Home PANCHANGAM రాశి ఫలాలు 12, మార్చి , 2021 భృగు వాసరే

రాశి ఫలాలు 12, మార్చి , 2021 భృగు వాసరే

0
రాశి ఫలాలు 12, మార్చి , 2021 భృగు వాసరే

ఓం శ్రీ గురుభ్యోనమః
శుభమస్తు
12, మార్చి , 2021 భృగు వాసరే
రాశి ఫలాలు

మేషం
కొన్ని కీలకమైన ప్రణాళికలు వేసి వాటిని అమలు చేస్తారు. మనోధైర్యంతో అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తారు. కలహ సూచన ఉంది. అనవసర విషయాల్లో తల దూర్చకండి. వేంకటేశ్వర స్వామి సందర్శనం మంచిది

వృషభం
సమయాన్ని దృష్టిలో పెట్టుకుని పనిచేయండి. మంచి ఫలితాలను అందుకుంటారు. అధికారులతో అప్రమత్తంగా ఉండాలి. అనవసరంగా భయాందోళనలకు గురవుతారు. ఈశ్వర సందర్శనం ఉత్తమ ఫలితాలన్నిస్తుంది.

మిధునం
సందర్భోచితంగా కీలక నిర్ణయాలు తీసుకుంటే మంచిది. ఆచార వ్యవహారాలకు పెద్దపీట వేస్తారు. గిట్టనివారితో మితంగా మాట్లాడితే మంచిది. సుబ్రహ్మణ్యస్వామి సందర్శనం శుభప్రదం.

ర్కాటకం
కుటుంబ సౌఖ్యం కలదు. మీ మీ రంగాల్లో అభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. ఆర్థికాభివృద్ధి ఉంది. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. శివ నామస్మరణ శుభ ఫలితాలనిస్తుంది

సింహం
ఒక శుభవార్త మీ మనోధైర్యాన్ని పెంచుతుంది. భవిష్యత్ ప్రణాళికలు వేస్తారు. కొన్ని సమయాల్లో అస్థిరబుద్ధితో వ్యవహరిస్తారు. చంచలత్వాన్ని దరిచేరనీయకండి. దుర్గా స్తుతి చేస్తే మంచిది.

కన్య
ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. సొంతింటి వ్యవహారంలో ముందడుగు పడుతుంది. బంధుమిత్రులను కలుస్తారు. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఒక వార్త బాధ కలిగిస్తుంది. సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం పఠిస్తే శుభదాయకం.

తుల
కీలక విషయాల్లో సొంత నిర్ణయాలు పనిచేయవు. తోటివారి సలహాలు తప్పనిసరి. కొందరి ప్రవర్తన మీకు ఇబ్బంది కలిగిస్తుంది. సమయాన్ని వృథా చేయవద్దు. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. నవగ్రహ ఆరాధన శుభప్రదం.


వృశ్చికం
స్వధర్మం మిమ్మల్ని కాపాడుతుంది. మానసిక ఆనందం కలిగి ఉంటారు. ఉత్సాహంగా పనిచేస్తారు. ఎవ్వరినీ ఎక్కువగా నమ్మరాదు. శ్రీరామనామాన్ని జపించడం ఉత్తమం.

ధనుస్సు
లాభదాయకమైన కాలం. తెలివితేటలతో ఆలోచించి కొన్ని కీలకమైన పనులను పూర్తి చేయగలుగుతారు. విందు, వినోదాల్లో పాల్గొంటారు. ఆంజనేయ స్తోత్ర పారాయణ చేయాలి.

మకరం
లక్ష్యంపై మనస్సుని లగ్నం చేయండి. మంచి ఫలితాలను అందుకుంటారు. మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. సొంత నిర్ణయాలు వికటిస్తాయి. కొందరి ప్రవర్తన మీకు ఇబ్బంది కలిగిస్తుంది. సమయాన్ని వృథా చేయవద్దు. ఇష్టదైవారాధన ఉత్తమం

కుంభం
తోటివారి సహకారం లభిస్తుంది. పనుల్లో ఆటంకాలు తొలగుతాయి. ఆర్థికంగా పురోగతి ఉంటుంది. ఒక శుభవార్త ఆనందాన్నిస్తుంది. శ్రీరామనామాన్ని జపిస్తే మేలు జరుగుతుంది.


మీనం
అనుకున్న పనులను అనుకున్నట్టు పూర్తి చేయగలుగుతారు. కొన్ని వ్యవహారాల్లో ధైర్యంగా వ్యవహరించి అందరి ప్రశంసలు అందుకుంటారు. ఒక సంఘటన ఆత్మశక్తిని పెంచుతుంది. దుర్గాదేవి ధ్యానం శుభప్రదం

Leave a Reply

%d bloggers like this: