Home Uncategorized రాశి ఫలాలు 15, మార్చి , 2021 ఇందు వాసరే

రాశి ఫలాలు 15, మార్చి , 2021 ఇందు వాసరే

0

ఓం శ్రీ గురుభ్యోనమః
శుభమస్తు
15, మార్చి , 2021 ఇందు వాసరే
రాశి ఫలాలు

మేషం
తలపెట్టిన పనులు సునాయాసంగా పూర్తవుతాయి. ఒక శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. మీ ప్రతిభను పెద్దలు పెంచుకుంటారు. అవసరాలకు దానం చేకూరుతుంది. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. ఆదిత్య హృదయ పారాయణం చేయడం మంచిది.

వృషభం
కీలకమైన పనులను ప్రారంభిస్తారు. మీ ధర్మం మిమ్మల్ని ఉన్నతుల్ని చేస్తుంది. మొహమాటం వల్ల ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఆహార నియమాలను పాటించాలి. వేంకటేశ్వర స్వామిని సందర్శించడం మంచిది.

మిధునం
మీ మీ రంగాల్లో ఆటంకాలు ఎదురైన వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తారు. బంధుప్రీతి ఉంది. ఒక ముఖ్యమైన పనిలో కదలిక వస్తుంది. ఒ ఒక శుభవార్త మీ మనోదైర్యాన్ని పెంచుతుంది. గోసేవ చేయాలి.

కర్కాటకం
ఉత్సాహభరితమైన వాతావరణం ఉంటుంది. మీకు కొత్త బాధ్యతలను పెద్దలు అప్పగిస్తారు. మానసికంగా ద్రుడంగా ఉంటారు. బంధు గృహాలయందు సుఖ భోజనం చేస్తారు. కీలక విషయాల్లో శుభపరిణామాలు చోటుచేసుకుంటాయి. ఇష్టదైవ నామస్మరణ మంచిది.

సింహం
మిశ్రమ వాతావరణం ఉంటుంది. కొన్ని పరిస్థితులు ఇబ్బంది పెడతాయి. చంచలబుద్ధితో వ్యవహరించి తప్పుడు నిర్ణయాలు తీసుకుంటారు. గోసేవ చేయడం మంచి ఫలితాలనిస్తుంది .

కన్య
ముఖ్య విషయాల్లో పెద్దల ఆశీర్వచనాలు అందుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. అనవసర ధనవ్యయ సూచితం. అనారోగ్య సమస్యలు కాస్త ఇబ్బందిపెడతాయి. నవగ్రహ స్తోత్రం పారాయణ చేస్తే మంచిది

తుల
శారీరక శ్రమ పెరగుతుంది. బంధువులతో వాదులాటలకు దిగకపోవడమే మంచిది. అనవసర ధనవ్యయం జరిగే సూచనలు ఉన్నాయి. అధికారులను మెప్పించడానికి కాస్త కష్టపడాల్సి వస్తుంది. దైవారాధన మానవద్దు .

వృశ్చికం
శుభకాలం. మనోధైర్యంతో అనుకున్నది సాధిస్తారు. ఒక పనిలో మీకు అధికారుల ప్రశంసలు లభిస్తాయి. అర్థ, వస్త్ర లాభాలున్నాయి. ఇష్టదేవతా శ్లోకాలు చదివితే చేస్తే బాగుంటుంది.

ధనుస్సు
ఏ పని తలపెట్టినా నిర్విఘ్నంగా పూర్తవుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో మేలైన ఫలితాలుంటాయి. ఆర్థిక పరమైన విషయాలలో మీరు ఆశించిన ఫలితాలు వస్తాయి. ఇష్టదైవారాధన శుభప్రదం.

మకరం
శుభకాలం. దూరదృష్టితో ముందస్తు ప్రణాళికలను సిద్ధంచేసుకుంటారు. కీలక అంశాల్లో పెద్దలను సంప్రదించడం ఉత్తమం. రుణ సమస్యలు తగ్గుతాయి. ఇష్టదేవతా ఆరాధన శుభప్రదం.

కుంభం
శ్రమకు తగిన ఫలితం ఉంటుంది. ఒక వ్యవహారంలో తోటివారి సాయం అందుతుంది. శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. అవసరానికి డబ్బు చేతికి అందుతుంది. ఆదిత్య హృదయం పఠించాలి.

మీనం
మంచి ఫలితాలున్నాయి. ఒక వార్త ఆనందాన్నిస్తుంది. బంధుమిత్రులతో కలిసి చేసే పనులు సత్ఫలితాన్నిస్తాయి. ఒక ముఖ్యవ్యవహారంలో మీరు ఆశించిన పురోగతి ఉంటుంది. ఆదిత్య హృదయం పఠించాలి.

Leave a Reply

%d bloggers like this: