
ఓం శ్రీ గురుభ్యోనమః
శుభమస్తు
13, మార్చి , 2021
స్థిర వాసరే(శనివారం)
రాశి ఫలాలు
మేషం
తోటివారి సహకారంతో అనుకున్నది సాధిస్తారు. కుటుంబ వ్యవహారాలలో అప్రమత్తంగా ఉండాలి. తప్పుదారి పట్టించే వారున్నారు జాగ్రత్త. సాయి నామాన్ని జపించాలి.
వృషభం
సంపూర్ణ విశ్వాసంతో ముందుకు సాగి అనుకున్న ఫలితాలు సాధిస్తారు. వృథా ప్రయాణాలు చేయకండి. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. శ్రీ వేంకటేశ్వర స్వామి సందర్శనం శుభప్రదం.
మిధునం
ముఖ్య విషయాల్లో అశ్రద్ధ రానీయకండి. ఆత్మవిశ్వాసంతో పనులను పూర్తిచేస్తారు. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. బంధుమిత్రులతో సత్సంబంధాలు ఏర్పడతాయి. ఇష్టదైవ ప్రార్థన శుభాన్నిస్తుంది.
కర్కాటకం
ప్రయత్న కార్య సిద్ధి కలదు. మానసికంగా ధృడంగా ఉంటారు. కలహాలకు తావివ్వరాదు.
ఇష్టదైన ప్రార్థన చేయడం ద్వారా మరింత శుభఫలితాలు పొందుతారు.
సింహం
మీ శ్రమకు గుర్తింపు లభిస్తుంది. అధికారులు మీకు అనుకూలమైన ఒక నిర్ణయాన్ని తీసుకుంటారు. కీలక నిర్ణయాలతో కొన్ని కీలక పనులను విజయవంతంగా పూర్తిచేయగలుగుతారు. శివస్తోత్రం పఠిస్తే మంచిది.
కన్య
తలపెట్టిన పనులను విజయవంతంగా పూర్తిచేయగలుగుతారు. కీలక బాధ్యతలు మీ భుజాన పడతాయి. వాటిని సమర్థంగా నిర్వహించి అందరి ప్రశంసలూ పొందుతారు. దైవారాదన మానవద్దు. శివారాధన శుభప్రదం.
తుల
వృత్తి ఉద్యోగ వ్యాపారాది రంగాలలో మిశ్రమ వాతావరణం కలదు. పనులకు ఆటంకం కలుగకుండా చూసుకోవాలి. గతంలో నిర్లక్ష్యం చేసిన కొన్ని అంశాలు ఇబ్బందిపెడతాయి. కొన్ని పరిస్థితులు మిమ్మల్ని నిరుత్సాహ పరుస్తాయి. గోసేవ చేయడం వలన మంచి ఫలితాలు పొందుతారు.
వృశ్చికం
నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. శుభకార్యక్రమాలలో పాల్గొంటారు. బంధుమిత్రుల వల్ల మేలు జరుగుతుంది. ఒక శుభవార్త మీ ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది. కనకధార స్తోత్రం పఠించడం వలన శుభ ఫలితాలు కలుగుతాయి.
ధనుస్సు
ఆత్మీయులతో సంతోషంగా గడుపుతారు. వస్త్ర, ధాన్యాది లాభాలున్నాయి. ఆర్థికంగా అనుకూల ఫలితాలు ఉన్నాయి. శాంతంగా వ్యవహరించండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సందర్శనం మేలు చేస్తుంది.
మకరం
శ్రమ పెరుగుతుంది. ఉత్సాహం తగ్గకండా చూసుకోవాలి. ఇష్టసల్లాపం ఉంది. కొత్తవస్తువులు కొంటారు. *ఆంజనేయుడిని ఆరాధించడం వలన మంచి ఫలితాలు కలుగుతాయి.
కుంభం
కొన్ని కీలక నిర్ణయాలు మీకు అనుకూలంగా వెలువడతాయి. నూతన వస్తువులను కొంటారు. బుద్ధిబలం బాగుంటుంది. కీలక సమయాలలో సరైన నిర్ణయాలు తీసుకుంటారు. బంధువులతో ఆనందంగా గడుపుతారు. ఆంజనేయ ఆరాధన మంచిది.
మీనం
ధనలాభం ఉంది. అనవసర తగాదాలకు తావివ్వకండి. ఒక విషయంలో మనః సంతోషాన్ని పొందుతారు. విష్ణు సహస్రనామాలు చదివితే మంచి జరుగుతుంది.