Home PANCHANGAM రాశి ఫలాలు 16, మార్చి , 2021 భౌమ వాసరే

రాశి ఫలాలు 16, మార్చి , 2021 భౌమ వాసరే

0
రాశి ఫలాలు 16, మార్చి , 2021 భౌమ వాసరే

ఓం శ్రీ గురుభ్యోనమః
శుభమస్తు
16, మార్చి , 2021 భౌమ వాసరే
రాశి ఫలాలు

మేషం
మంచి ఆలోచనలతో చేసే పనులు త్వరగా సిద్ధిస్తాయి. ఒక సంఘటన మానసిక శక్తిని పెంచుతుంది. స్థానచలన సూచనలు కనిపిస్తున్నాయి. మానసిక ప్రశాంతత తగ్గకుండా చూసుకోవాలి. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన శుభ ఫలితాలను ఇస్తుంది.

వృషభం
కీలక విషయాల్లో ఆచి తూచి వ్యవహరించాలి. మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. బంధుమిత్రులతో కలిసి కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. భవిష్యత్ ప్రణాళికలు వేస్తారు. హనుమాన్ చాలీసా పఠిస్తే మంచిది.

మిధునం
చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. అభివృద్ధి కోసం మీరు తీసుకునే నిర్ణయాలు ఫలిస్తాయి. శివారాధన శుభదాయకం.

ర్కాటకం
సమాజంలో మీ కీర్తిప్రతిష్టలు పెరుగుతాయి. దైవభక్తి పెరుగుతుంది. అవసరానికి తగిన సాయం లభిస్తుంది. ప్రయాణాల్లో అప్రమత్తంగా ఉండాలి. ఒక వార్త లేదా సంఘటన బాధ కలిగిస్తుంది. విష్ణు ఆరాధన శుభప్రదం.

సింహం
ఒక ముఖ్యమైన సమస్య పరిష్కారమవుతుంది. సమయానికి తగిన సహాయం చేసేవారున్నారు. కీలక వ్యవహారాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. కొన్ని పరిస్థితులు బాధ కలిగిస్తాయి. హనుమాన్ చాలీసా చదివితే మంచిది. .

కన్య
పట్టుదలతో పనులు పూర్తి చేస్తారు. మీ మీ రంగాల్లో సొంత నిర్ణయాలు అనుకూలిస్తాయి. కీలక విషయాల్లో తోటివారి సలహాలు తప్పనిసరి. సమయం వృథా చేయవద్దు. హనుమాన్ చాలీసా పఠించాలి.

తుల
ఉత్సాహంగా పనిచేయాలి. గొప్ప సంకల్పబలంతో తలపెట్టిన పనులను పూర్తి చేస్తారు. ప్రయాణాల్లో ఆటంకాలు ఉంటాయి. శ్రీ వేంకటేశ్వరస్వామి సందర్శనం శుభదాయకం. .

వృశ్చికం
ఆత్మవిశ్వాసం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. ఒక వార్త మీ మనోబలాన్ని పెంచుతుంది. మీ స్వధర్మం మిమ్మల్ని కాపాడుతుంది. లక్ష్మీదేవి సందర్శనం శుభప్రదం.

ఈవారం
మనోధైర్యంతో చేసే పనులు వెంటనే సిద్ధిస్తాయి. నిరంతర శ్రమతో సంకల్పాలు సిద్ధిస్తాయి. వ్యాపారంలో అభివృద్ధి కోసం చేసే ప్రయోగాలు విజయవంతం అవుతాయి. మనసులోని కోరికలు నెరవేరుతాయి. అవసరానికి సహాయం చేసేవారున్నారు. ఒక శుభవార్త వింటారు. మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. విందు వినోదాల్లో ఆనందంగా గడుపుతారు. భోజన సౌఖ్యం కలదు. ఒక వార్త మీ ఇంట ఆనందాన్ని కలిగిస్తుంది. ప్రయాణాలు ఫలిస్తాయి. వెంకటేశ్వరస్వామి ధ్యానం శుభప్రదం.

నుస్సు
తలపెట్టిన కార్యాలు విజయవంతంగా పూర్తవుతాయి. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. శత్రువులపై నైతికంగా విజయం సాధిస్తారు. ఒక శుభవార్త మీ ఇంట ఆనందాన్ని నింపుతుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. శని ధ్యానం చేయడం ద్వారా శుభ ఫలితాలు పొందుతారు.

మకరం
ఒక ముఖ్యమైన పనిని విజయవంతంగా పూర్తిచేస్తారు. ఉత్సాహవంతమైన వాతావరణం నెలకొంటుంది. ఎటువంటి పరిస్థితుల్లోనైనా మనోధైర్యంతో ముందుకు సాగి అనుకున్నది సాధిస్తారు. మహా గణపతి ఆరాధన శుభప్రదం.

కుంభం
పెద్దలు సూచించిన మార్గంలో ముందుకు సాగి మంచి ఫలితాలను అందుకుంటారు. ధన, ధాన్య లాభాలున్నాయి. మనస్సౌఖ్యం కలదు. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. సమయానుకూలంగా ముందుకు సాగితే మంచి జరుగుతుంది. హనుమత్ ఆరాధన ఉత్తమం.

మీనం
ఉత్సాహవంతంగా కాలాన్ని గడుపుతారు. గతంలో పూర్తికాని ఒక పని ఇప్పుడు పూర్తవుతుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఇష్టదైవ నామాన్ని జపిస్తే మరిన్ని శుభ ఫలితాలు కలుగుతాయి.

Leave a Reply

%d bloggers like this: