ నామస్మరణ ఉత్తమం.

వృషభం
చేపట్టే పనుల్లో పట్టుదల వదలకండి. గిట్టనివారు మీ ఉత్సాహంపై నీళ్లు చల్లుతారు. మనోవిచారం కలిగించే సంఘటనలకు దూరంగా ఉండాలి.
దైవధ్యానంతో ఆపదల నుంచి బయటపడతారు.

మిధునం
శ్రమ ఫలిస్తుంది. మిత్రుల ద్వారా మేలు జరుగుతుంది. మనసుపెట్టి పనిచేస్తే విజయం మీదే. ప్రయాణాల్లో జాగ్రత్తలు అవసరం.
దత్తాత్రేయ ఆరాధన శుభదాయకం.

కర్కాటకం
శుభకాలం నడుస్తోంది. అభివృద్ధిని సాధించే దిశగా ఆలోచనలు చేస్తారు. ఉత్సాహంగా ఉంటారు. కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా గడుపుతారు. ఇష్టదైవ ప్రార్థన చేస్తే మంచిది.

సింహం
మీ మీ రంగాల్లో మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. గతంలో నిర్లక్ష్యం చేసిన కొన్ని అంశాలు ఇబ్బందిపెడతాయి. కొన్ని పరిస్థితులు మిమ్మల్ని నిరుత్సాహపరుస్తాయి. పనులకు ఆటంకం కలుగకుండా చూసుకోవాలి. గోసేవ చేయడం ద్వారా మరిన్ని శుభ ఫలితాలు పొందుతారు.

కన్య
కొద్దిపాటి సమస్యలు ఉన్నప్పటికీ అనుకున్న పనులను సకాలంలో పూర్తిచేస్తారు. మానసికంగా దృఢంగా ఉంటారు. బంధువులతో మాటపట్టింపులకు పోవద్దు. శని శ్లోకం చదవాలి.

తుల
ఒక వ్యవహారంలో మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. బంధువులతో విభేదాలు వచ్చే సూచనలు ఉన్నాయి. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ఇష్టదైవ సందర్శనం మేలు చేస్తుంది.

వృశ్చికం
మీ మీ రంగాల్లో శుభం చేకూరుతుంది. బంధువుల సహకారం లభిస్తుంది. ఒక శుభవార్త మీ మనోధైర్యాన్ని పెంచుతుంది. అపరిచితులతో జాగ్రత్త.
దైవారాదన మానవద్దు.

ధనుస్సు
కొన్ని సంఘటనలు మనోబలాన్ని తగ్గించేవిధంగా ఉంటాయి. మీ ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. కుటుంబ సభ్యుల మాటకు గౌరవమిస్తే మంచిది. కోపాన్ని తగ్గించుకోవాలి.
నవగ్రహ శ్లోకాలు పఠిస్తే శుభప్రదం.

మకరం
చేపట్టే పనుల్లో ఆటంకాలు పెరగకుండా చూసుకోవాలి. విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. మీ కీర్తిప్రతిష్టలు పెరుగుతాయి. కీలక వ్యవహారాల్లో మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. ఈశ్వర సందర్శనం శుభదాయకం.

కుంభం
ధర్మసిద్ధి ఉంది. స్వస్థాన ప్రాప్తి కలదు. చేపట్టిన పనులను పట్టుదలతో ప్రణాళికాబద్ధంగా పూర్తిచేయగలుగుతారు. భవిష్యత్ ప్రణాళికలు వేస్తారు. ఒక శుభవార్త మీ మనోధైర్యాన్ని పెంచుతుంది. ఇష్టదైవారాధన మేలుచేస్తుంది.

మీనం
భవిష్యత్ ప్రణాళికలు వేస్తారు. ఒక శుభవార్త మీ మనోధైర్యాన్ని పెంచుతుంది. స్థానచలన సూచనలు ఉన్నాయి. కొన్ని సమయాల్లో అస్థిరబుద్ధితో వ్యవహరిస్తారు. దుర్గాస్తుతి చేస్తే మంచిది.

Leave a Reply

%d bloggers like this: