09, మార్చి , 2021 సౌమ్య వాసరే దినఫలాలు

0
09, మార్చి , 2021 సౌమ్య వాసరే దినఫలాలు

ఓం శ్రీ గురుభ్యోనమః
శుభమస్తు
09, మార్చి , 2021 సౌమ్య వాసరే
రాశి ఫలాలు

మేషం
చేపట్టే పనుల్లో పట్టుదల వీడొద్దు. ఉద్యోగంలో పై అధికారులతో నమ్రతగా వ్యవహరించాలి. గిట్టనివారు మీ ఉత్సాహంపై నీళ్లు చల్లుతారు. మనోవిచారం కలిగించే సంఘటనలకు దూరంగా ఉండాలి. దైవధ్యానంతో ఆపదల నుంచి బయటపడతారు.

వృషభం
చేపట్టే పనులకు ఆటంకాలు ఎదురవకుండా చూసుకోవాలి. మీ అభివృద్ధికి దోహదపడే ఒక కీలక నిర్ణయాన్ని తీసుకుంటారు. అకారణ కలహ సూచన. కుటుంబంలో చిన్నపాటి సమస్యలు వస్తాయి. హనుమాన్ చాలీసా చదవడం మంచిది.

మిధునం
లక్ష్యాలకు కట్టుబడి పనిచేస్తారు. లేనిపోని ఆలోచనలతో కాలాన్ని వృథా చేయకండి. కుటుంబ సభ్యులతో ఆచితూచి వ్యవహరించాలి. మనో విచారం కలగకుండా చూసుకోవాలి. ప్రయాణంలో ఆటంకాలు కలుగుతాయి. శివారాధన శుభప్రదం.

కర్కాటకం
తలపెట్టిన కార్యాల్లో విజయసిద్ధి ఉంది. ఒక శుభవార్త ఉత్సాహాన్నిస్తుంది. విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. తోటివారి సహాయ సహకారాలున్నాయి. దైవబలం రక్షిస్తోంది.
శ్రీ వెంకటేశ్వర సందర్శనం శుభప్రదం.

సింహం
మనసుపెట్టి పనిచేస్తే విజయం మీదే. మిత్రుల వల్ల మేలు జరుగుతుంది. శ్రమ అధికమవుతుంది. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. దత్తాత్రేయ స్వామి ఆరాధన మంచి ఫలితాన్నిస్తుంది.

కన్య
చేపట్టిన పనులలో ఆటంకాలు ఎదురవుతాయి. శారీరక శ్రమ కాస్త పెరుగుతుంది. కొన్ని పరిస్థితులు నిరుత్సాహపరుస్తాయి. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకండి. అపమృత్యు భయం వల్ల మనశ్శాంతి తగ్గుతుంది.
శని శ్లోకం చదవాలి.

తుల
మధ్యమ ఫలితాలున్నాయి. వాదప్రతివాదాల జోలికి పోకుండా ఉండటం మేలు. గోసేవ చేయడం వలన మంచి ఫలితాలు కలుగుతాయి. చంద్ర శ్లోకం చదవడం మంచిది.

వృశ్చికం
స్పష్టమైన ఆలోచనా విధానంతో అనుకున్నది సాధిస్తారు. రెట్టింపు ఉత్సాహంతో పనిచేయండి. ఆర్ధిక లాభాలున్నాయి. పట్టుదలతో వ్యవహరించి పనులను పూర్తిచేస్తారు. మీకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా పూర్తిచేస్తారు. సమయానికి సహాయం చేసేవారున్నారు. సమయానుకూలంగా ముందుకు సాగండి. చిన్నచిన్న పొరపాట్లు దొర్లినా అంతిమ విజయం మీదే అవుతుంది. ఏకాగ్రత తగ్గకుండా చూసుకోవాలి. పెద్దల ఆశీర్వచనాలు మిమ్మల్ని రక్షిస్తూ ఉంటాయి. ఇష్టదేవతా సందర్శనం విఘ్నాలను తొలగిస్తుంది.

ధనుస్సు
శుభప్రదమైన కాలాన్ని గడుపుతారు. బాధ్యతలను సమర్థవంతంగా పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యుల సలహాలతో విజయాలు సాధిస్తారు. సాయిబాబా వారి సచ్ఛరిత్ర పారాయణ శుభాన్నిస్తాయి.

మకరం
చేపట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తిచేసి అధికారుల ప్రశంసలు అందుకుంటారు. మీ బుద్ధిబలంతో కీలక సమస్యలను పరిష్కరిస్తారు. కుటుంబసభ్యుల సహకారం ఉంటుంది.
శివ నామస్మరణ చేస్తే మేలు.

కుంభం
పనుల్లో విజయం సాధిస్తారు. తోటివారి సహకారంతో ఆటంకాలను అధికమిస్తారు. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. ఇష్టదైవ స్తోత్రాన్ని చదవడం మంచిది.

మీనం
ఆత్మవిశ్వాసంతో పనిచేస్తే తప్పక విజయం సిద్ధిస్తుంది. చేసే పనిలో తడబాటు రానీయకండి. మనోధైర్యంతో చేసే పనులు విజయాన్నిస్తాయి. కలహ సూచన ఉంది. ఆవేశపూరిత నిర్ణయాలు వద్దు.
దుర్గా అష్టోత్తర శతనామావళి పఠిస్తే మంచిది.

Leave a Reply

%d bloggers like this: