శివలింగాభిషేకం వివిధ ఫలితాలు

0
75
శివ పురాణం
శివ పురాణం

శివలింగాభిషేకం వివిధ ఫలితాలు

1.గరిక నీటితో శివాభిషేకము చేసిన నష్టమైన ద్రవ్యము తిరిగి పొందగలడు.

2 .నువ్వుల నూనెతో అభిషేకించిన అపమృత్యువు నశించ గలదు.

3 .ఆవు పాల అభిషేకం సర్వ సౌఖ్యములను ప్రసాదించును

4 .పెరుగుతో అభిషేకించిన బలము, ఆరోగ్యము, యశస్సు లభించును.

5 .ఆవు నేయితో అభిషేకించిన ఐశ్వర్య ప్రాప్తి కలుగును

  1. చెరకు రసముతో అభిషేకించిన ధన వృద్ది కలుగును.

7 .మెత్తని చేక్కరతో అభిషేకించిన దుఃఖ నాశనము కలుగును

8 .మారేడు బిల్వదళ జలము చేత అభిషేకము చేసిన భోగభాగ్యములు లభించును.

9 .తేనెతో అభిషేకించిన తేజోవృద్ది కలుగును.

10.పుష్పోదకము చేత అభిషేకించిన భూలాభము కలుగును.

11.కొబ్బరి నీటితో అభిషేకము సకల సంపదలను కలిగించును.

12 .రుద్రాక్ష జలాభిషేకము సకల ఐశ్వర్యములనిచ్చును.

13 .భస్మాభిషేకంచే మహా పాపాలు నశించును.

14 .గందోదకము చేత అభిషేకించిన సత్పుత్ర ప్రాప్తి కలుగును.

15 .బంగారపు నీటితో అభిషేకము వలన ఘోర దారిద్రము నశించును.

16 .నీటితో అభిషేకించిన నష్టమైనవి తిరిగి లభించును

17 .అన్నముతో అభిషేకించిన అధికార ప్రాప్తి, మోక్షము మరియు దీర్ఘాయువు లభించును.
శివపూజలో అన్న లింగార్చనకు ప్రత్యేక ప్రాధాన్యత కలదు – పెరుగు కలిపిన అన్నాన్ని మెత్తగా రుబ్బి దాంతో లింగాకారానికి లేపనంలాగా రాస్తారు చూడటానికి చాలా అద్భుతంగా ఉంటుంది.

18 మామిడి పళ్ళ రసంతో అభిషేకం చేస్తే దీర్ఘకాలవ్యాదులు నయమగును.

19 కస్తురి కలిపిన నీటితో అభిషేకం చేస్తే చక్రవర్తి యోగం కలుగును.

20 పసుపు కలిపిన నీటితో అభిషేకం చేస్తే మంగళ ప్రదమగును శుభకార్యాలు జరుగును.

Leave a Reply